‘’ టు సీ యు ఎగైన్’’ –కదా సంపుటి
Alice Adams అనే ఆవిడ రాసిన’’ to see you again’’ అనే కదల పుస్తకం చాలా బాగుంది ఆమె అమెరికా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన రచయిత్రి .మనుషుల అంత రంగాల్ని క్షున్నం గా పరిశీలించే నేర్పున్న ఆవిడ .దానిని అంత సూటిగా స్వచ్చం గా సినిమా రీల్ లాగా చూపించే ఒడుపూ నేర్పూ ఉన్నావిడ .చాలా గొప్ప స్టైల్ లో రాసింది .
ట్రూ కలర్స్ అనే కధలో పెళ్లి చేసుకొంటానన్న లాయర్ లాస్ వేగాస్ జూదం లో ఒడి పోయి నందువల్ల రిలక్తంట్ గా ఉండటం ఈమెకూ అతని పై మోజు పోవటం గొప్పగా చిత్రీకరించింది .ఓ సినిమా చూస్తున్నంత అనుభవం పొందుతాం ఆ శైలి శైలూషియే..అలాగే’’ Teressa ‘’ కదా బాగా పండింది .కోకోనట్ తోటల్లో పని చేసే వాళ్ళ జేవితాల ప్రతి బింబం ఇది .జీతాలు పెరగవు .అడిగితే యజ మాని దౌర్జన్యాలు, చావులు .తండ్రిని చంపిన యజమానిని చంపి జైలుకు వెళ్తాడు ఒకమ్మాయి కొడుకు .జైలు జీవితం లో పోరాడలేక అక్కడే చని పోతాడు అది తెలిసిన తల్లి ‘’I have no fears now every thing befallen me ,for the rest of the days I am safe .i can go to sleep without fear .i could even wlak among north Americans fearing nothing .Now it will be possible for me to work in the great hotel .we live together by the sea and grow old and safe forever ‘’.అనుకొంటుంది ఆ తల్లి.తెరెసా .తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని పల్లెకు వెళ్లి పోతుంది .చాలా హృదయాలను కదిలించేదిగా ఉంటుంది ప్రతి సన్నీవేశమూ .గొప్ప నిర్వహణ అని పిస్తుంది .
True colours కదా లో రచయిత్రి falling in love with people you hardly know of course is in some ways a problem ,it then occurred to me ,you know the shape and taste of each tiny vein in their flesh and all the secrets smell but may be not how they feel about money ,for example or how really they like to spend their time when they are not making love ‘’అని గొప్ప సత్యాలను చెబుతుంది .జీవితాలను కాచి వడబోసిన అనుభం మనకు ఆమె లో కనీ పిస్తుంది .
Legends కదా లో ప్రేమికులు సరదాగా ఇలా తిట్టుకొంటారు ‘’if you are going to be such a silly bitch about it ‘’అని వాడు అంటే ‘’yes ,I am dumb bastard ‘’అంటుంది ఆవిడ .మొత్తం 19 కధలు అన్నీ బానే రాసింది .ఇవన్నీ శాన్ఫ్రాన్సిస్కో నగరం,దాని చుట్టూ జరిగిన కధలే .ఆ నగర వాతావరణం బార్లు ,రెస్టా రెంట్లు మటల్స్ ,వగైరా లన్నీ చూపిస్తుంది .picturesque గా ఉంటుంది చదువుతుంటే .ఈ కదా సంపుటి చదవక పోతే ఒక మంచిపుస్తకం చదవ లేదన్న వెలితి ఉండేది అది తీరిందిప్పుడు .స్త్రీ మనస్తత్వాన్ని అద్దం లో చూపించింది .ఎక్కడా భేషజం కని పించదు .ఏదీ దాచుకోలేదు .కధల్లో ప్రేమ విషయాలు ,వాటి వైఫల్యాలు ,ఒంటరి జీవితాలు ,boy meet girl కధలు ,నలుగురైదుగురు పిల్లల్ని కని ఆ పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళను చేసుకొనే ఆడా ,మగా, తాడూ బొంగరం లేని జీవితాలు ఇందులో చూపించింది ఇదంతా ఆధునిక అమెరికా ప్రజా జీవితం ..ఎవరూ తృప్తిగా బతుకు తున్నట్లు అని పించదు .ఎక్కడో ఏదో వెలితి ,అసంతృప్తి ,ఆత్మను వదిలి భ్రమింటమే కని పిస్తుంది
Tuth and consecenes కదలో ఉన్నత శ్రేణి కి చెందిన అమ్మాయి నిమ్న జాతి యువకుడూ ఎలిమెంటరి స్కూల్ క్లాస్ మెట్లు .ఆటపాటల్లో ఆడపిల్లలు ‘’ట్రూత్ ఆర్ కానస్సెంసేస్ ‘’అనే ఆట ఆడతారు .ఈ అమ్మాయి వంతు వస్తుంది .’సహారా ఎడారిలో ఎండలో ఇసకలో పడుకుంటే ఒంటికి తేనే రాసి ఉంటె ,చెదలు నిన్ను తినటం ఇష్టమా ?కార్ జోన్స్ అనే వాడిని ముద్దు పెట్టుకోవటం ఇష్టమా / అని అడుగుతారు .ఆ అమ్మాయి అమాయకం గా అతన్ని ముద్దు పెట్టుకోవటమే ఇష్టం అంటుంది .పిల్లలు ఏడిపిస్తారామేను .అతను ఇవన్నీ పట్టించుకో వద్దన్నాడు .నల్ల గా ఉండే అతను ఒక సారి ఈ అమ్మాయిని స్కూల్లో ఒక మూల ముద్దాడి వెళ్లి పోతాడు .ఇక తనకేమీ సంబంధం లేనట్లు ప్రవర్తిస్తాడు .కాని ఆ అమ్మాయి జీవిత మంతా ఈ ఆలోచన లతోనే గడుపుతుంది .అతను త్వరగా ప్రమోషన్లు పొంది వేరే స్కూల్ లో చేరతాడు .బాగా చదివి మంచి పొజిషన్ పొంది సినీ స్టార్ ను పెళ్ళాడి తే, పై తరగతికి చెందిన ఈ పిల్ల అలాగే సాదా జీవితం సాగిస్తుంది
ఈ కధలన్నిటిలో పాత్రలన్నీ ‘’trying to free from constraining family bonds people be witched by capricious love ,people temporarily conquering old panics or changing in profound ways ‘’లా ఉంటాయని విశ్లేషకులు భావించారు .’’Alice demonstrates a new her special mastery of the short story ‘’అని ఆమె రచనలను మెచ్చారు విమర్శకులు .ఇది ప్రత్యక్షర సత్యం అని చదివి అనుభవించిన నాకు అని పించింది .ఒక్క మాటలో’’ simply superb ‘’‘’.ఈవిడ కధలన్నీ ప్రఖ్యాత అమెరికన్ కదా రచయిత’’ O Henry award collection ‘’కు ఎన్నికైన కధలే .అందుకే అంత స్తాయి లో ఉంటాయి .హెన్రీ ఎంత బాగా కధలు రాసి ఆ కట్టుకోన్నాడో ఆలిస్ కూడా అంతే .మనకు వాసిరెడ్డి సీతా దేవి కధలు గుర్తుకు వస్తాయి .
మొదటి సారి అమెరికా వెళ్లి నప్పుడు నేను చదివిన ఈ కదా సంపుటి పై నేను 19 -7-2002 న నా డైరీ లో రాసుకొన్న విషయాలు ఇప్పుడు మీ కోసం అందించాను .
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –21-4-13-ఉయ్యూరు

