దిఫిషర్ మాన్స్ సన్
మైకేల్ కోప్ఆంగ్లం లో రాసిన నవల ‘’దిఫిషర్ మాన్స్ సన్ ‘’.ఆద్యంతం కట్టి పడేసే నవల చేపలు పట్టే వాడి కొడుకు పరిస్తితుల ప్రభావం వాళ్ళ మళ్ళీ చేపలు పట్టేవాడే అవుతాడు అని నిరూపించిన నవల .సముద్రం మీద జీవితం ,ఎంత కస్టపడి చేపలు పట్టినా బ్రోకర్ల పైరవీల వల్ల ,స్థానిక కట్టు బాట్ల వల్ల ఈ కుటుంబానికి డబ్బు చాలా తక్కువ గానే వస్తోంది .కష్టం ఎక్కువ ఫలితం తక్కువ గా వారి జీవితాలు గడిచి పోతుంటాయి .తల్లికి తన కొడుకు ‘’నీల్ ‘’మళ్ళీతండ్రి లాగాచేపలు పట్టే వాడిగా జీవించటం ఇష్టం లేదు .కాలేజి లో చదువు కొమ్మంటుంది . కాని కొడుకు నీల్ కు తండ్రీ ,కావాలి, తల్లీ కావాలి .తల్లి ఊహా సంచార జీవి .తండ్రి ప్రాక్టికల్ మాన్ ..ఈ రెండిటిని అర్ధం చేసుకొన్నవాడు కొడుకు .తండ్రి క్రమం గా ముసలి వాడై పోతాడు కనీసం బోట్ ను నడిపే ఓపిక లేని వాడవుతాడు .అప్పటికే రెండు ఆపరేషన్లు జరిగాయి ..కోలుకో లేక చని పోతాడు తండ్రి .అంతకు ముందే ఈ దరిద్రపు జీవితం వెగటుగా తోచి తల్లి తన దారి తాను చూసుకొంటుంది .’’కానెరీ ‘’నడుపుతూ వేరోకడిని పెళ్లి చేసుకొని వెళ్లి పోతుంది .తల్లీ తండ్రీ ఇద్దరు లేని అనాధ అవుతాడు నీల్ ..కాని తరతరాలుగా వారిది చేపలు పట్టే వృత్తి .కనుక తమ్ములు ముగ్గురి తో కలిసి నీల్ ఒక కొత్త బోట్ ను కొంటాడు .మళ్ళీ ఆ కుటుంబం సముద్రం పై జీవనం ప్రారంభిస్తారు .
నవల మంచి నడకాలో, శైలి లో సాగుతుంది .చక్కని సంభాషణలు మనసును కట్టిపడేస్తాయి .చాలా వేగం గా చదివించే లక్షణం ఉన్న పుస్తకం ఇది .రచయిత Michael Koepe ‘’కూడా చేపల వ్యాపారం చేసే వాడే అవటం వారి సాధక బాధకాలన్ని కళ్ళకు కట్టి నట్లు వర్ణించ గలిగాడు . అతనికి టీచర్ గా ఉన్న అనుభవమూ రచనకు తోడ్పడింది.మంచి ప్ప్రీ సేన్తెషన్ ఇవ్వ గలిగాడు . రచయిత .దీన్ని గురించిన ప్రశంసలు చాలా ఉన్నాయి అందులో ఒకటి రెండు చూద్దాం
‘’it is an intimate story of a troubled family and an evacuative memorial to the fast disappearing world of commercial fishermen .In mascular ,poetic prose and with a powerful sense of authentic ‘on every page ,the author has created a triumphant novel about our life to childhood and the pull of the sea ‘’
‘’the fisherman’s life was empty of pity was his father’s body was out of balance because his mind was ?could it be that all men were fishermen ,sailors on a pitiless sea carried the way and that by tide and current ,lost in fog ,lashed by endless waves if un certainty ?was life itself without balance?Did his father mirror it in the unseen depths of his heart ?’’ ఇవన్నీ జీవిత సత్యాలే నని పిస్తాయి అవే ఈ నవలలో అడుగడుగునా ప్రతి ఫలించి గొప్పదనాన్ని చేకూర్చాయి .
