అమెరికా డైరీ —
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం
సెప్టెంబర్ మూడు సోమ వారం నుండి తొమ్మిది ఆది వారం వరకు విశేషాలు
సెప్టెంబర్ మూడు అమెరికా లో ”లేబర్ హాలిడే”.అన్నిటికి సెలవే .అంతకు ముందు శని ఆది వారాలతో కలిసి సోమ వారం కూడా సెలవు అవటం తో దీన్ని ”లాంగ్ వీకెండ్ ”అంటారు .శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఎక్కడికో అక్కడికి కుటుంబం తో సెలవులకు వెళ్లి హాయిగా గడిపి వస్తారు .మంగళ వారం కోసూరు ఆదినారాయణ గారికి ఫోన్ చేశాను .వాళ్ళ కోడలికి ఒంట్లో బాగా లేదని ఆ కంగారు లో ఉన్నామని చెప్పారు .అప్పుడే మైనేని గారికీ ఫోన్ చేశాను .ఆయన అందు బాటులో లేరు .గురువారం రాత్రిఆదినారాయణ గారికి మళ్ళీ ఫోన్ చేసి ఆయన కోడలి ఆరోగ్యం సంగతి వాకబు చేశాను .ఇప్పుడు బానే ఉందని ,టెన్షన్ తగ్గిందని ,సెప్టెంబర్ ఇరవై మూడు న ఇండియా ప్రయాణం అనీ చెప్పారు .సంతోషించాము .శుక్ర వారం రాత్రి మా ఇంట్లో భజన .రాత్రి ఎనిమిదింటికి ప్రారంభమై ఒక గంట జరిగింది .సుమారు పదిహేను మందే వచ్చారు .వచ్చిన వారి లో శ్రీ వల్లం నరసింహా రావు దంపతులున్నారు .ఆవిడను చూస్తె ఉయ్యూరు లో నా దగ్గర చదువుకొన్న భాగ్య లక్ష్మి గుర్తుకు వస్తుంది .మంచి నవ్వు ముఖం, వర్చస్సు గోచరిస్తుంది .ఆ దంపతులకు సరస భారతి ప్రచురించిన ”మా అక్కయ్య ”కవితా సంకలనాన్ని కానుక గా ఇచ్చాను .చాలాసంతోషించారు .
శ్రీ సత్య నారాయణ వ్రతం
అమెరికా కు వచ్చిన కొత్త లోనే మా అమ్మాయి విజ్జి స్నేహితురాలు ప్రియా అనే అమ్మాయి తాము స్వంత ఇల్లు కొనుక్కున్నామని గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టమని ఇంటికి వచ్చి అడిగింది .అయితే ఇల్లు స్వాధీనం కావటానికి ఇంకా కొంత కాలం పడుతుందని చెప్పింది .నేను వైశాఖ మాసం లో ఒక ముహూర్తం పెట్టి పాలు పొంగించమని చెప్పాను .ఆ ప్రకారమే పొంగించి ,ఇల్లు స్వాదీనం అయిన తర్వాత అందులో చేరారు .చేరిన తర్వాత నన్ను సత్య నారాయణ వ్రతం చేయిస్తారా అని అడిగింది .ఎవ్వరూ లేక పోతే చెప్పు చేయిస్తాను అన్నాను .ఒక ఇరవై రోజుల క్రితంవచ్చిసెప్టెంబర్ ఎనిమిది శని వారం వ్రతం చేయించమని కోరింది . ఏమేమి వస్తువులు కావాలో లిస్టు రాయించుకు వెళ్ళింది . ఈ శని వారం ఆమె భర్త వెంకట్ వచ్చి నన్ను ,మా శ్రీమతిని కార్ లో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లాడు అతనిది నెల్లూరు దగ్గర కావలి .ఆమెది గుంటూరు దగ్గర రేపల్లె .మంచిగా మర్యాద గా మాట్లాడాడు .ఇంటికి చేరే సరికి తొమ్మిదిన్నర అయింది .
