కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

                    రాయల సీమ గేయ కవి పులి కంటి కృష్ణా రెడ్డి

             రాయల సీమ అంటే ఆనాడు రాజ భోగం రత్నాలు ,ముత్యాలు వీధుల్లో అమ్మే కృష్ణ దేవరాయల రాజ్యం జ్ఞాపకం వస్తుంది కాని నేడు రాయల సీమ అంటే కరువు ,కాటకం దర్శన మిచ్చి కన్నీరు తెప్పిస్తుంది హృదయం ద్రవిస్తుంది .రత్నాల సీమ రాళ్ళ సీమ గా మారి పోయిందని వ్యధ ధ్వనిస్తుంది .అయితే సాహిత్యం అను నిత్యం పండే సీమ గా మనకు కని పించి మానసిక ఆనందం కలుగుతుంది పాట ,పద్యం కదా ,గేయం వెళ్లివిరిసిన రత్నాల సీమ నేడు రాయల సీమ .రాయలసీమ మాండలికాన్ని ఆస్తిగా గేయాల నిండా నింపిన పులి కంటి కృష్ణ రెడ్డి చిత్తూరు జిల్లాలో జన్మించారు తండ్రి గోవింద రెడ్డి తల్లి పాపమ్మ .

 

 

 

 

 

 

    తన అనుభావాలనన్నిటిని అక్షరాలుగా మలచిన అక్షర శిల్పి కృష్ణా రెడ్డి .రాయలసీమ పలుకుబడి జానపదుల ఒరవడి ఆపోసన పట్టిన వారాయన .ఆయన కద రాసినా గేయం విని పించినా’’ ఇది పులి కంటిది’’ అని స్పష్టమైన ముద్ర కని పిస్తుంది .ఆయన శైలి అనితర సాధ్యం .చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం లోని ‘’జక్క దోన ‘’లో 1931 లో కృష్ణా రెడ్డి జన్మించారు చక్కని దోవ ను జానపదానికి వేశారు .నటుడు ,గాయకుడు ,దర్శకుడు గా తన ప్రతిభను చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ రేడియో ,టీ.వీ.లలో ప్రసారమైనాయి .పత్రికలలో చోటు చేసుకొన్నాయి .ఎన్నో నాటకాలు రాసి ,స్వయం గా ప్రదర్శించిన వారు రెడ్డి గారు .తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి ఆ విషయాలనే రచనల్లో చొప్పించి జీవం పోసిన జీవదాత .సామాజిక స్పృహ ,తాత్వికత ఆయనకు సహజాతాలు .

           అన్నిటా కాలుష్యం పెరిగి పోయిందని బాధ పడే వారు రెడ్డి గారు .అందరు పూను కొంటె కాలుష్యాన్ని రూపు మాప లేమా అని ప్రశ్నిస్తారు .ఆయన భావాలన్నీ ప్రగతి శీలాలు .ఆయన సాహితీ సంపత్తిని విలువ కట్టటం చాలా కష్టం .అన్ని సాహితీ ప్రక్రియలను చేబట్టి అన్నిటిని ఉధృతం గా తీర్చి దిద్దిన మేటి రచయిత కృష్ణా రెడ్డి .అందరికి దూరమై పోయిన దళితులు అంటే ఆయనకు అమిత ఆదరం .వారిని అక్కున చేర్చుకొన్నారు .వారి మనోభావాలను వారి నోటి తోనే చెప్పి నంత సహజం గా రెడ్డి గారు కవిత్వం లో ,కధల్లో చెప్పి అనితర సాధ్యం అని పించారు.మహా మానవతా వాదిగా ప్రఖ్యాతు లయ్యారు .ఆయన కధలను చదివితే ‘’రాయల సీమ రా.వి.శాస్త్రి ‘’అనిపిస్తుంది అని కితాబు నిచ్చిన సీనియర్ పాత్రికేయులు ,సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారి మాటలు అక్షర సత్యాలే .మాల మాదిగల జీవితాలను సజీవ దృశ్యాలుగా చూపిన మహా రచయిత కృష్ణా రెడ్డి .ఆయన మాండలీకం ‘’కలకండ పలుకే’’.

