మన అను (ణు )బంధం .

 మన అను  (ణు )బంధం .

 
భారత దేశం న్యూక్లియర్ రియాక్టర్ లో ప్లుటోనియం ను ఉప యొ గించి మొదటి న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేసు కొన్నది .తర్వాతా ప్లుటోనియంను న్యూక్లియర్ పవర్ ప్లాంటు లలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది .దీనితో ఇండియా ”రోగ్ నేషన్ ”లజాబితా లో చేరి పోయింది .నిరాయుధ ఒడంబడికలో నార్త్ ,ఉత్తర కొరియా లతో పాటు చేరకుండా ఉండి పోయింది. వీటి పై పెత్తనానికి ఎవరికి అధికారం లేదనే వీరి అభి ప్రాయం .అయితే అమెరికా తో భారత రహస్య ఒప్పందాన్ని చేసుకొందని అందరు అభి ప్రాయ పడుతున్నారు ..2005july 18న భారత ప్రధాని మన్ మోహన్ ,అమెరికా అధ్యక్షుడు బుష్ ఆ ఒప్పందం పై సంతకాలు చేసి నట్లు తెలుస్తోంది .దీనితో భారత కు సివిలియన్ ,న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంల  కోసం అమెరికా సహాయం చేస్తుంది. భారత ఇప్పటికే బ్రిటన్ ,కెనడా ,అమెరికా లద. సాయంతో న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసుకొన్నది .వీటికి కావలసిన డిజైన్ వివ రా ల తో పాటు శుద్ధి చేసిన యురేనియం కూడా  బ్రిటన్ సమ కూర్చింది .ఈ ఇంధనాన్ని” అప్సర రియాక్టర్”లో మన దేశం ఉప యోగించింది .కెనడా మనకు న్యూక్లియర్ ఎనెర్జీ కోసం ”cirusభార జలాన్ని” అందించింది .అమెరికా కూడా భార జలాన్ని అందించి సహాయం చేసింది .
ఆ తర్వాత భారత లోని దేశం ” తారా పూర్ ”లోని మొదటి కమ్మర్శియల్  పవర్ ప్లాంట్ కు అమెరికాసాయం చేస్తే ,కెనడా దేశం రెండవ ప్లాంట్ ”రావత్ భాటా” కు సహాయం అందించింది .అయితే ఈ రెంటి వల్ల భారత్ కు ఒరిగిందేమీ లేదు .పవర్ సప్ప్లై లో వీటి వల్ల వచ్చే విద్యుత్తు మూడు శాతం మాత్రమె అని నిపుణులు తేల్చారు .దీని కంటే గాలి మరలు వల్ల వచ్చే విద్యుత్తే ఎక్కువన్నారు .మన రియాక్టర్లు ప్రపంచం లోనే బాగా కలుషిత మైన వాటి ని  భావిస్తున్నారు .వీటి లో పని చేసే వారికి చాలా ఎక్కువ మోతాదులో రేడియేషన్ ప్రభావం సోకుతోందని తెలుపుతున్న్నారు .రాజస్థాన్ పవర్ ప్లాంట్ కు సమీ పం లోని జనాభా ను నిపుణులు పరిశోధించి తెలుసుకొన్న విషయం వింటే గుండె బాదు కోవాల్సిందే .ఆ జనాల్లో కాళ్ళూ చేతులు వంకరపోతున్నాయి . ,పుట్టే పిల్లలు బాధ పడుతున్నారు .ఆడ వాళ్లకు గర్భ స్రావాలు ఎక్కు వై పోయాయి .ట్యూమర్లు విపరీతమైనాయి కడుపులోని శిశువులకు చాలా ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయి .
భారత దేశం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల తో న్యూక్లియర్ ఎనెర్జీ తో బాటు ,న్యూక్లియర్ ఆయుధాలను కూడా తయారు చేస్తోంది .ఇప్పటికి భారత్ 65న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసిందని అంచనా వేశారు .ఇలా చేస్తూనే న్యూక్లియర్ ఆయుధాలు లేని ప్రపంచం కావాలని చాటు తోంది .ఇది విమర్శలకు గురి అయింది .ఏడేళ్ళ క్రితం బుష్ తో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం భారత్ విడిగా సివిలియన్ ,మిలిటరి న్యూక్లియర్ టెక్నాలజీ లను ఉప యోగించాలి .అంతే కాదు అంతర్జాతీయ సంస్థ అయిన ”..I.A. E.A” వారి ఇన్స్పెక్షన్ కు సిద్ధమవాలి .ఇక్కడ గమనించాల్సిన,ముఖ్య  విషయం ఒకటి ఉంది  .అమెరికా తో ఒడంబడిక లు కుదుర్చుకొన్న దేశాలైన ఫ్రాన్స్ బ్రిటన్ ,రష్యా చైనా లు సివిలియన్ కు వేరుగా, న్యూక్లియర్ ఆయుధాలకు వేరుగా  ఉపయోగించాలనే నియమానికి ఒప్పు కో లేదు .మన దేశమే అలా ఒప్పుకోన్నది .ఇది అందరు హెచ్చరిస్తున్న విషయం .ఇంకో తమాషా విషయం అందరి దృష్టికి వచ్చింది.అమెరికా తన దేశం లో ఉన్న అతి తక్కువ అంటే వేళ్ళ పై లెక్క పెట్ట దగినఅయిదు  న్యూక్లియర్ రియాక్టర్లను మాత్రమె ”.iaea”ఇన్స్పెక్షన్ పరిధి లోకి తీసుకొని రావటం .మిగిలిన వాటికి ఇన్స్పెక్షన్ ఉండదన్న మాట .ఇది పరిశీలకుల కు చాలా విడ్డూరం గా అని పిస్తోంది .వీటిలో సివిలియాన్ పదార్ధాలను మిలిటరి వ్యవస్థకు ఉప యోగించే,హక్కు , వీలు ఉంది .వీటిలో అధికారికం గా న్యూక్లియర్ ఆయుధాలున్నాయని భావిస్తున్నారు .
