విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం
‘’ సహృదయ చక్రం ‘’పేర ఆచార్య కోవెల సుప్రసన్న గారు వెలువ రించిన విషయాలే క్రోడీకరించి మీ ముందుఉంచుతున్నాను .తన రామాయణానికి జాతీయ చైతన్య స్రవంతి వాహిక గా తీర్చి దిద్దాలనే తపన ఉన్న వాడు విశ్వనాధ .వాల్మీకి అంటే అమిత భక్తీ విశ్వనాధకు .అందుకే కై మోడుస్తూ
‘’ఈ సంసార మిదేన్ని జన్మముల కేని మౌని వాల్మీకి భా
షా సంక్రాంత ఋణంబు తీర్చగాలదా ?తత్కావ్య నిర్మాణ రే
ఖా సామగ్రి ఋణంబు తీర్చగలదా ?కాకుత్సుడౌస్వామి ,గా
ధా సంపన్నత భక్తీ దీర్చినను ద్వైతా ద్వైత మార్గంబులన్ ‘’
అందుకే విశ్వనాధ తన రామాయణాన్ని వాల్మీకి కి భాష్యప్రాయం అని చాలా సార్లు చెప్పుకొన్నాడు .తన కృతి వాల్మీకికి ప్రతికృతి మాత్రం కాదు .తనను సర్వకాల సర్వా వస్తలలో ‘’రామ చంద్ర పద పద్మాదీన చేతస్కుడను ‘’అని వినయం గానే అయినా నిగ్రహం గా చెప్పుకొన్నాడు .కల్ప వృక్షం కూడా ఇతిహాస లక్షణం కలిగినదే .మానవ జీవితం లోని ప్రతి దశనూ ఆవరించే ఇది నడిచింది ఉన్న 32 ఖండాలు దేనికదే ప్రత్యెక కావ్యమే .
బహు విధ శిల్ప విన్యాసాన్ని కదా కధనం లో ప్రయోగించిన విశిష్ట ప్రయోగ కవి విశ్వనాధ .ఒక్కో సారి నాటకాలుగా ,చలన చిత్రాలుగా ,చిత్రకళా ప్రదర్శనల్లా ఉంటె వేరొక చోట చర్చోప చర్చలుంటాయి మరికొన్ని చోట్ల విపుల వ్యాఖ్యాన గర్భితం గా వర్ననాత్మకం గా ఉండటం విశ్వనాధైక మార్గం .తన మార్గం నన్నయ తిక్కనల మార్గాల మేలు కలయిక అన్నాడు వేయి పడగల స్వామి .కల్ప వృక్షం అంతా కదా కదన కౌశాలమే నంటారు సుప్రసన్న .పాత్రల మనో లక్షణాన్ని తీర్చి దిద్దటం లో విశ్వనాధ తర్వాతే వ ఎవరైనా .అయన మనస్తత్వ శాస్త్రపాండిత్యానికి మనం శిరసు వంచాల్సిందే .హేతు కల్పనల వెంట ఆయన బుద్ధిని పరిగెట్టిస్తాడు .
జీవులందరూ అంతస్సులో పరమేశ్వరాన్వేషణ చేసే వారే .కనుక అందరిలో దైవ చింతన మనసు పొరల్లో ఉంటూనే ఉంటుంది .దైత్య ప్రకృతి వాచ్యం గా ఉంటె దైవీ ప్రకృతి వ్యంగ్యీ భూతం గా ఉంటుంది.రావణుని సంభాషణల్లో ఈ ప్రకృతిని బాగా చూపిస్తాడు విశ్వనాధ .సీతను జగన్మాత గా అరాదిస్తున్నట్లు తానామే భక్తుడైనట్లు ధ్వనిన్చేవే అతని పలుకులన్నీ .పోతన లో బీజ ప్రాయం గా ఉన్న ఈ భావం విశ్వనాధ లో విజ్రుమ్భించింది అంటారు కోవెల వారు .
రామాయణ కదా దైవీ ఆసుర శక్తుల సంఘర్ణమే నని విశ్వనాధ భావించాడు .దైవీ శక్తుల విజయమే కల్ప వృక్ష ఇతి వృత్తం .అందుకని ఇది వర్త మాన పరిధి ని దాటి సార్వ కాలిక మైనదైనది అంటాడు సుప్రసన్న .మరి దీన్ని నిబందిన్చాతానికి విశ్వనాధ విశిష్ట శైలీ ని ఎంచుకొన్నాడు ‘’నా చేత శబ్దమేరటకు చిన్నము నిలవదు ‘’అని తన మనో ధర్మాన్ని ఒప్పుకొన్నాడు .అంటే భావ తీవ్రుడాయన .ఆయన భావమే శబ్దాన్ని ఎన్నుకొంటుంది అయన ఎంచుకోడు .ఇదీ విశ్వనాదీయం .భావ వేగం తో శబ్దం దానంతట అదే రూపొందుతుంది అది సంస్కృతమా తెలుగా రెంటి మేళ విమ్పా అని ఉండదు అంతే అక్కడ ఆ శబ్దం వచ్చి కూర్చుంటుంది .విరుపులు ,ఒడుపులు అన్నీ అవే చోటు చేసుకొని వచ్చి కూర్చుంటాయి .అందుకే తన కవిత ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు వీతేన్చున్ పికీ కన్యకా నూనా వ్యాహృతి మాదు పంచమము చిందున్ దయో నదాంభః కాన శ్రీ నృత్యంబులు చూపు మత్కవిత ‘’అన్నాడు .అంతటి వైవిధ్యం ఆయన కవితది .’’ఔచితి లేదు ,భాషలేదాక్రుతి లేదు యూరక రసాత్మనే స్రవించి పోదు ‘’అని నిసర్గ రమణీయం తన కవిత అంటాడు
కల్ప వృక్షం లో విశిష్టాద్వైతం లోని శరణా గతి ధర్మాన్ని బాగా వ్యాఖ్యా నించాడు విశ్వనాధ .అరణ్య కాండలో మహర్షుల విభిన్న తపో లక్షణాలు కన్పిస్తాయి .భక్తిలో ఉన్న వై లక్షణం అంతా గోచరిస్తుంది .రావణాసురుని లో శ్రీ విద్య ఉంది .సీతా దేవి పరాశక్తి మంత్రం శాస్త్ర రహస్య మంతా ఇందులో నిండి ఉంది .వాల్మీకి మహర్షి సుందర కాండ లో ‘’సుందర హనుమ మంత్రాన్ని’’ నిక్షేపిస్తే విశ్వనాధ ‘’ఆపదుద్ధారక హనుమంమంత్రాన్ని’’ నిక్షేపించాడని వ్యాఖ్యానించారు సుప్రసన్నా చార్యులు .అందుకే ఆ మంత్రం ద్రష్ట శచీ పురందర రుషి తరచుగా హనుమత్ స్తోత్రం చేయటం కనీ పిస్తుంది .అడవిలో రామ లక్ష్మణుల తో వెళ్ళే సీతను వర్ణించే సీస పద్యాలలో ‘’సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం ‘’ఉందంటారు ద్రష్ట సుప్రసన్న .అసలు రావణుడే దక్షిణ ఆమ్నాయం లోని ‘’ఖగ రావణ మహా మంత్రానికి ‘’అది దైవతం అని తేల్చారు ఆచార్యుల వారు .నన్నయ గారి భారత లక్షణాలన్నీ కల్ప వృక్షం లో సంపూర్ణం గాఅన్వ యిస్తూ ఉంది అని గొప్ప కితాబునిచ్చారు డాక్టర్ సుప్రసన్న ..’’నా సకలోహ వైభవ సనాధము ‘’అని విశ్వనాధ చెప్పుకోవటం ఇందుకే నంటారు సుప్రసన్న .
శ్రీ రామ నవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -19-4-13-

