జన వేమన –14 వేమన గురించి కధలు గాధలు —

   జన వేమన –14
వేమన గురించి కధలు గాధలు —

ప్రోలయ వేమా రెడ్డి డ్డి ,అన వేమా రెడ్డి కొడుకులు .అనపోతా రెడ్డి రాజై 1362వరకు రాజ్యమేలాడు .తర్వాతా తమ్ముడు రాజై,1380వరకు పాలించాడు .ఇతడు కవి ,పండితుడు ,రసజ్ఞుడు .కవుల పాలిటి కల్ప వృక్షం .తర్వాతా అనపోతవేమా రెడ్డి కుమారుడు ”కుమార గిరి వేమా రెడ్డి ” 1400 వరకు రాజ్య పాలన చేశాడు .”అనంత రాజీయం ”అనే నాట్య శాస్త్ర గ్రంధ కర్త .ఈయన తర్వాతా ఇతని పేద తాత మనవడు ”పేద కోమటి వేమా రెడ్డి ”కొండ వీటి కి రాజై ,1420 వరకు పాలించాడు .”సర్వజన చక్ర వర్తి ”బిరుదాంకితుడు .శ్రీ నాద కవి ని ఆస్థాన కవి ని చేశాడు .”అమరుక ”కావ్యానికి ”అమరక దీపిక ”వ్యాఖ్యానం రాశాడు .ధరణి కోట లో జరిగిన యుద్ధం లో పేద కోమటి వేమా రెడ్డి తమ్ము డైన ,”మాచయ ”ను దేవగిరి చంపేశాడు.దేవ గిరి ని వేమా రెడ్డి చంపాడు .దేవగిరి లింగయ ప్రతీ కారం తో పేద కోమటి వేమా రెడ్డి ని చంపేశాడు .ఇదంతా ఎందుకు అంటే -మన వేమన ఈ కాలానికి చెందినా వాడే అని చెప్ప టానికే .
పేద కోమటి వేమా రెడ్డి కొడుకు రాచ వేమా రెడ్డి1420-24 వరకు రాజ్య పాలన చేశాడు .ఈయనే కొండ వీటి రెడ్డి రాజుల్లో చివరి వాడు .”పురిటి పన్ను ”విధించి ,జన కన్తకుదయాడు .”సీరం ఎల్లప్పు ”అనే బలిజ నాయకుడు ముత్యాలమ్మ గుడి దగ్గర వేమా రెడ్డి ని చంపాడు .దీనితో రెడ్డి రాజ్యం నిర్మూలమైంది .వేమా రెడ్డి కొడుకు రాచావేముడు .ఇతని తమ్ముడే వేమన అని అంటారు .వేమన పడి హేనవ శతాబ్ది వాడు కాదని పదిహేడవ శతాబ్దం వాడని బ్రౌన్ అన్నాడు .మాక్లిన్ దొర పద్దేనిమిదివ శతాబ్ది వాడని చెప్పాడు .మొత్తం మీద వేమన రెడ్డి కులానికి చెందినా వాడు అని తెల్తోంది .వేమన పద్యం కూడా దీన్ని ద్రువీకరిస్తోంది .”మనమున వేసిన మైనపు జడ్డి -ప్రనతము నీదగు రావుల దొడ్డి -యనువున జేసెను నందన నొడ్డి -విత్తము గా గాను వేమన్న రెడ్డి ”అన్న ఓరియెంటల్ లైబ్రరీ లోని ప్రతి సాక్షం గా కానీ పిస్తోంది .దాదాపు అందరు వేమన 1652వాడు అని చివరికి తేల్చారు .జన్మ స్తలం ”కొండ వీడు ”అని వేమన చెప్పుకొన్నాడు .ఆ పట్నం లో 82పేటలు ఉండేవి .అందులో మూగ చింత పల్లి అనే పేట లో మొదటి ఇల్లు వేమన గారిదే నట .
