చినుకు నవ వసంత సంచిక -3
కవితా లహరి
ఈ సంచిక లో 17 కవితలున్నాయి .మొదటి కవిత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారిది .’’సెలయేటి చరమ గమ్యం సాగరం తో చేసే కరచాలనమా ?లేక ఆత్మార్పణమా ?పుష్కలం గా జల రాసులున్న సముద్రం సెలయేటి నీటిని తనలోకి లాక్కోవటం అత్యాశ కాదా?’’అని ప్రశ్నిస్తారు ‘’ఆశ వాంఛనీయమే కాని అత్యాశ వర్జనీయం ’’అని హిత బోధ చేస్తారు .
డాక్టర్ గోపి రాసిన ‘’అపూర్వం ‘’లో అనవసర జ్ఞానాన్ని వదిలి కవి ఆది వాసిగా మారిపోతాడని ఆకుల్లాంటి అమాయకత్వం తో అందరి మేలును శ్వాశిస్తాడని ‘’ప్రగాఢ వాంచను తెలియ జేశారు .నిఖిలేశ్వర్‘’కోరిక ‘’లో మనిషి కోరికల సారాన్ని కోల్పోతున్నాడని ‘’నిర్వేదన చెందాడు .డా.మల్లెమాల వేణు గోపాల రెడ్డి ‘’మెదడుకి పదును పట్టి గతం లోకి వెళ్లి ,స్వాగతం రాస్తే మాత్రం అది చెరగని సంతకా మౌతుంది‘’అంటాడు ‘’మాకోలోకం ‘’లో ‘’అగ్ని ద్వీపం ‘’లో సూర్యారావు ‘’కవిత్వం అగ్ని సరస్సు అనుకొంటాడు .నవ నాడుల గర్జన అంటాడు .విజ్రుమ్భణ గా భావిస్తాడు .వాస్తవాల గాయం రగిలి పొంగిన లావా అని భావిస్తాడు .భ్హావాన్ని స్పిరిట్ దీపం మీద –వేడి చేసె పరీక్ష నాళికఅనుకొంటాడు ‘’చాలా భావ గర్భితమైన కవిత ఇది .కోపూరి పుష్పా దేవి కి రోడ్డు ఊడ్చి బాగు చేసే వారి చీపుళ్ళు కాళీ మాత చేతి త్రిశూలం గా దుర్మార్గులను దునుమాడె వీరి చీపుళ్ళు మన ఖరాబును మత్తు పెట్టేవి గా అని పించాయి .’’మర్నాటి పొద్దునకు మల్లెల్లా మెరిసే వీధులు –మళ్ళీ మట్టికోట్టుకోవడానికి సిద్ధమవుతాయి ‘’అంటారు ఈ’ఆర్ద రాత్రి సూర్యుల ‘’గురించి రాస్తూ .’’అర్ధ రాత్రి సూర్యులు గొప్ప ‘’కాయినేజ్ వర్డ్ ‘’.