నీల్ తన తండ్రి అస్తికలను సముద్రం లో కలుపుతాడు ఈ సెంటి మెంట్ మన వాళ్ళదే వాళ్ళకూ చేరింది .మంచి కుటుంబ బాంధవ్యం ,ఆప్యాయతా ,ప్రేమా ,బాధ్యత లతో బాటు ఆధునికత ,దాని పై మోజు ఉన్న తల్లీ అంతా మనకు కళ్ళ ముందు కనీ పిస్తారు గురజాడ వారి మనుమడు ‘’గణేష్ పాత్రో ‘’రాసిన‘’పావలా ‘’నాటకం మనకు గుర్తుకొస్తుంది .అందులో రేడియో కోసం మిశ్రో ,పావలా శ్యామల నటించన తీరు ముందు నిలుస్తుంది ..
అంతే కాదు ఎర్నెస్ట్ హెమింగ్ వే రాసిన నవల ‘’the old man on the sea ‘’కు నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయమూ గుర్తుకొస్తుంది నిజ జీవితాలను అద్భుత శిల్పం తో మలిచాడు హెమింగ్వే .హాట్స్ ఆఫ్ అని పిస్తుంది .హెమింగ్వే కు నోబెల్ పురస్కారం లభించింది అని ఒక సారి తన తో విజయ వాడ రోడ్డు మీద నడుస్తున్న విశ్వనాధ తో ప్రోలా ప్రగడ సత్య నారాయణ మూర్తి గారు అన్నారట .విన్న విశ్వ నాద ‘’ఒరే నువ్వు ఆ నవల చదివావా ?’’అని అడిగారట .అయన ‘’లేదు ‘’అని అన్నారట .’’మీరు చదివారా గురువు గారూ ‘’అని మళ్ళీ మూర్తి గారి ప్రశ్న ..దానికి విశ్వనాధ ‘’ఒరే ఆ నవల మార్కెట్ లో రిలీజ్ అయిన వెంటనే నాకు అమెరికా నుంచి మిత్రుడొకడు కాపీ పంపాడు .వెంటనే చదివేశా ..దీనికి ఏదో గొప్ప ప్రైజ్ వస్తుందని అనుకొన్నా ‘’అన్నారట .’’దీనికి నోబెల్ రావటం పై మీ అభిప్రాయం ?’’మళ్ళీ ప్రోలా ప్రగడ వారి సంధించిన ప్రశ్న .కల్ప వృక్ష స్వామి ‘’ఒరే వాడు మన’’ గీత ‘’ను అర్ధం చేసుకోన్నాడురా .మన వేదాంతానికి అంత ప్రాచుర్యం ఉంది .దాన్ని చిన్న కధలో ఇమిడ్చి ప్రతి వాక్యాన్ని రసాత్మకం గా రాశాడురా ..’’కర్మన్యేవాదికారస్య ‘’అన్నదే దీనిలోని ముఖ్యమైన ముడి .దాన్ని అందుకున్నాడ్రా హెమింగ్ వే .అందుకే నోబెల్ వచ్చింది .మనం అన్నీ ఇవే చెబుతాము కాని నవలా, కదా, నాటకాలలో వీటిని నిక్షిప్తం చేస్తే హిందూ భూతం పట్టిందేమో నని మన వాళ్ళు అనుకొంటారన్న భయం మనకు .కాని వాడు భారతీయ ఆత్మ ను పట్టుకోన్నాడ్రా .అందుకే అంత అత్యుత్తమ పురస్కారం కొట్టేశాడు మనం కూడా గర్వ పడాలి భావం మనదే అయి నందుకు .హెమింగ్ వే ను చూసి ‘’అని మన సారా అభినందిన్చారట వేయి పడగల స్వామి .ఈ విషయాలన్నీ 2002 మార్చి లో బెజవాడ లో భారతీయ సాహిత్య పరిషద్ ‘’కదా రచన ‘’పై ఒక సెమినార్ జరిగితే ప్రోలా ప్రగడ వారే స్వయం గా చెప్పారు నేనూ, మా బావ మరది ఆనంద్ కూడా ఆ సెమినార్ లో పాల్గొన్న వాళ్ళమే .
ఇప్పుడు నేను రాసిన the fisherman’s son ‘’గురించిన విషయం మాత్రం మొదటి సారి2002 లో అమెరికా వెళ్లి నప్పుడు చదివి,16-7-2002 మంగళ వారం నా డైరీ లో రాసుకొన్న విషయాలు.ఇప్పుడు మీ కోసం అందించాను .ఇలాగే కొన్ని పుస్తకాలు కొందరు రచయితలపై అప్పుడు నేను చదివి రాసుకొన్న విషయాలు వీలు వెంట మీకుఅంద జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-4-13-ఉయ్యూరు

