గొల్ల పూడి కధా మారుతం — 7
అభిప్రాయ భేదం –కొన సాగింపు
ఇన్స్పెక్టర్ వెంకోబ రావు కు సీతప్ప అంటే చాలా ఆశ్చర్యం .అతని పరికరాలను ఎలా గైనా చేజిక్కించు కోవాలని శతధా ప్రయత్నించాడు .ఉష్ –నిష్ఫలం .సీతప్ప ను శారీరకం గా హింసించినా ఏమీ చెప్ప లేదు .’’చిరు నవ్వు తో శరీరాన్నప్ప గించి ,భగవంతున్ని దర్శిస్తున్న భక్త ప్రహ్లాదుని లా ఉంటాడు .కొట్టిన కొద్దీ ఆత్మ శక్తి పెరుగు తుంది . అతను చేసే నేరాలు ‘’సిల్లీవి ‘’యావజ్జీవానికి అర్హత లేదు .పోనీ జైల్లో చూస్తె –అందరికీ తలలో నాలుకే .పనులన్నీ చక్కగా చేస్తాడు .ఎక్కువ పంట పండిస్తాడు .ఆఫీసర్ల తో మర్యాదగా ఉంటాడు .’’ఇంత మంచి వాడివి ,ఇంత పని మంతుడివి ,ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు సీతప్పా ‘’?అని అడిగితే ‘’నేను మంచి వాడి నని మీకు తెలియ టానికి ఒక చెడ్డ పని చేసి జైలుకి రావలసి వచ్చింది సార్ .జైల్లో నేను మంచి పని చేస్తున్నానని బయట చెబితే ,ఎవరైనా ఉద్యోగం ఇస్తారా సార్ ?’’అంటాడు .ఇందులో వేదాంతం ఉన్నా ,వ్యవస్థ పై అసంతృప్తి కనీ పిస్తుంది .జైలుకి వచ్చే వాళ్ళంతా చెడ్డ వారు కాదు అని పిస్తుంది .జైల్లో మంచి వాడుగా ఉన్నా ,బయటకు వస్తే సమాజం ఆదరించదు అన్న క ఠోర సత్యమూ ఉంది .’’ఆ ముద్ర ‘’పడితే అంతే .అంత ప్రభావం ఉంది దానికి .
జైలు నుంచి విడుదల చేస్తూ ‘’ఈ సారైనా బుద్ధి గా బతుకు ‘’అన్నాడు వెంకోబ రావు .నవ్విన సీతప్ప‘’ఎప్పుడూ బుద్ధి గానే ఉంటున్నా సార్ –అయితే నా బుద్ధి వేరు ,మీ బుద్ధి వేరు .’’అనేశాడు మొహం మీదనే .అదో జోక్ అనుకొని తానూ నవ్వేశాడు వెంకోబ రావు .ఈ రహస్యాన్ని మొదటి సారిగా తానే కనుక్కొంటున్నట్లు ,బయటకు పోబోతున్న సీతప్ప బుజం పై చెయ్యేసి ‘’వరహాల చెట్టి ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనా ?’’అన్నాడు పాత కద ను తిరగ దొడుతూ .తనకేం తెలీదని పాత అబద్ధమే అన్ని ప్రశ్నలకు చెప్పాడు .వెంకోబ కు ఆశ్చర్య మేసింది ‘’నా జీవితం లో ఎప్పుడూ ఒక అబద్ధం మీదనే నిల బడ్డ నేరస్తుడు కనీ పించలేదు –ఈ సీతప్ప తప్ప .అందుకనే తనకు వాడంటే అంత ముచ్చట ‘’అనుకొన్నాడు .అయితే సీతప్ప అభి ప్రాయం వేరు .’’కోర్టు వ్యవహారాల్లో నిజం చెప్ప కూడదని అలా చెప్పక పోవటం తప్పు కాదని సీతప్ప నమ్మకం .