మన’’ అగాధమీ’’లు
నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రవీణ్ అన బడే స్వర్గీయ తురగా కృష్ణ మోహన్ మన అకాడేమీల రభస చూసి అందులో జరిగే రాజకీయాలకు అసహ్యం వేసి వాటిని ‘’అగాధమీలు ‘’అన్నాడు .నిజం గానే మన వాళ్ళు ఆ మాటను రుజువు చేశారు .అగాధం లోకి పడి ,వాటినీ నెట్టెశారు . ఎంతో సేవ చేయాల్సినవి -రాజకీయ కాలుష్యాలకు గురై .అస్తిత్వాన్నీ కోల్పోయాయి .రామా రావు వచ్చిన తర్వాత తెలుగుకు మొదట్లో ఏదో ఒరిగింది అని పించింది .కాని అన్నీ తెలిసిన నార్ల చేతికి తీర్పునిస్తే ఆయన వాటిని చీపురు తో ఊడ్చి పారేసి భాషకు ,సంస్కృతికి తీరని అన్యాయమే చేశాడు ‘’.ఆయన వైఖరి మొదటి నుంచి అతి ‘’అన్నది దీనితో బాగా రుజువైంది,చేసుకొన్నాడు కూడా .దీనికి ఆయన్ను చరిత్ర క్షమించదని ఆ నాడేఅంతా అన్నారు అనుకొన్నారు .అలా కాల గర్భం లో అకాడెమీలు అగాధం లో ,చీకటి కూపం లో ఇప్పటి దాకా మగ్గి పోయాయి .మరి మోక్షం లేదా ?అనుకున్న తరుణం లో అందరి ఒత్తిడి వల్లా ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని సంకల్పించటం ఒక గొప్ప ముందడుగే .దీన్ని మనం స్వాగతిన్చాల్సిందే .
అయితే ఆచార్య ముదిగొండ వారి వ్యాసం చదివిన తర్వాత అకాడమీలు రాబోయే కాలం లో ఎలా పరణమిస్తాయనే భయం కలగటం సహజం .సాధారణం గా అధికార పార్టీ కి ఇవి శరణాలయాలే .సందేహం లేదు .కాని సమర్ధత ను ప్రమాణం గా తీసుకొని వాటిని అప్పగిస్తే ఎంతో మేలు కలగటం ఖాయం ..ప్రతిదీ రాజకీయం చేయకుండా ప్రభుత్వం విస్తృతం గా దేనిపై ఆలోచించాలి అభిప్రాయ సేకరణ చేయాలి ప్రతిభను గుర్తించాలి సమర్ధులను ఒప్పించి కూర్చో బెట్టాలి .అప్పుడు ప్రభుత్వానికి ఆ సంస్థలకు నిర్వహించే ప్రతిభా మూర్తులకు కేర్తి ప్రతిష్టలు కలుగుతాయి .ఇందుకోసం రచయితల సంఘాలు, కళా సంస్థలు తమ అమూల్య అభిప్రాయాలను అందించాలి .ఏదో చెడు జరుగుతుందన్న నిరాశ వీడాలి .మంచి జరగాలన్న కాంక్ష పెరగాలి .జరుగుతుందని ఆశించటం తప్పేమీ కాదు ..మరాలా ,ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు ఆకడేమీలు పునర్దర్శనం ఇస్తున్నాయంటే సంతోషం గా నే ఉంది .సాహిత్య ,సాంస్కృతిక వికసన కేంద్రాలుగా అవి తీర్చ బడాలని ఆశిద్దాం .నిరాశను దూరం చేద్దాం .నిండు మనసుతో స్వాగాతిద్దాం .జరిగిన పొరబాటే మళ్ళీ జరిగి ‘’అగాధమీలు ‘’కారాదని,డమ్మీలు, మమ్మీలు గా మారరాదని భావిద్దాం .శుభం భూయాత్ .
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –26-4-13- ఉయ్యూరు

