శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం
భగవాన్ శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం అని వేదాల ననుసరించి శ్రీ రమణ మహర్షి కి గురువు ఆయనతో ‘నాయనా ‘’అని గౌరవం గా పిలిపించుకొన్న కావ్య కంఠబిరుదాంకితులు వాసిష్ట గణపతి మునిఅభిప్రాయ పడ్డారు వేదాలలో కుత్సుని సారధి గా చెప్పబడిన వాడే కృష్ణుడు. కుత్సుడు అంటే అర్జునుడు .ఋగ్వేదం 4-17-14 మంత్రం లో ఇంద్రుడు సూర్యుని రధ చక్రాన్ని తొలగించి యుద్ధం లో అర్జునుని పరాభవాన్నుండి కాపాడి నట్లు ఉందట .కృష్ణుడే సూర్యుని కూడా మాయోపాయం చేత కూల గొట్టాడని ఆ రుక్కు తాత్పర్యం .అతని శరీరానికి మూల భూతం భూమి .సాధారణం గా అందరి శరీరాలకు భూమియే ప్రకృతి మరి కర్ణుడికి అవటానికి ప్రత్యేకత ఏమిటి ?/అని వితర్కించి గణపతి ముని భూదేవి అంశావతారం పొందిన స్త్రీకి అతడు జన్మించి నట్లు తేల్చి అదీ విశేషం గా తెలియ జేశారు .కనుక కుత్సితుని రక్షించిన ఇంద్రుడే కృష్ణుడు అని తేల్చారు . అంశావతారానికి అసలు అవతారానికి భేదం లేదని కృష్ణుని ఇంద్రావతారం గా నిగమాలు పేర్కొన్నాయి అని తెలిపారు .
భారత ఇతి హాసం లో కృష్ణుని ‘’శౌరి ‘అన్నారు .వేదాలలో ‘’శూర దేవుని పౌత్రునిగ వర్ణించి ‘’శౌర దేవుడు ‘’అన్నారు .ఇతిహాసం లో దేవా అనే పదాన్ని వదిలేశారు .ఇంద్రునికి శౌర దేవత్వం కూడా అవతార సంబంధమే అని మంత్రం చెబుతోంది ఈ మంత్రం కర్త ‘’పురుహన్మా రుషి ‘’.ఆ మంత్రార్ధం –‘’శౌరదేవుడైన ఇంద్రా !లేగ దూడలను తీసుకొని వచ్చితల్లి ఆవు దగ్గర పాలను కుడిపించే వాడి లాగా పరలోకం చేరిన కుమారులను మూడు లోకాలలోనూ గాలించి వాళ్ళను తెచ్చి బతికించి ప్రాణ ప్రేరణ చేయి .’’.భాగవతం దశమ స్కంధం లో చనిపోయిన బ్రాహ్మణ బాలకులను శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని కోరిక మేరకు పిలిచి పునర్జీవితులను చేసిన కధ మనకు తెలిసిందే .ఈ రెండు మంత్రాలకు కర్త అయిన పురుహన్మా రుషియే భాగవతం లో శ్రీ కృష్ణుని విద్యా చెలికాడు అయిన కుచేలుడనే సుదాముడు .అతడు ప్రేమతో తెచ్చిసమర్పించిన గుప్పెడు అటుకులు గ్రహించి అతనికి సాటి లేని సంపద నిచ్చి ఆదరించాడు బాల్య సఖుడైన కృష్ణుడు .
