సాహితీ బంధువులకు ఉగాది శుభా కాంక్షలు -ఈ రోజు ఉదయం పద కొండు గంటలకు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం పూట ఉగాది స్పెషల్ పూజ, వేపపువ్వు పచ్చడి రవ్వకేసరి ప్రసాదం తర్వాతపంచాంగ శ్రవణం చేశాను స్వామి సమక్షం లో .పూజారి గారు ఆలయ మర్యాద తో సత్కరించారు ..
మధ్యాహ్నం విష్ణాలయం గత ముప్ఫై ఏళ్ళుగా అవిచ్చిన్నం గా కోన సాగుతున్న పంచాంగ శ్రవణా నికి నన్నూ ఆహ్వానించి చేయమని కోరారు నేను అక్కడ ఇప్పటికి డజను సార్లకు పైగా నే చేశాను ఎందూరి సుబ్బారావు గారి కుటుంబం నిర్వహించే సభ ఇది ఆయన మరణం తర్వాతా కుమారులూ కోన సాగిస్తున్నారు వారు నాశిష్యులు .కనుక చెయ్యమని కోరుతారుఅందుకే మధ్యాహ్నం 3గంటలకు అక్కడ పంచాంగ శ్రవణం చేశాను .ఉచిత రీతి సత్కరించారుఅయి పోయి ఇంటికి వచ్చాను మళ్ళీ నా శిష్యులు ఇంటికి వచ్చి వాసవీ క్లబ్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని దాని జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడే వచ్చారని దయతో మరో సారి పంచాంగ శ్రవణం చేయమని బ్రతిమిలాడారు న్యాయం గా మళ్ళీ వెళ్ళ కూడదు కాని శిష్య వాత్సల్యం తో అయిదింటికి వెళ్లాను .వారన్దరి ఎదుట మళ్ళీ చేస్తూ ఇలా మొదలు పెట్టాను ”పూర్వం రెడ్డొచ్చె మొదలాడు ”అనే సామెత లా ఉంది ఈపని . అంతేకాక వివాహ ముహూర్తానికి తాళి కట్టించేసి వీడి యో తీసే వాడు రాలేదని మళ్ళీ మూడు ముళ్ళు వేయించి నట్లుంది ”అని చెప్పి అందరి నవ్వుల మధ్యా మళ్ళీ పంచాంగ శ్రవణం చేసి వారందరికీ సంతోషం కలిగించాను . మళ్ళీ గౌరవ సత్కారం అందుకొన్నాను .
అయిదు రోజుల క్రితం దత్త గుడి ఆచార్యుల గారు రాత్రి పదింటికి ఫోన్ చేసి ఉగాది రోజు సాయంత్రం ఆరు గంటలకు దత్త గుడి లో పంచాంగ శ్రవణం చేయమని కోరారు కాదన లేదు సరే నన్నాను స్నానామ్ సంధ్యా పూర్తీ చేసి ఆరింటికి అక్కడికి వెళ్లాను ఆరున్నరకు ప్రారంభించి ఎడుమ్బావు వరకు చెప్పి అందరికి తృప్తి కల్గించాను .వారు ఘనం గా సత్కరించారు .”మీరే చెయ్యాలి మాస్టారూ వార్షికం గా మా వాళ్ళందరూ కోరుకొంటున్నారు ”అన్నారు ఆచార్యుల గారు ”సరే దైవ నిర్ణయం”అన్నాను పదేళ్ళ క్రితం దత్త గుడిలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం నాడు సీతా రామ కల్యాణం వేదాంతం రామాచార్యుల వారి ఆధ్వర్యంలో డా క్తర్ విశ్వేశ్వర రావు దంపతులు చేస్తూ నన్ను ”కామెంటరి ”చెప్పమని పిలిస్తే వెళ్లి చెప్పాను. నాటికి నేడు మళ్ళీ అని వారికి జ్ఞాపకం చేశాను ఇలా ఉగాది నాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పంచాంగ శ్రవణం నాలుగు సార్లు చేసి” ఫొర్ ట్రిక్” కొట్టాను అని పించింది దైవ లీల ఆయన దయ లేక పోతే ఇది సాధ్యమా ?”
మరోసారి ఉగాది శుభా కాంక్షలతో మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-13 -ఉయ్యూరు