ముఖ్య ద్వారం వద్ద ,వంటింట్లో ,పైన మేడ మీదదంపతులతో కొబ్బరికాయలు కొట్టించి ,నవధాన్యాలను చల్లించాను . సరిగ్గా పది గంటలకు శ్రీ సత్య నారాయణ వ్రతం ప్రారంభించాం .అన్నీ శాస్త్రోక్తం గా యధా విధి గా చేయించా.దంపతులిద్దరూ ఎంతో శ్రద్ధా శక్తులతో భక్తీ తో కూర్చుని చేశారు .సుమారు రెండున్నర గంటలు పట్టింది . వెంకట్ స్నే హితుడు అతనితో ”ఎప్పుడో పెళ్లి నాడు చేసుకోన్నావు వ్రతం .మళ్ళీ ఇప్పుడే”అన్నాడు .దానికి వెంకట్ ”ఆ వ్రతం కంటే ఈ వ్రతాన్ని అంకుల్ చాలా బాగా చేయిస్తున్నారు ”అని ఆనందించాడు .అందరు చిన్నా ,పెద్ద చాలా బాగా చేయించానని ఎంతో సంతృప్తిని ,ఆనందాన్ని వ్యక్తం చేశారు .వాళ్ళ కళ్ళ లో ఎంతో సంతోషం వ్యక్తం అయింది .స్వామి అనుగ్రహం,సరస్వతి మాత కటాక్షమే ఇది .ఇండియా నుంచి ప్రత్యెక మైన చాలా ఖరీదైన పట్టు పంచె ,పట్టు చొక్కా గుడ్డ తెప్పించి తాంబూలం లో నాకు నూట పదహారు డాలర్లు పెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రియా దంపతులు .ఇంకెవరికి బట్టలు పెట్టలేదు .వారి మనసు లో యే మంచి గొప్ప భావం ఉందొ తెలీదు .మా శ్రీ మతికి తాంబూలం లో వంద డాలర్లు పెట్టి ”ఆంటీ పట్టు చీరే కొనుక్కోండి ”అని ఎంతో ఆప్యాయం గా ప్రియ చెప్పింది .తమ తల్లిదండ్రుల్ని మాలో చూసుకోన్నారేమో అని పించింది .లేక పోతే ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదు .వాళ్ళేదో ఇస్తారనే ఆశ తో వ్రతం చేయించలేదు .మా అమ్మాయి మాట చెల్లించాను అంతే .మా అమ్మాయికి ,వాళ్ళ అమ్మకు చిన్న ఖరీదైన వెండి” శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాలు ”బహూక రించింది .ప్రియా వాళ్ళ అన్నా వదినే కుటుంబం లూ విల్ నుండి వచ్చారు .అన్న ఇండియా వెళ్లి నప్పుడు విగ్రహాలు ,పట్టు బట్టలు తెప్పించిందట .మొత్తం మీద అందరికి వ్రత విధానం నచ్చి సంతోషం తృప్తి కనపరచారు .ఉదయం టిఫిన్ కాఫీ అందరికి ఇచ్చారు .ఆ తర్వాత.పూర్ణాలు, లడ్డు ,జిలేబి ,చక్ర పొంగలి , స్వీట్లు ,నాలుగు హాట్లు ,పప్పు, కూర లు ,చపాతీ ,పులిహోర ,అన్నం ,పెరుగు తో విందు .మేమిద్దరం రెండు స్వీట్లు ,పెరుగు అన్నం మాత్రమె తిన్నాం .పొద్దున్న టిఫిన్ కూడా ఇంటి దగ్గరే చేసి వచ్చాం .మా ఇద్దరికీ ఎంతో భక్తిగా నమస్కారం చేసి ప్రియా దంపతులు నిండు ఆశీర్వాదాలు పొందారు .వాళ్లకు ఇద్దరు ఆడ పిల్లలు .వ్రతానికి సుమారు అరవై మంది వచ్చి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లారు .
పిల్లల పిక్నిక్
ప్రియా వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దర్ని మా అమ్మాయి పిక్ అప్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చింది .ఆ తర్వాతానేను మా అమ్మాయి యార్క్ రోడ్ లో ఉన్న మక్.డోవేల్ వారి” nature preserve ”దగ్గర సాయి సెంటర్ వాళ్ళు పిల్లలకు ఏర్పాటు చేసిన పిక్నిక్ స్తలానికి వెళ్ళాం .మా మన వల్ల ను పొద్దున్నె అక్కడ దింపి .ఆ తర్వాతా ప్రియా వాళ్ళింటికి వచ్చింది మా అమ్మాయి .మేం వెళ్ళే సరికే పిక్నిక్ దాదాపు అయి పోయింది .పెద్ద వాళ్ళ మీటింగ్ జరుగు తోంది . ఒక గంట అక్కడ గడిపాం .ప్రక్కనే ”వైలీ లేక్ ”ఉంది .పిక్నిక్ కు చాలా మంది వచ్చే ప్రదేశం .దట్ట మైన చెట్లు అందమైన సరోవరం అందులో బోటు షికారు కు వీలు ఉండటం తో జనం బాగా వస్తారు .ఈ లేక్ ఒడ్డునే ఎక్కడో చాలా దూరం లో అణుకర్మాగారం ఉందట .ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయింది .మా అల్లుడు వారానికి రెండు రోజులు నిర్వహించే ”వీక్లీ రీడింగ్ ”క్లాసులు ప్రారంభించాడు .ఆది వారం కొత్త విషయాలేమీ లేవు .
ఈ వారం లో చాలా మంచి పుస్తకాలే చదివాను .political corruption ,global warming ,emily bronte ,the jungle ,pat conroy ,climate confusion ,humorists ,dublin వగైరా పుస్తకాలు చాలా బాగున్నాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-9-12-కాంప్ –అమెరికా
వీక్షకులు
- 926,902 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
- సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక
- భారతీ నిరుక్తి .25వ భాగం8.8.22
- శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.22వ భాగం.7.8.22
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17
- భారతీ నిరుక్తి 24వ భాగం.
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16
- 19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఆగస్ట్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (37)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,782)
- సమీక్ష (1,142)
- ప్రవచనం (8)
- ఫేస్బుక్ (61)
- మహానుభావులు (292)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (965)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (329)
- సమయం – సందర్భం (815)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (490)
- సినిమా (322)
- సేకరణలు (313)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు