గొల్ల పూడి కధామారుతం –9 అయిదవ కధ –‘’కంచికి చేరని కధ‘’-1

           గొల్ల పూడి కధామారుతం –9

 

                                   అయిదవ కధ –‘’కంచికి చేరని కధ‘’-1

  శ్రీ కృష్ణుని ముద్దుల భార్య సత్య భామ .ఆ పేరు వింటేనే ఓ ఠీవీ ,దర్పం ,రాజసం ,ఒయ్యారం ,విశిష్ట వ్యక్తిత్వం మనకు గోచరిస్తుంది .అందులోను ‘’కూచి పూడి వారి సత్య ‘’మరీ చిలిపిది .జడ తొ ప్రాణనాధు డినే ఈడ్చి కొట్టింది .ఇక పింగళి వారి భామ నాధుడినే  కాలితో ఈడ్చి తన్నింది .పాపం ఆయన ఏమీ అనలేక ఆమె కాలు నోచ్చిందేమో అని వగలు కూడా పోయాడు .పోతన గారి సత్య భామా మణి యుద్ధం చేసి ,తనకోడుకే అయిన నరకాసురుడిని చంపి శ్రీకృష్ణునికి విశ్రాంతి నిచ్చింది సాత్రాజితి పట్టు దలకు మారు పేరు .కోరి ,ప్రాణనాధుని తోనే దేవ లోకపు పారిజాత చెట్టునే పెకలిన్చుకోచ్చేట్లు చేసిన జాణ.’’సరి వారిలో తనకు సాటి వారు లేరనే ధీమా ‘’అష్ట మహిషి లలో ఆమెదే అగ్రస్తానం ,పేరుకు రుక్మిణీ దేవిఉన్నా .రాజసం ఉట్టి పడే మూర్తి ఆమెది బహుశా ,ఆ పేరు ప్రభావం అంతేనేమో ?దేనికీ లొంగని మనస్తత్వం .అవసర మైతే పతిని తూకం వేసి ,అమ్మే ఆచారం కూడా తోడైంది పురాణ సత్య కు .’’సత్యా పతి ‘’అని పించుకోవటం కొంటె కిష్టయ్యకీ ఇష్టమే .’’అలిగితివా ! సఖీ ! ప్రియా !అలుక మానవా ?’’అని బ్రతిమి లాడుకోవటం ఆయనకు బాగా నచ్చిన పని .అచ్చి వచ్చిన పని .అందుకే ఆమె కు అంతా లోమ్గారే కాని ,ఆమె ఎవరికీ లొంగి నట్లు లేదు సరే ! భక్తీ తొ రుక్మిణి సాధించింది .అది వేరే విషయం .కనుక ఆ సత్య ‘’భామ నే ‘’అంటూ కూచి పూడి చేస్తే ఎంతటి వాడైనా లోకువై పోతాడు .అలాంటి విచిత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పేరు తన కధా నాయికకు  ఎంచుకొని ,’’సత్య భామ ‘’అని పేరు పెట్టి సార్ధకత చేకూర్చాడు ‘’కన్చికిచేరని కధ ‘’లో ఆరుతీ రావు .కంచికి ఆమె మాత్రం వెళ్ళదు అనే ‘’కదా ఫలం‘’ఇందులో ఉన్నది .కనుక ఈ కంచికి వెళ్ళనికధలో మారుతీ రావు కదా విశ్లేషణలను నేను మాత్రం కంచికి చేరుస్తున్నాను .

                          కధను అద్భుతం గా మొదలు పెట్టి ,అంతె అద్భుతం గా అంతం చేయటం గొల్ల పూడి కి ‘’కధ తొ పెట్టిన ,పుట్టిన విద్య ‘’.అందుకే అవి అంత బాగా పండుతాయి .అలరించి మురిపిస్తాయి .ఆ కధను ఎత్తు కోవటం ఎలా ఆశ్చర్యపరుస్తుందో ,,ముగించి నప్పుడూ అంతే ఆశ్చర్యానికి లోనౌతాం .’’సత్య భామ –నా పాత్ర .నన్ను చాలా ఇబ్బంది పెట్టిన పాత్ర కూడా ఇదే .కొన్ని పాత్రలు చాలా సజావుగా ,నలుగురు ఊహించి నట్టే ముగుస్తాయి .కొన్ని ఎదగవు .ఎదురు తిరుగుతాయి .అలాంటిపాత్ర  సత్య భామ ‘’అని ప్రారంభించి ,కోరక రానికొయ్య ఆమె అన్న విషయాన్ని తమాషా గా మనకు తెలియ జేస్తాడు .ఆమె ఎదగటమే కాని ,మనం చెప్పి నట్లు నడవదు అన్న భావనా ఇందులో కనిపిస్తుంది .