తను జన్మించిన కాలాన్ని వేమన ఒక పద్యం లో బంధించాడు ”నందన సంవత్సరమున -పొందుగా గార్తీక శుద్ధ పున్నమి నాడున్ -వింధ్యాద్రి సేతు బంధన న్-సందున నొక వీరు డేగు సరగున వేమా ”అన్నీ పరి శీలించి ,1412వ సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వేమన జన్మించి నట్లు తేల్చారు .68ఏళ్ళు జీవించి ,1480 శార్వరి -చైత్ర శుద్ధ నవమి నాడు వేమన సిద్ధి పొందాడు .ఈ విషయాన్ని కవి కోకిల ,వాస్తు విశారద ,అముద్రిత వాజ్మయ శేఖర శ్రీ నేడు నూరి గంగాధరం గారు ”మాహా యోగి వేమన కవి జీవితం ”లో విపులం గా వ్రాసి చదువరులకు అపూర్వ కానుక గా అందించారు .
                     రెండో కధ
వేమన కొండ వీటి రెడ్డి వంశం ”కనుగొల్ల ”గోత్రం వాడని ,అసలు పేరు పుల్లా రెడ్డి అని ,అన్నగారు రాజు అని తెలుస్తోంది .అన్నతో పోట్లాడి ,తల్లితో కదిరి పట్టణం దగ్గర ..నల్ల చెరువు ”అనే ప్రదేశానికి వచ్చి ,వ్యవసాయం చేసుకొంటూ జీవించాడని ఒక రోజు నెత్తిన పిడుగు పడి చని పోయాడని దహన క్రియలు జరుప బాగా ,తల్లికి కలలో కన్పించి యేడు రోజుల్లో తాను బ్రతుకు తా నని చెప్పాడని ,ఎనిమిదవ రోజు న పు నరుత్తానం చెందాడని ఆశ్చర్య పడిన జనం తో తాను పుల్లా రెడ్డి కాదని ”వేమన ”అని చెప్పాడని ఒక కధ ప్రచారం లో ఉంది.ఆ తర్వాత అనేక మహాత్యాలు చూపుతూ ,దేశ సంచారం చేస్తూ ,కడప జిల్లా రాజం పెట దగ్గర ”కోడూరు ”చేరాడని ,తల్లి అచ్చమ్మ ,భార్య ఆది లక్ష్మి కుచ్చెర్ల పాడు లో మరణించారని వాళ్ళిద్దరికీ వేమన సమాధులు కట్టించాడని అవి ఇప్పటికి అక్కడ ఉన్నాయని ,తర్వాత ”కటార్ల పల్లె ”చేరి జీవ సమాధి పొందాడని ఇంకో కధ ఉందని శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు ”వేమన ”పుస్తకం లో వివ రించారు .అయితే ఆ వేమన మన వేమన కాదని తేలినట్లు చెప్పారు .ఇదంతా ”పుక్కిటి పురాణం ”అని తేలిగా కొట్టి పారేశారు శర్మ గారు .
          మూడో కధ
వవైకుంఠం లో ఒక రోజు విష్ణు మూర్తి లక్ష్మీ దేవి కలిసి వేమన్న ను పిలిచి భూలోకం లో అవతరించమని కోరగా ,తుంగ వంశం లో కేశవుడు ,లక్ష్మమ్మ కు సంతానం గా జన్మించాడని ,తర్వాత కదిరి చేరి ,వేమన తత్వాన్ని అందరికి ఉప దేశిన్చాడని పురాణ పురుషుడు గా వేమన్న కు ఒక కధ ప్రచారం లో ఉందిఅని రాళ్ళ పల్లి వారు తెలియ జేసి ఆయన 15 వ శతాబ్ది వాడు అన్నారు .కడప జిల్లా లో జమ్మల మడుగు తాలూకా ”ముడియం ”అనే ఊళ్ళో వేమన శిష్యుల పీఠం ఉందని ,యోగాభ్యాసమే వాళ్ళ వ్రుత్తి అని ,అలాంటి వారు ,ఆ మండలం లో వంద కుటుంబాల వారు ఉన్నారని శ్రీ కావ్య తీర్ధ జనమంచి శేషాద్రి శర్మ చెప్పినట్లు అనంత శర్మ గారు రాశారు .తంజావూరు రాజ అంతఃపురం లో వేమన చిత్ర పటం ఉందట .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-8-12-కాంప్-అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.