జ్ఞాన వాపీ ప్రశంస
స్కందుడు అగస్త్యర్షికి జ్ఞాన వాపి ప్రశస్తిని తెలియ జేశాడు ..కాశి లో మణి కర్ణిక ఉత్తమ మైన తీర్ధం .అది స్నానం సకల పుణ్య ప్రదం .యతీశ్వరులు కూడా మణి కర్ణిక కు వస్తారు ముక్తి కోసం .ఇక్కడి స్నానం ముక్తి దాయకం .గంగా నది మధ్య నుండి హరిశ్చంద్ర ఘాట్ వరకు గంగ నుంచి బిందు మాధవం వరకు స్వర్గ ధామంమణి కర్ణిక .కళా వతి చిత్రాన్ని మాటి మాటికీ చూస్తోంది .జ్ఞాన వాపిని కాల భైరవుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు .అష్ట మూర్తి అయిన మహాదేవుడు జ్ఞాన వాపి లో ఉన్నాడు ఆయన్ను చూసి సంభ్రమాశ్చర్యాన్ని పొందింది .కళా వతి శరీరం కంపించి చిత్ర పటం జారి కింద పడింది .చెలి కత్తేలు గమనించి ,ఆమె విరహ వేదన గ్రహించి శైత్యోప చారాలు చేశారు .ఆమెకు పూర్వజన్మ జ్ఞానం జ్ఞాన వాపి వల్ల కలిగింది .ఆ విషయాన్ని చెల్లి కత్తేలకు చెప్పింది
పూర్వజన్మ లో తాను హరిస్వామి కుమార్తె సుశీలనని తనను విద్యాధరుడు ఎత్తుకొని పోతుంటే రాక్షసుడొకడు అడ్డు తగిలి అతని చేత చచ్చాడని ,తాను మరణించి కర్నాటక లో మలయ కేతునికి కలా వతి అనే కుమార్తె గా జన్మించానని వివరం గా చెప్పింది .అందరు జ్ఞాన వాపి గొప్ప దనాన్ని పొగిడారు .భర్త మలయ కేతుని చూసి ఇలా అన్నది ‘’మీరు నా మీద చూపుతున్న ప్రేమ ,ఆదరణ మిగిలిన వారి మీద చూపటం లేదు కాశీ వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి‘’అన్నది .అప్పుడాతడు ఆమె ను వదిలి ఉండలేనని చెప్పి పుత్రులకు అన్నీ అప్పగించి భార్య తొ కాశీ చేరుకున్నాడు . .అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శించి పులకించి పోయాడు .రాణి తొ కలిసి జ్ఞాన వాపి లో స్నానం చేశాడు .
ఇంతలో ఒక యోగి వచ్చి వారి చేతిలో కొంత విభూతి పెట్టి ,ఆశీర్వదిస్తూ ‘’ఈ రోజు మహా నేపధ్యం .ఒక్క క్షణం లో నక్షత్రాలు ఉదయిస్తాయి ‘’అన్నాడు .ఇంతలో ఘంటా నాదాలు చేస్తూ ఒక విమానం అక్కడికి చేరింది .దాని నుండి చంద్ర మౌళి దిగాడు వెంటనే చెవిలో ఏదో బోధించాడు .అప్పుడొక మహా జ్యోతి అక్కడ ప్రజ్వ రిల్లింది .తర్వాతా చంద్ర మౌళీశ్వరుడు తన ఆలయానికి వెళ్లి పోయాడు .జ్ఞాన వాపి ప్రత్యక్షం గా జ్ఞానాన్నిస్తుంది .అది సర్వ జ్ఞాన మయం సర్వ లింగ మయం .అప్పటికప్పుడు పవిత్రం చేస్తుంది .మరణ కాలం లో కూడా మహా జ్ఞానం నశించదు .ఈ కధ విన్నా ,చదివినా అందరికి పుణ్యం లభిస్తుంది అని కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియ జేశాడు .
కాశీ ఖండం మొదటి అధ్యాయం సమాప్తం
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-12-12-.ఉయ్యూరు