శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –18
43-”ధనోతు ధ్వాంతం ,నస్తులిత ,దలి తేరి దేవర వనం –ఘనం స్నిగ్ధం ,శ్లక్ష్యం ,నికురుంబం ,తవ శివే
య దేయం ,సౌరభ్యం ,సహజ ,ముప లబ్దుం ,సుమనసో –వసంత్యస్మిన్మన్యే ,బల మదనః ,వాటీ విట పినాం ”
తాత్పర్యం –శ్రీ లలితా!అప్పుడే వికశించిన నల్ల కలువల సమూహాన్ని మరపించే కారు మబ్బు లాగా దట్టమై ,నున్నగా ,సుగంధం తో మెత్త గా ఉన్న నీ కురుల క్రొమ్ముడి ,మాలోపలి ,చీకటి అనే అజ్ఞాన అంధ కారాన్ని పోగొట్టాలి .నీ కురులకు ఉన్న సహజ గంధం సంపాదించ టానికి బలుడు అనే రాక్షసుని సంహరించిన ఇంద్రుని యొక్క నందనోద్యాన వనం లోని కల్ప వృక్ష పుష్పాలు ,నీ కొప్పులో చేరి ప్రకాశిస్తున్నాయి . పూలు సహజ గంధం పొందాలనే కోరిక తో శ్రీ దేవి కొప్పు లో నిత్య నివాసం ఉంటున్నాయని భావం
44–”తనోతు క్షేమం ,నస్తవ ,వాదన సౌందర్య లహరీ –ప్రీ వాహ స్రోత స్సరనివ ,సీమంత సరణీం
వహంతీ సింధూరం ,ప్రబల ,కబరీ భార తిమిర –ద్విషాం ,బృందై ర్బందీక్రుత మివ ,దీనార్క కిరణం ”
తాత్పర్యం –త్రిపుర సుందరీ !నీ వదన సౌందర్యం ,పొంగులు పొంగులుగా ,జాలు వారే ప్రవాహం లాగా ఉండగా ,వాని లోంచి చీలి ,చక్కగా ప్రవహించే నీటి పాయ లాగా నీ పాపట ,నీ కురులలో జన్మించి ,దట్టమైన చీకట్లు అనే శత్రుసేనల చేత చె ర పట్ట బడిన బాల సూర్యుని కిరణమా అన్నట్లు గా ఉన్న సిందూర పరాగాన్ని ధరించి ,మా యోగ క్షేమాలకు అభి వృద్ధి కలిగిస్తోంది .
విశేషం –పాపట లో సిందూరం ధరించటం సువాసినీ స్త్రీల ఆచారం .,సుమంగళీ చిహ్నం .శ్రీ దేవి వదన సౌందర్యం అనే ఎరుపు కాంతి పైకి ప్రాకుతూ ,పాపట లో వ్యాపించి ఉంది .ఇందులో ప్రాతక్హ్కాలం లోని సూర్యుడు చీకటిని పోగొట్టే విధానం సూచింపబడింది నీటి ప్రవాహం పల్లానికి సహజం గా ప్రవహిస్తుంది .శ్రీ దేవి సౌందర్య లహరి ఊర్ధ్వ గామిని -అంటే పైకి ప్రవ హిస్తుందని భావం .
అందరికి నవ రాత్రి -దసరా శుభా కాంక్షలు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-10-12–ఉయ్యూరు