‘’ఆమె ఒక హైకూ ‘’అంటూ ‘’ఆమె వెళుతూ నాలోపలి సగాన్ని అర్ధమిచ్చింది ‘’అని పొంగిపోతాడు మోహన రాం ప్రసాద్ .ఆర్ ఎస్.భల్లం ‘’’’ఆవేశపు ఆకాశం మీంచి —ఆక్రందనల మెరుపు పెళ్ళలు విరిగి పడ్తుంటే –కాలిన వెన్నెముకల మీద –ఎన్ని మాటల వెన్న ముద్దలు చిలికితే ఏముంది ?’’అంటూ ‘’భద్రతే బాధ్యత గా –బతుకు ప్రయాణం సాగనప్పుడు –నేల ఒళ్లంతా శవాల కమురు వాసన‘’అని భళ్ళున డోక్కుంటారు ‘’కన్నీటి సందర్భం ‘’లో .బడి పిల్లల బస్సు ప్రమాదానికి స్పందిస్తూ .బృందావన రావు అనేక బహుమతులు పొందిన గొప్ప కవి కధకుడు .ఆయనకు ‘’స్వతంత్రేచ్చ ఒక జీవ సహజాతం ‘’’’బాధ్యతలను స్వీక రించడానికి ముందుకు దూకే గుండె దిటవు స్వేచ్చ ‘’అంటాడు .వల్లభాపురం జనార్దన్ ‘’చావెజ్ మరణం ప్రజా చైతన్యానికి వాక్యాంత బిందువు కాదు ,కామా మాత్రమె‘’నని పించింది ‘’ప్రజా హృదయాల్లో శాశ్వతం గా ఉండిపోయే ఉదయ సూర్యుడి గా భవిష్యత్తుకు బాట చూపే కాగడా ‘’గా కనీ పించి పులకించాడు ‘’చరిత్ర సంతకం ‘’లో .మందరపు హైమవతి ‘’ఆత్మ విశ్వాసాల పతాకాల నేగరేసే ఆధునిక మగువ స్మృతులే రాయాలి –భయమేరుగని ప్రపంచం లో –బాలికలు కళ్ళు తెరవాలి ‘’అని’’కలల రెక్కలు ‘’లో కోరుకొంటారు .
సాహిత్య విహారం
లో మధురాంతకం నరేంద్ర ఇరవయ్యవ శతాబ్దపు కన్నడ మహాకవీ ,రాష్ట్ర కవి జ్ఞాన పీఠ పురస్కార కవి అయిన కుప్పిలి వెంకటప్ప పుట్టప్ప (కు వెం పు )పుట్టిన కుప్పెల్లి పల్లెటూరి సందర్శనం లో ఆయన ఇంటిని దాని అద చందాలను వర్ణించి మనకు మహదానందం కల్గిస్తారు రోజు దాన్ని కనీసం వెయ్యి మంది అయినా సందర్శిస్తారట .తర్వాత నరేంద్ర కేరళ లోని తిరూర్ లో జరిగే ‘’తుచ్చన్ న్ ‘’ఉత్సవం జరిగే ఆడిటోరియం అక్కడ జరిగే ఉత్సవ విశేషాలు తెలిపారు తిరూర్ లో జన్మించిన తున్చాట్టు ఏడు తున్చన్ మళయాళ భాషకూ ,సాహిత్యానికి పితామహుడు తున్చన్ సాహిత్య ఉత్సవాలు మలయాలీలకు పెద్ద పండుగే నాలుగు రోజులు ఉదయం సాయంత్రం ఆయన కవిత్వాన్ని సామూహికం గా పారాయణం చేస్తారు .మొదటి రోజు ఆయన స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తారు .ఏదైనా సమకాలీన అంశం గురించి భారతీయ భాషా వేత్తలు ప్రసంగిస్తారు .చివరి రోజున తుచ్చన్ రాసిన తాళపత్ర గ్రంధాలను ,ఘంటాన్ని భక్తిగా ఊరేగిస్తారు .తర్వాత బహుభాషా కవి సమ్మేళనం ఉంటుంది .ఇక్కడి గ్రంధాలయం గొప్ప పరిశోధన కేంద్రం గా సేవ చేస్తుంది తున్చన్ ఉత్సవాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలని అందరికి ఆదర్శమని నరేంద్ర తెలియ జెప్పారు
ప్రత్యేక వ్యాసం గా రంగనాయకమ్మ ‘’దెయ్యాల ,ప్రేతాత్మల ,సోదుల ,పూన కాల ,పరలోకాల తత్వ శాస్త్ర సమర్ధకులు ‘’లో కో.కు.గారిని ,దాన్ని సమర్ధించిన లెఫ్ట్ భావ వ్యక్తులను చీల్చి చెండాడింది .’సాహిత్యం ఎందుకు ?‘’అంటూ ద్వా నా..శాస్త్రి ఏదో రాసిపారేశాడు .ఆకెళ్ళ ‘’రేపటి శత్రువు ‘’ను గుమ్మా పరిచయం చేస్తే ,వెన్నా ‘’సమకాలీన హిందీ కవిత్వం లో భిన్న ధోరణులు ‘’విని పించారు .