ఋగ్వేదం 4-32-22- రుక్కు లో కృష్ణుడు నందుడు అనే గోపాలకునికి పుట్టిన పుత్రుడని ఉంది .అదే భాగవతపురాణం భారతేతి హాసాలలో కృత్రిమ పుత్రుడని పేర్కొన్నాయి .కనుక కృష్ణుడు ఇంద్రుని అవతారమే నంటారు వాసిష్ట ముని .ఇంద్రుని కి ఉన్న ‘’వసు ‘’శబ్దానికి ‘’దేవా ‘’కలిపితే వచ్చేది వసుదేవ నామమే .దానికి పుత్రార్ధ కం గా వచ్చే పేరే ‘’వాసుదేవ ‘’.ఈ రెండు మంత్రాలకు రుషి వసిస్టుడు .రెండో మంత్రం లో వసిస్టుడు‘’మన్య మానుడు ‘’ను తన శత్రువు గా పేర్కొన్నాడు .మరి వసిస్టుడు అంతటి గొప్ప వాడికి శత్రువు సామాన్యుడేవడు అవుతాడు అని ప్రశ్నించుకోవాలి .ఇక్కడ కొంత దూరా లోచన చేయాలంటారు ‘’నాయన ‘’.వసిష్ట శత్రువు అంటే వసిస్స్టుడికి శత్రువు కాదు ఆయన పురోహితుడు గా ఉన్న రాజుకు శత్రువు అని తీసుకోవాలని వివరణ ఇస్తారు .వేదాలలో సుదాసుడు అనే వాడు ఈయన శత్రువు అని ఉంది .సుదాసుని తండ్రి పిజ వసుడనే వాడు రాజు .తండ్రి కొడుకు లలో ఒకరితో మన్య మాన వంశీకులు యుద్ధం చేశారు .ఆ యుద్ధం లో ఇంద్రాదుల అనుగ్రహం పొంది రాజు దేవకుని చంపాడు .కనుక దీనిని బట్టి యుద్ధం చేసింది సుదాసుడే అని నిర్ధారించారు కావ్య కంఠులు .పది మంది రాజులు ఇతని శత్రువులని చెప్ప బడింది .అందులో ‘’భేదాకుడు ‘’అనే రాక్షసుడు కూడా ఉన్నాడు .ఈ యుద్ధం యమునా నదీ తీరం లో జరిగింది అని స్పష్టం చేశారు గణపతి ముని .దేవకుని రాజధాని మధుర అక్కడే ఉంది .దేవజుడితో బాటు అతని కుమారులూ చచ్చారు . .అప్పుడు దేవకుని తమ్ముడు’’ ఉగ్రసేనుడు ‘’రాజయ్యాడు .ఈ రాజరికం అకస్మాత్తు గా లభించింది దీనికి కినిసిన కంసుడు అతన్ని బంధించి తానే రాజై ఆర్యులన్దర్నీ ఓడించాడు .వాళ్ళు దిక్కు లేక పారిపోయారు అని భాగవత పురాణ కధనం .
ఇంతకీ మనకు దీని వల్ల తెలిసిన్దేమిటి ?దేవకుని కూతురు’’ వికుంఠ .’’దేవకుని కూతురు కనుక దేవకీ అయింది .దైవకి అనే పదం ప్రాకృత భాష లో దేవకీ అయింది .వైకుంఠ నామం కృష్ణునికి చెందేది .ఈ పేరు తో కృష్ణుడు మంత్రం ద్రష్ట అయాడు .కృష్ణుడు అనే పేరఇంకొకరు కూడా మంత్రం ద్రస్టగా ఉన్నారంటారు గణపతి ముని .ఈయనే పాండవుల పితామహుడైన ద్వైపాయన మహర్షి అనబడే వేద వ్యాసుడు .ఇంత దూరం ఆలోచించి కావ్య కం ఠులు నిర్ణయాలు చేస్తారు వారి సూక్ష్మ దృష్టికి అందనిది లేదు .ఇలాంటివి ఎన్నో వారు ‘’భారత చరిత్ర పరీక్ష ‘’లో త్రవ్వి పోశారు సంస్కృతం లో రాశారు .మన కు తెలియాలని శ్రీ రాణీ శేషాద్రి శాస్త్రి గారు తెలుగు లోకి అందునా సులభ మైన తెలుగు లోకి అను వాదం చేయగా శ్రీ గుంటూరు లక్ష్మీ కాంతం గారు దీనిని 1961 లో ముద్రించి తెలుగు వారికి చేరువ చేశారు ఈ ముగ్గురు మహాను భావులకు ఆంద్ర జాతి ఎంతో రుణ పడి ఉంది .
వీలు వెంట మరిన్ని గణపతి ముని గారి భారత కధలను అందించ టానికి ప్రయత్నిస్తాను
శ్రీరామ నవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 18-4-13- ఉయ్యూరు