                నలభై ఏళ్ళ కితం తాను సత్య భామను చూశాడు .అప్పుడామే ‘’సమాధానం లేని ప్రశ్నల్లాగా ,వాడి గా ఉండే కాళ్ళ తొ ,బారాటి జడ తొ కన్పిస్తే –ఆమె ను గురించి కధ చెప్పాలని పించలేదు .ఆమె చెప్తే వినాలని పించింది‘’అంటాడుఆమె ను మనకు పరిచయం చేస్తూ .అంటే అప్పుడు ఆమెను మామూలు మనిషి అనుకొన్నాడు .ఆమెలో రాయ దగిన కదా వస్తువు లేదను కొన్నాడు .అయితే ,ఆమె ఆకర్షణ లో పడి ,ఆమె కధ చెప్తే ,వినాలన్న ఉబ లాటం కల్పించాడు .అయినా నోరు తెరిచి అడిగితే ఆమె ‘’కధలు రాసే వాడివి .నేను చెప్తే నువ్వేం రాస్తావ్ ?’’అని వెక్కి రించింది .అప్పుడే అని పించింది ఆమె ను గురించి కధ రాయాలని .ఆ కోరిక ఇంకా ఇప్పటికీ తీర లేదంటాడు .

           కొన్ని పాత్రలు –ఆ పాత్ర స్వభావాలు తెలిస్తే చక్కగా చివరి కంటా లాక్కు పోతాయి రచయితను .కాని ,సత్య విషయం లో వేరు .ఆమె స్వభావమే ఎదురు తిరి గింది .ఎప్పుడేం చేస్తుందో తెలీదు .’’ఆ విశ్రుం ఖలత్వం ,స్వేచ్చ ,ఆమెకు జీవితం లో వరం లా లభించాయి ‘’.అంటాడు రచయిత .ఇంట్లో వాతావరణమూ అలాంటిదే .అందుకే ఆ తరహా ప్రవర్తన అబ్బింది .తల్లి చని పోయింది .తండ్రి తాసిల్దార్ .’’విదేశీ పాలన లో పెరిగిన బారు మీసాలూ ,ఇంకా స్వాతంత్రం రాక ముందు నుంచే స్వభావానికి తగిన స్వేచ్చ ఉంది‘’ఆ విచ్చల విడితనం కూతురికి వారసత్వం గా వచ్చేసింది .అలాగే ఆయన పెంచాడుకూడా సత్యను ..ఆస్తి ,ధనం ,గారాబం వల్ల నిర్లక్ష్యం పెరిగింది .ఆ రోజుల్లో రచయిత వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉండే వాడు .’’ఆమె అందం భయ పెట్టేంత క్రూరం గా ,మారి , –మత్తే క్కిన్చెంత  మెత్తగా ,స్వభావం వాన పామంత చంచలం గా ఉండేది ‘’ఇంత కంటే ఆమె స్వరూప స్వభావాలను ఎవరు గొప్ప గా వర్ణించ గలరు ?మనసు లోతుల్లోకి దూరి రాసిన మాటలని పిస్తాయి .ఇంట్లో ఆమె ఉన్నంతకాలం పరి మళంగుమ గుమ లాడేది .అలా ఆకర్షణ ‘’వల‘’అయిన్దామే .రచయితకు ఆమెను పెళ్లి చేసుకో వాలనే ఉబలాటం బాగా ఉండేది .కాని ‘’వయసు లో ఉన్నా –అజ్ఞానం లో లేను ‘’అంటాడు .’’భోగి మంటలు వీధుల్లోనే వేయాలి ఇంట్లో వేస్తె ఇంటికే నష్టం ‘’అని అప్పటికే అతనికి తెలిసింది .అందుకే మనసు లోనికోరిక అక్కడే అణగారి పోయింది .ఓ సారి ఒక కుర్రాడు ప్రేమ గురించి ఆమె పట్ల తొందర పడితే ఆలస్యం చేయ్య కుండా చెప్పుతో వాయిన్చేసింది .అప్పుడు గొల్ల పూడి అంటాడు ‘’ప్రేమ కంటే –ప్రేమ ను వ్యక్తం చేసే తీరు కొందరికి ముఖ్యం ‘’ఆ కుర్రాడికి అందుకే ఆశా భంగ మైంది .

                   సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –3-12-12-ఉయ్యూ

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.