శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3

          శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3

   రుక్మిణీ దేవి సర్వ దేహ వర్ణన ను చమత్కారం గావర్నించాడు ‘’సువర్ణా’’లతో .యుక్త వయస్సు వచ్చింది .ఆమెకు తగిన వరుడు శ్రీ కృష్ణుడే నని ఊహించి చక్కని పద్యం చెప్పాడు .

‘’హరి  యమ్శం బున బుట్టె గ్రుష్ణు డిలపై ,నద్దేవుని గూర్ప ,వా

  గ్వరుడూహించి విచిత్ర కల్పనముగా ,బద్మాంగి నీలాల కో

త్కరంగ ,నీ సుదతిన్ సృజించి ,జఘన స్థానంబు గాజేసేనో

ధరణిన్ ,దత్తరుణీత్రయంశాక్రుతి ,దత్తాద్దేతువై కన్పడన్ ‘’

కృష్ణుని లోనీ అంశాలన్నీ ఆవిడ శరీరం లో ఉన్నట్లు చెప్పటం భావుకతకు పట్టం కట్టటమే .ఆమె మోవికి మామిడి చిగురు ,మంకెన పువ్వు ,యెర్ర తామరా వగైరాలేవీ సరి పోవటం లేదనటం చిత్రం గా ఉంది..పరిణతి లో సారూప్య స్తితి తో వర వర్ణిని గా పేరు పొందింది .కృష్ణుడు కూడా ఆమె రూప లావణ్యాలను తెలిసి కొని ,’’తనకుం జాయగా జే కొందు ననుచు శౌరి దలచేన్ ‘’అని పిస్తాడు .’’మేడ్ ఫర్ఈచ్ అదర్’’అన్నట్లున్నా రన్న మాట .

         కూతురి పెళ్ళి చేయాలని తండ్రి భీష్మకుడు భావించి ,మంత్రులతో ,పెద్దలతో తగిన వరుడేవారు అని అడుగుతాడు .తనకు కాబోయే అల్లుడు తలిదండ్రులు బల వంతులైన బంధు గణం గురు పురోహిత హితులు ,సిరి సంపదా ,కళా ,సాహస ఔదార్యం ,పరాక్రమం గుణ విరాజం ఉన్న రాజ కుమారుడై ఉండాలని అన్నాడు .కమల వంటి కుమార్తెకు హరిని బోలిన అల్లుడు దొరికితే మహదానందం అన్నాడు .

‘’కన్యాం రూప గునాన్వితాం మమ సుతాం ,క్ష్మాపాల బాలైక మూ

  ర్ధన్యాం కాంచన రత్న భూషణ యుతం దాస్యామి తే విష్ణవే

  ధన్యోహం హి గృహాణ ‘’యంచు హరి పాదద్వంబు న్వార్చి ,ఈ

  కన్యాం దానము సేయగలగు ఘన భాగ్యం బెన్న దిన్కబ్బున్ ‘’

   ఇలా సంస్కృతం లో తెలుగులో పద్యాన్ని ,కన్యాదానాన్ని వివరించాడు విచిత్ర కవి .

         మంత్రు లంతా ఏకాంత మందిరం లో సంప్రదించుకొని ఏక వాక్యం గా శ్రీ కృష్ణుడే తగిన వరుడని అతని పుర విశేశాలు ,ఆయన గుణ శీలాదు లన్నిటిని సవివరం గా చెప్పారు .శ్రీ కృష్ణుని కలిమి ముందు ఇంద్ర ,కుబేర సముద్ర ,ఈశ్వర విభూతు లేవీ చాల వన్నాడు .అతని శరీరం లోనీ ప్రతి భాగాన్ని అద్భుత మైన పద్యాలతో వర్ణించాడు .ఆయనే రుక్మిణీ పతి కాగలిగిన వాడని చెప్పారు .

            అన్న రుక్మి అక్కడే ఉన్నాడు .వీళ్ళ తీరు నచ్చలేదు .అతని మనసులో శిశు పాలుడున్నాడు .ఇచ్చకపు మాటలతో రాజును ప్రక్క దోవ పట్టిస్తున్నారని ‘’అనర్ఘ్య రత్నాన్ని ఆర ఊతంబు తోదవున అతకటం లాఉంటుంది రుక్మిణిని కృష్ణునికిస్తే’’ అన్నాడు .కృష్ణుని చేష్టల్ని తన వక్య చాతుర్యం తో గేలి చేశాడు .’’నిలువెల్లా మాయ ,కులం ,గుణం లేవు .ఎన్నో చోట్లు మార్చాడు .గుణం లేని వారి స్నేహం రూప రేఖాదులు లేని వాడు ‘’అంటూ నిందా స్తుతి చేశాడు .కవి సామర్ధ్యం ఇక్కడ ప్రస్పుటం గా కన్పిస్తుంది .మరి శిశుపాలుడు ‘’మహిత కనక కుదర చాప మంత్ర జపుడు ,భరిత పరమ కృపుడు ‘’అని మెచ్చాడు .రుక్మిణి భరించలేక పోయింది .రాచ కన్య ఏమీ చేసే స్తితి లో లేదు .అక్కణ్ణించి వెళ్లి పోయింది .ఎక్కడికి వెళ్ళిందో ,ఏమి చేసిందో చూద్ద్దాం

‘’కాంత ఏకాంత కాంత నిశాంత శయ్య –వాన్తగతి నొప్పె తాం త లతాం తమై

  దంతరిత పూర్వ జోదితో దంత చింత –సంత సంతాప దంతురి తాం త రామమున ‘’

  అంతటి బాధను ఇంతటి అందమైన పద్యం లో బంధించాడు కవి .ఆమె వెంట మనమూ వెళ్తున్న భ్రాంతి కల్గించాడు .ఆమె బాధ ‘’గోరు చుట్టూ పై రోకటి పోతూ ‘’లా ఉన్నదాని మంచి జాతీయం ప్రయోగించాడు .

          సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-12-ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.