కాశీ ఖండం – 7 అప్సరస ,సూర్య లోక వర్ణన

 కాశీ ఖండం – 7            

 

                                                                        అప్సరస ,సూర్య లోక వర్ణన

 విష్ణు దూతలు శివ శర్మ ను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు .అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు, రసజ్ఞులు అయిన ఆడ వారుంటారు .సమస్త భాషలలో వారు కోవిదులు .క్షీర సాగర మధనం లో జన్మించిన వారు .మన్మ ధుని త్రిభువన విజయాస్త్రాలు వారే .ఊర్వశి ,మేనక ,రంభ ,చంద్ర లేఖ ,తిలోత్తమ ,వపుష్మతి ,కాంతిమతి ,లీలావతి ,ఉత్పలావతి ,అలంబుష ,గుణవతి ,స్థూల కేశి ,కళావతి ,కళానిధి ,గుణనిధి ,కర్పూర తిలక ,ఉర్వార ,అనంగతిలక ,మదన మోహిని,చకోరాక్షి ,చంద్ర కళ ,ముని మనోహర ,గవద్రావ ,తపోద్వేష్టి ,చారునాన ,సుకర్నిక ,దారు సంజీవని ,సుశ్రీ ,క్రమ శుల్క శుభానన ,తపస్శుల్కల్క ,హిమావతి ,పంచాశ్వ మేదిక ,రాజ సూయార్ధిని ,అష్టాగ్ని హోమిక ,వాజపేయ శతోద్భవ ,మొదలైన వారు అప్సరస గణం .వేరి సంఖ్య 6,000 ..ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు .వీరంతా లావణ్యం తో ,నిత్య యవ్వనం తో ,దివ్యామ్బరాలతో ఉంటారు .వీరందరూ స్వైరుణులు ,సు సంపన్నులు ..కోరిక తీర్చే వ్రతాలు చేసి ఉద్యాపనాలు చేసిన వారు అప్సరస లోకం కి చేరుకొంటారు .వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు .వీరిని దేవ వేశ్యలని అంటారు .సూర్య సంక్రమణం నాడు దానం చేసిన వారు ,’’మొదాత్ ‘’అనే మంత్రాన్ని అనుష్టించి దానాలిచ్చిన వారు ఇక్కడికి చేరుకొంటారు .

                తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివ శర్మ .సూర్య లోక ము తిమ్మిది యోజనాల విస్తీర్ణం కలది .విచిత్రాలైన ఏడు గుర్రాలు ,ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధి గా సూర్యుడు నిత్య సంచారం చేస్తూంటాడు .క్షణ కాలం లోనే ఆవిర్భావ ,తిరోభావాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు .ఆదిత్యుడే సాక్స్శాత్తుబ్రహ్మ .సూర్యుని వల్లనే సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదిన్చుకొంటున్నాయి .ప్రత్యక్ష సాక్షి ,కర్మ సాక్షి .గాయత్రీ మంత్రం తో సకాలం లో వదల బడిన అర్ఘ్యం నశించదు అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది .సూర్యోపాసన చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ,మిత్ర ,పుత్ర ,కలత్రాలు అష్ట విధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి .

                ఆస్టా దశ విద్యల్లో మీమాంస గొప్పది .దాని కంటే తర్కం ,దాని కంటే పురాణం గొప్పవి .వీటి కంటే ధర్మ శాస్త్రం ,వాటికంటే వేదాలు వేదం కంటే ఉపనిషత్తులు వీటికంటే గాయత్రీ మంత్రం గొప్పవి .అది ప్రణవ సంపుటి .గాయత్రి మంత్రం కంటే అధిక మైన మంత్రం మూడు లోకాలలోనూ లేదు .గాయత్రి వేద జనని .గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు .తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు .సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు .గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం .

             గాయత్రి మంత్రం చేత రాజర్షి విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అయాడు .గాయత్రియే విష్ణువు ,శివుడు ,బ్రహ్మా .అమ్శుమాలి అని పిలువ బడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు .అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి .ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా .తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త .పడమర దిశ లో సర్వతోముఖుడై కనీ పిస్తాడు . ఉత్తరాయణ ,దక్షిణాయణ పుణ్య కాలాలో షడతీతుల్లో ,విష్ణు పంచకం లో ఎవరు మహా దానం చేస్తారో పిత్రుక్రియలు నిర్వ హిస్తారో ,వారు సూర్య సమాన తెజస్కులై ,సూర్య లోకం లో నివ శిస్తారు .ఆదివారం సూర్య గ్రహణం నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి .

             హంసుడు ,భానుడు ,సహస్రామ్శువు ,తపనుడు ,తాపనుడు ,రవి ,వికర్తనుడు వివశ్వంతుడు ,,విశ్వ కర్మ ,విభావనుడు ,విశ్వ రూపుడు ,విశ్వ కర్త ,మార్తాండుడు మిహిరుడు ,అంశు మతుడు ,ఆదిత్యుడు ,ఉష్నగుడు ,సూర్యుడు ,ఆర్యముడు ,బ్రద్నుడు ,ద్వాదశాదిత్యుడు ,సప్త హయుడు భాస్కరుడు ,ఆహాస్కరుడు ,ఖగుడు ,శూరుడు ,ప్రభాకరుడు ,శ్రీ మంత్ర్హుడు ,లోక చక్షువు ,గ్రహేశ్వరుడు ,త్రిలోకేశుడు ,లోక సాక్షి ,తమోరి ,శాశ్వతుడు ,శుచి ,గభస్తి ,హస్తాంషుడు ,తరణి ,సుమాహారిణి ,ద్యుమణి ,హరిదాశ్వుడు ,అర్కుడు ,భాను మంతుడు ,భయ నాశనుడు ,చందోశ్వుడు ,వేద వేద్యుడు ,భాస్వంతుడు ,పూషుడు ,వృషాకపి ,ఏక చక్ర ధరుడు ,మిత్రుడు ,మందేహారి ,తమిశ్రఘ్నుడు ,దైత్యఘ్నుడు ,పాప హర్త ,ధర్ముడు ,ధర్మ ప్రకాశకుడు ,హీళి,చిత్రభానుడు ,కలిఘ్నుడు ,తార్ష్య వాహనుడు ,దిక్రుతి ,పద్మినీ నాభుడు ,కుశేషయ కారుడు ,హరి ,ఘర్మ రశ్మి ,దుర్ని రీక్షుడు ,చందాంశువు ,కశ్యపాత్మజుడు ,అనే డెబ్బది రెండు పేర్లు సూర్యునికి ఉన్నాయి .ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ,ఉచ్చ రిస్తూ ,సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగు తుంది .రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మల మైన జలాన్ని నింపి మోకాళ్ళ పైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు ,రక్త చందనం ,గరిక ,అక్షతలు ఆ పాత్రలో ఉంచి ,సూర్యుడిని ధ్యానిస్తూ ,ఫాల భాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని స్తిర చిత్తం తో, పైన చెప్పిన72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని చ్చే వాడేప్పుడు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తాడు ,వ్యాధులు నశిస్తాయి’’ ,అని శివ శర్మకు విష్ణు దూతలు వివ రించారని భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు

                 సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-11-12- ఉయ్యూరు  .

 

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.