సరే భారత దేశం అమెరికా తో సంతకం చేసిన జాయింట్ స్టేట్ మెంట్ ప్రకారం –ఇండియా న్యూక్లియర్ పరీక్షలు చేయ రాదు .అయితే అమెరికా దీన్ని ఎక్కడా పాటించలేదని విశ్లేషకులు చెబుతున్నారు .భారత్ అణు రియాక్టర్ల కు కావలసిన ఇంధనాన్ని అమెరికా దాని మిత్ర దేశాలు అంద జేస్తాయి .వీటిని ఉరేనియం సప్ప్లై దేశాలంటారు .దేశం లో ఉత్పత్తి అయిన ఖనిజాన్ని ఆయుధాలకు వాడుకో వచ్చు దీని వల్ల  ఇండియా130 కి పైనే ఆయుధాలు తయారు చేసి నిల్వ చేసుకో వచ్చు .కాని ఇండియా లోని పవర్ ప్లాంటు లలో ఉన్న”spent fuel ”రక్షణ గురించి ఎక్కడా మాట మాత్రం లేదు అంటున్నారు వేత్తలు .ఇప్పటికే సుమారు 8000కిలో గ్రాముల రియాక్టర్ గ్రేడ్ ప్లుటోనియం స్పెంట్ ఫ్యుఎల్ లో ఉందట .దీంతో ఇంకో 1000 అణ్వాయుధాలు తయారు చేసుకో వచ్చు .అలా అయితే అమెరికా ,రష్యా ల తర్వాత భారత దేశం మూడ వ స్తానం లో అణ్వాయుధాలను నిల్వ చేసుకొనన్న దేశం అవుతుంది .ఇది మనకు గర్వ కారణమే .కాని భయ కారణం కూడా .ఇవన్నీ పైకి బానే కన్పిస్తాయి .వీటి వెనుక చిదంబర రహస్యం ఉంది అని చెవులు కొరుక్కుంటున్నారు విశ్లేషకులు .
ఈ జాయింట్ స్టేట్ మెంట్ భారత దేశ ప్రభుత్వ కాబి నెట్ కి కాని, దాని సెక్యురిటీ కమిటీ కి కాని, అమెరికా జాతీయ రక్షణ కౌన్సిల్ కు కాని ,అమెరికా జాతీయ రక్షణ సలహా బోర్డు కు గాని ,కనీసం అమెరికా అణు శక్తి డిపార్ట్ మెంట్ కు కాని తెలీకుండా తయారు చేసి అత్యంత గోప్యం గా భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు సంతకాలు చేశారని అంతా అయి పోయిన తర్వాతా గుప్పు మంది .
ఇండియా చైనా కు దీటుగా ఆశియా లో యెద గాలాని అమెరికా కోరిక .ఇదొక వ్యూహం .దీని వల్ల  ఇండియా15 బిలియన్ల డాలర్ల మిలిటరి సామగ్రిని అమెరికా నుండి కొను గోలు చేస్తుంది .వీటిలో”anti sub marine patrol aircraft ”లు ఉండటం విశేషం .వీటి వల్ల హిందూ మహాసముద్రం లో విహరించే చైనా  వారి జలాంతర్గాములను తేలిగ్గా పసి గట్ట వచ్చు .అలాగే చైనా వాళ్ళ strai of malacca లోని మిలిటరి వ్యూహాలనుభారత్ ధ్వంసం చేసే ఆయుధాలు కూడా కొనుక్కో వచ్చు .అంతే కాదు ఇస్రాయిల్-అమెరికా టెక్నాలజీ తో  తయారు చేసిన ”arrow missile system ”  ను ఇండియా కొనుక్కో వచ్చు .”వేష్టింగ్గ్ హౌస్” తయారు చేసిన A.P.-1000 ను కూడా కొనుక్కో వచ్చు .ఈ మధ్య అమెరికా పర్య టించిన భారత దేశాధ్యక్షురాలు ఇండియా లో న్యూక్లియర్ పవర్ జెనెరేషన్ కోసం పెట్టు బడులు పెట్టమని ,కోరారు .దీనితో generation 3 generation 4న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుకు భారత్- అమెరికాకు   ద్వారాలు తెరచి నట్లే నంటున్నారు నిపుణులు . వీటి వల్ల  మన రక్షణ వ్యూహం ,దేశ భద్రత, సర్వ సత్తాక ప్రతి పత్తి,ముఖ్యం గా కష్టపడి సాధించుకొన్న స్వాతంత్రం అన్నీ ప్రమాదం లోకి నెట్టేసి నట్లే అని దేశీయులు, దేశ భక్తులు, జాతి నిర్మాతలు అందరు భయ పడుతున్నారు .కనుక తస్మాత్ జాగ్రత  జాగ్రత అని హెచ్చ రిస్తున్నారు .మన అభి వృద్ధికి దోహద పడే ఒప్పందాలు మంచివే ,కాని భస్మాసుర హస్తం లా ఉండేవి అయితే ఉపద్రవమే ,ఆత్మ హననమే .”Be ware -o! my country men .”అను  బంధం పెరిగితే మచిదే కాని అణు బంధం వల్ల సమస్యలు ఉత్పత్తి కా కూడదు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-9-12-కాంప్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged , . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.