              ఆంద్ర ప్రభ లో సంవత్సరం పాటు ‘’నాలుక్కాళ్ళ మండపం ‘’అనే ‘’కాలం ‘’నిర్వహించి రాయల సీమ జీవన చిత్రాన్ని సజీవం గా ఆవిష్కరించారు .కృష్ణా రెడ్డి గారు గొంతెత్తి పాడితే ఆ మాధుర్యం ,శబ్ద సౌందర్యం భావలహరికి జోహార్లు అంటాం .ఆయన తో పాటు కవి సమ్మేళనాలలో పాల్గొనే కవులు ఆయన ముందు చిత్తు అయి నట్లు కనిపించి పులికంటి అందరి కంటే మేటి అని పించారు ఎన్నో సార్లు .ఇది నాకు ప్రత్యక్ష అనుభవం .రైతు సమస్యలు ,రాజకీయాలు ,,ఓట్లు ,నీటి ఎద్దడి అన్నిటిని స్పృశించి రాసిన మేటి రచనలెన్నో ఉన్నాయి .56 కదల ‘’సీమ భారతం ‘’వెలువరించారు .రాయల సీమ యాస మీద మాంచి పట్టున్న రచయిత రెడ్డి గారు .ఎన్నో రేడియో ,టి.వి.కవి  సమ్మేళనాలలో పాల్గొని అందరి లోను తన పాటద్వారా’’ నాయక మణి ‘’గా నిలిచే వారు ..ఆయన రైతు పక్ష పాతి .ఆయన సృష్టించిన ‘’బాశాలి ‘’పాత్ర విశిష్ట మైంది .’’భాగ్య శాలి- బాశాలి’’ అయింది వారి యాస లో .కుటుంబాన్ని తీర్చి  దిద్దటం లో భార్య పాత్ర ఎలా ఉంటుందో ఇందులో చూపించారు

          కృష్ణా రెడ్డి రైల్వే శాఖ లో బుకింగ్ క్లార్క్ గా జీవితం ప్రారంభించారు .’’కామధేను ‘’పక్ష పత్రిక ను ఆరేళ్ళు సమర్ధం గా నడిపిన సంపాదకులాయన .ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగించారు .కృష్ణారెడ్డి కధలు ,గూడుకోసం గువ్వలు ,కోటిగాడు స్వతంత్రుడు ,పులికంటి దళిత కధలు సంపుటాలను రెడ్డి గారు వెలువరించారు .ఆయనవి 14 కధలు ఉత్తమ కధలు గా ఎన్నికైనాయి .’’పులికంటి సాహితీ సత్కృతి‘’స్తాపించిఎందరో  సాహితీ మూర్తులను సత్కరించారు .’’ఆటవెలదుల తోట ‘’కావ్యం రచించారు .ఆకాశ వాణి ,దూరదర్శన్ లకు సలహా దారు గా సలహాలన్దించారు .చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి ఉపాధ్యక్షులు గా దీర్ఘ కాలం పని చేశారు .’’సీమ చిన్నోడు ‘’అని అందరి చేత ఆప్యాయం గా పిలువబడ్డ పులికంటి  క్రిష్ణారెడ్డి గారు 2007 నవంబర్ 18 న 76 వ ఏట అనంత లోకాలకు చేరుకొన్నారు .’’తెలుగు జానపద దీపం ఆరిపోయింది .జానపదం చిన్న బోయింది ‘’.

            మరో కవి గురించి ఈసారి

             సశేషం

                 శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో

                         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –111-4-13 ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

  1. vijaya's avatar vijaya says:

    yevaru pattinchukoni kavini gurtuchesinanduku dhanyavadalu

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.