ఇద్దరే అబద్ధం చెప్ప టానికి అర్హత ఉన్న వారు .వారే దొంగలు ,రాజ కీయ నాయకులు .మొదటి వారు తమ ను తాము ఉద్దరించు కోవటానికి ,,రెండో వాళ్ళు దేశోద్ధరణకు అబద్ధం చెబుతారు .కనుక అది చెల్లు బాటు అవుతుంది .’’అని సీతప్ప విశ్వాసం ట.అంటే ఇద్దరూ దోపిడీ దొంగలే .వ్యవస్థను దోచే వాళ్ళే .ఇద్దరు చెప్పే దాంట్లోనూ నిజం ఉండదు .మొదటి వాళ్ళు జైల్లో పడితే ,రెండవ వాళ్ళు పదవి పై పడతారు .గమ్యాలు వేరు .పద్ధతులోక్కటే .మొదటి వాడు బయటికి వస్తే ,పుట్ట గతు లుండవు .రెండో వాడు వస్తే ‘’నీరాజనాలు ‘’పడతారు కటకటాలు మొదటి వాడికి మోసం .రెండో వాడికి పదవికి సోపానం .ఇద్దరూ దగా కోరులే .వంచకులే .మొదటి వాడిది మామూలు వంచన .రెండో వాడిది ‘’నయ వంచన ‘’అందుకే మొదటి వాడి వల్ల సమాజానికి నష్టం లేదు .రెండో వాడి వల్ల సమాజం ‘’భ్రష్టం ‘’అవుతుంది .ఇంతటి తీవ్ర భావాన్ని సీతప్ప మాటల్లో మనం ఊహించు కొ వచ్చు .
జైలు నుంచి వచ్చి అప్పుడే అయిదు రోజు లైంది కదా .’’ఆకలి ‘’కదా .అక్కడి నుంచే కదా ఇంత దూరం ఫ్లాష్ బాక్ లో చెప్పుకొన్నాం .’’తన పరికరాలకు పదును పెట్టా లని పించింది సీతప్పకు .కిందటి సారి ‘’చెట్టి ‘యే జైల్లో పెట్టించాడు .తను తీసుకెళ్ళిన దానికి పదింతలు దొంగతనం అంట గట్టి .శెట్టి మీద కోపం రాలేదు .మళ్ళీ ఏడి పించాలని మాత్రం అని పించింది .ఆ రోజు మధ్యాహ్నం వరహాలశెట్టి కొట్టు దగ్గర కెళ్ళి అడిగి మరీ చుట్ట తీసుకొన్నాడు .’’క్షేమమా ?కొట్టారట గా జైల్లో ?అన్నాడు చెట్టి .సమాధానం గా సీతప్ప ‘’ఇంకా జైళ్ళు అంత పాడు కాలేదు వరహాలూ .లోపల చాలా మంచి వాళ్ళే ఉన్నారు .పోనీ ఈసారి నాతో వస్తావేమిటీ?’’అన్నాడు .చెట్టి బాన పొట్ట కది లించుకొంటు పావు గంట సేపు నవ్వాడుఆ జోక్ కు .చెట్టి బాగా సంపాదించి ,కొట్టూ ,దానితో పాటు పొట్టా పెంచుకొన్నాడు .ఆ రాత్రి చెట్టి కొట్లో దొంగతనం చేయాలనే నిశ్చయానికి వచ్చాడు సీతప్ప .తన అలవాట్లన్నీ వెంకోబ కు తెలుసు కనుక ఈ సారి అత గాడినీ ఏడి పించాలని సరదా పుట్టింది .బండ పద్ధతి లో చేయాలను కొన్నాడు .పక్క వీధి గోడకు కన్నం వేసి పని ప్రారంభించాడు .రాత్రి ఒంటి గంట దాటింది .
సీతప్ప ఏం చేశాడో ఇప్పుడే చెబితే ‘’కిక్ ‘’ఉండదు గా. ఈ సారి చూద్దాం
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 1-12-12- ఉయ్యూరు

