ఊచల ఉగాది
మా’బామ్మర్ది ’ టోలీ బౌలీ బ్రాహ్మి ‘’మధ్యాహ్నమైనా రాక పోయేటప్పటికి నాకు ఆశ్చర్యమేసింది ఉదయమే వేప పువ్వు పచ్చడితో ప్రారంభించి ఉపహారాలమీద దండు నడిపే మా వాడు అడ్రస్ లేకపోవటం వింతగా ఉంది .వాళ్ళ అక్కయ్య కంగారు మరీ ఎక్కువ అయింది .ఫోన్ చేయ్య్యమని నాకు ఇప్పటికే పది సార్లు చెవిలో జోరీగ గా పోరుతోంది .సరే కాదనలేక ఫోన్ చేశా.మనిషి మాట నీరసం గా ఉంది .ఇది మరీ ఆశ్చర్యమేసింది .సరే అర్జంట్ గా రమ్మని వాళ్ళక్క చెప్పినట్లు ఓ ఝలక్ ఇచ్చాను .వస్తానన్నాడు .
మొహం అదో రకం గా పెట్టుకొని వచ్చాడు .కారణం ఏమిటో మాకేమీ అర్ధం కాలేదు సరే వచ్చిన వాడిని సాదరం గా ఆహ్వానించింది వాళ్ళ అక్కయ్య .నెమ్మదిగా వంటింట్లో చేరి టిఫిన్ లాగించి నా దగ్గర కు వచ్చాడు .’’ఏమిట్రా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు .హుషారు లేదేం ?’’అన్నాను .వాడు ‘’ఏముంది బావా .ఈ సారి ఉగాది ‘’ఊచల ఉగాది ‘’గా ఉందని బాధ వేస్తోంది ‘’అన్నాడు .’’ఊచల ఉగాది ఏమిట్రా /కొత్తగా కాయినేజ్ చేశావా ?’’అన్నాను .’’నా బొంద కాయినేజ్ లేదు ఏం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం లో మంత్రులు కొందరు చువ్వలు లెక్క పెడుతూ ,కొందరు ఏ క్షణం లో చువ్వాల్లో ఇరుక్కుంటామో అని కంగారుతో మిగిలిన వారు ఉన్నారు కదా అందుకే దీన్ని ‘’చువ్వల ఉగాది ‘’అన్నాను .దానికీ నీ నీరసానికి సంబంధం ఏమిటి /అన్నాను .’’ప్రభుత్వం అంతా చువ్వల చట్ర్తం లో ఉంది కదా అని బాధ బావా నన్నేమీ చేయనివ్వటం లేదు మనసంతా అదో ఇది గా ఉంది ‘’అన్నాడు’’ సరే ఇంటి దగ్గర పండగ చేశావా ?’’అడిగా .’’వేప పువ్వు తిన బోయి కాయ పొరబాటున నోట్లో పెట్టుకొన్నాను బెల్లం వేయమని మీ చెల్లెలు చెబితే అల్లం కలిపా .మిరియం వేయమంటే గొడ్డు కారం పోశా .ఇంకా రుచి ఏముంటుంది >””అని వాపోయాడు .
‘’సరేరా –దేశ రాజకీయం సంగతేమిటి ?’’అని అడిగా .’’ఏం చెప్పను బావోయ్ .ఒక పక్క మోడీ సవాలు విసురుతూ మీసాలు దువ్వుతున్నాడు మరి రాహుల్ ఆశాజ్యోతి అని బుజాలేగారేసి ముందుకు తోస్తే బెదిరి పారిపోఎట్లున్నాడు .పూర్వం బండ లాగుడు పోటీలలో గిత్తలను కాడికి కట్టి చేన్నాకోల్ తో కొడుతూ ‘’అరె అరె ‘’అని అరుస్తూ అర్రుమీద చరుస్తూ ,తోక మెలేసి అంగాన్ని గిలి పడితే అవి పరిగెత్తుతూ బండ ను లాగేవి. .అందులోదమ్ము లేని గిత్త కాడిపారేసి పడుకొంటుంది అలా ఉంది ప్రధాన మంత్రి పదవి పోటీలో మోడీ కి రాహుల్ కి .రాహుల్ కాడి కిందకు రాక ముందే అర్జున విషాద యోగం అభినయిస్తున్నాడు ఇంకేం పోటీ బావా చప్పగా ఉంది .’’ఆన్నాడు బోల్డు బాధ పడుతూ మోడీ ని చూస్తె ఢీఢీ అంటుంటే కుర్రాడు తీవ్ర పోటీ ఇవ్వటానికి జంకుతూ పారి పోయే పోజులో ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు .యువజన ఆశాకిరణం నిరాశా కిరణం లా తయారయ్యాడు .అదీ బాధ .’’అన్నాడు ప్రపంచం బాధ తన బాధ అని వాపోయిన శ్రీ శ్రీ లాగా .
‘’చిరు దూసుకు పోతుంటే బొత్స అడ్డు తగుల్తున్నడుంటున్నారేమిటి ?’’అడిగా .’’అదే నాకు అర్ధం కావటం లేదు బా..ఏదో మంచి ఆలోచన లతో టూరిజం ను అభి వృద్ధి చేస్తుంటే ఇప్పుడు బొత్స అతన్ని అడ్డుకొంటున్నాడు .ఓర్వలేని తనం బావా ‘’అన్నాడు .’’కిరణ్ పరిస్తితి ఏమిటి ?’’అడిగాను .’’దున్నేస్తున్నాడు తన ముద్ర వేసేస్తున్నాడు .’’అన్నాడు
‘’అధికార పార్టీ పెరాలిసిస్ తో ఉంది అని అందరు అంటున్నారు ‘’నువ్వేమంటావ్ ‘’మళ్ళీ నా ప్రశ్న .’’అమ్మగారు పాపం జబ్బు తో ఉంది అమెరికా వెళ్లి రావటం సరి పోతోంది అబ్బాయి గారు దేన్నీ పట్టించుకోటం లేదు .ఆవిడ కనిపిస్తే సందడి లేకుంటే నీరసం లా ఉంది పరిస్తితి ‘’అన్నాడు .
ఇంతకీ ఉగాది పచ్చడి లో ఉన్న షడ్రుచులు నీకు తెలిశాయా /’’అడిగితె ‘’ఆరేమో కాని ఒక్క చేదే నాకు కనీ పిస్తోంది .ఖర్మ ఖర్మ ‘’అని లబో దిబో మన్నాడు మా టోలీ బౌలీ బ్రాహ్మి బామ్మర్ది
శ్రీ విజయ ఉగాది (వూ చల ఉగాది కాదండోయ్ బాబూ )శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-13-ఉయ్యూరు

