కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12
బ్రౌన్ పధగామి బం.గొ.రే.
బంగోరె అంటే బండి గోపాల రెడ్డి అని చాలా మందికి తెలియదు .బండి శంకరయ్యరెడ్డి ,శంకరమ్మ లకు 1938 అక్టోబర్ 10 న నెల్లూరు జిల్లా కోపూరు తాలూకా ‘’మిన గల్లు ‘’లో జన్మించారు .అక్కడే ప్రాధమిక విద్య చదివి నెల్లూర్ లో ఇంటర్ ,వాల్తేరు లో బి.కాం.ఆనర్స్ పూర్తీ చేశారు .పరిశోధన అంటే అమిత మైన ఆసక్తి చూపించేవాడు .1957 లో ‘’స్రవంతి ‘’అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు .తర్వాతా సెంట్రల్ కోఆపరేటివ్ బాంక్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం కొంతకాలం చేసి వదిలేశాడు ,.
1963 లో ‘’శ్రీ విక్రమ పూరి సర్వస్వ గ్రంధ మండలి ‘’లో చాలా వ్యాసాలూ రాశాడు బంగోరె .’’జమీన్ రైతు ‘’పత్రికకు సబ్ ఎడిటర్ అయాడు .నూరేళ్ళ నాటి నెల్లూరు సంగతులన్నీ అనువదించి ప్రచురించాడు .బంగోరె ‘’నెల్లూరు జిల్లాకు మొదటి జర్నలిస్ట్’’.గురజాడ కన్యా శుల్కం నాటకానికి విస్తృత అను బంధం రాసి 1969 లో ప్రచురించాడు .తమిళ నవలను ‘’చంద్రిక కద ‘’పేర తెలుగు లోకి అనువదించాడు .కట్టమంచి రామ లింగా రెడ్డి గారి పై వచ్చిన విస్తృత గ్రంధానికి బంగోరె సంపాదకత్వం వహించాడు .పఠాభి‘’ఫిడేలు రాగాల డజన్ ‘’ను పునర్ముద్రించాడు బంగోరె .ఎమెస్కో వారి ‘’తాతా చార్యుల కధలు ‘’కు సంకలన బాధ్యత చేబట్టాడు .డాక్టర్ జే.మంగమ్మ గారి పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించాడు .
1977 లో సర్ ఫిలిప్ బ్రౌన్ లేఖలను ‘’బ్రౌన్ లేఖలు –ఆధునికాంధ్ర సాహిత్య శకలం‘’పేరముద్రించాడు .బ్రౌన్ జీవిత చరిత్ర ను ఆంగ్లం లో ప్రచురించి ఘనకీర్తి పొందాడు బంగోరె .’’మాల పల్లి నవల పై నిషేదాలు ‘’పై పరిశోధన చేసి ప్రచురించాడు .వేమన పద్యాలను లండన్ నుంచి సేకరించి తెచ్చి‘’వేమన –C .P.బ్రౌన్ ‘’పేరిట ప్రచురించాడు .
సి.పి. బ్రౌన్
జమీన్ రైతు పత్రిక లో పని చేసినప్పుడే ‘’లోకలిస్ట్ కూని రాగాలాపన ‘’పేర ఒక ‘’కాలం‘’నిర్వహించాడు .’’అంతులేని రిసెర్చ్ చేసిన పరిశోధనా వ్యగ్రుడు బంగోరె ‘’అని పేరు పొందాడు .అందుకే ప్రఖ్యాత విమర్శకుడు కే.వి.రమణారెడ్డి బంగోరె ను ‘’రిసెర్చ్ గెరిల్లా ‘’అని ముద్దుగా ,మురిపెం గా పిలిచాడు .ఎన్నో అకాడెమీలు ,సాహితీ సభలు ,విశ్వ విద్యాలయాలు చేయాల్సిన పరి శోధనలను ఒంటి చేత్తో చేసి‘’అయ్యారే –బంగోరే‘’ అని పించాడు . ..తెలుగు పత్రికల పుట్టు పూర్వోత్తరాలను శాస్త్రీయ దృక్పధం తో విశ్లేషించిన మేటి విమర్శకుడు బంగోరె .
హిమాలయాలను సందర్శించాలనే గాఢ మైన కోరిక బంగోరె కు ఉండేది .దీనికోసం నెల్లూరు నుండి బయల్దేరి మళ్ళీ తిరిగి రాలేదు తిరిగి రాని లోకాలకు చేరుకోన్నాడని అందరు భావించారు .1982నవంబర్ 5 న బంగోరె మరణ వార్తను పత్రికలు ప్రచురించాయి .బంగోరె పరిశోధక వ్యాసంగానికి అవధుల్లేకుండా పోయిందని అందరు కీర్తించారు .ఒక రకం గా ‘’ఆధునిక పరిశోధనా పరమేశ్వరుడు బంగోరె ‘’.
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -12-4-13 –ఉయ్యూరు