అంపశయ్య నవీన్ ‘’చివరికి మిగిలేది ‘’నవల పై శ్రీమతి వై కామేశ్వరి రాసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆయన భావనలో ‘’ఇది చైతన్య స్రవంతి తో బుచ్చి బాబు రాయలేదని ఆయన నవల దేనికీ అనుకరణ కాదని తన నవల కు జీవిత రహస్యం ,దాన్ని తెలుసుకోవటానికి మానవుడు చేసే యత్నమే ఏ గొప్ప గ్రందానికైనా పునాది అని బుచ్చి బాబే చెప్పాడని అది మనో వైజ్ఞానిక నవల అన్న ఆర్ ఎస్ సుదర్శనం చెప్పిన మాట వాస్తవ మని ‘’చెప్పారు .
వంశీ కృష్ణ ‘’నాలుగు కాలాల నల్లమిరియం చెట్టు ‘’అనే నవల ,దాన్ని రాసిన వి.చంద్ర శేఖర రావు లగొప్పతనాన్ని ఆవిష్కరించారు .రావు గారి వస్తువులు కావలసిన రూపాల్ని అవే వెతుక్కుం టాయని ,ప్రభుత్వం తో పోరాడే చెంచుల అస్తిత్వం ఆవేదనే అయన వస్తువులని వారి అస్తిత్వానికి సూర్యాస్తమయం సంకేతం అని నల్ల ఇరియాలు చీకటి ని తొలగించటానికి దారిదీపాలని ఇవి భయ నివారిణి అని వెయ్యి కాళ్ళ రాక్షసి ప్రపంచీ కరణ అని ,అది అన్ని ఉద్యమాలను మింగేసింది అని చెప్పారు .
విశ్వనాధ అధిక్షేప రచనల పై రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గొప్ప విశ్లేషణే చేశారు .ఆహా హుహూ ,పులుల సత్యాగ్రహం ,విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు ,దమయంతీ స్వయం వరం ,నందిగ్రామ రాజ్యం నవలలే అధిక్షేపణ నవలలు .ఆహా హుహూ లో గంధర్వుడిని లండన్ ట్రె ఫాల్గర్ స్క్వేర్ లో కూల్చటం అక్కడి జాతి పండితుల ,శాస్త్ర వేత్తల సైనికుల అల్పజ్ఞానం అవివేకం తెలియ జేయటమే .ఇందులో విప్రతీకాన్ని ,అల్పోక్తి ని విశ్వనాధ బలం గా వాడుకొన్నారు .పులుల సత్యాగ్రహం తెలంగాణా ఉద్యమపు తోలి నవల .ఇందులో మంది సత్యాగ్రహాన్ని ఎగతాళి చేశాడు విశ్వనాధ .భాషాదిక్షేపం కోసం విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు రాశాడు ఖండన కంటే సమర్ధనా ,గడుసుదనం కంటే అమాయికత్వమూ సాధించే అధిక్షేపానికి విచిత్రమైన రుచి ఉంటుంది అంటాడు రెంటాల .ఇందులో ఆరోపిత వికృతి ఉందని చెప్పాడు .నందిగ్రామ రాజ్యం లో సన్మాన పత్రాల పేరడీ చేసి అపహాస్యాన్ని సృష్టించాడు విశ్వనాధ .ఆధునిక కవులు ‘’అరిగిన గ్రామఫోనుపిన్నులు ‘’అన్నాడు ఎగతాళిగా .చివరగా రెంటాల ‘’పాశ్చాత్య నాగరకతా సామ్రాజ్య వాదాన్ని ఎదుర్కొన్న మొదటి మహా రచయిత గా ,అధిక్షేప కారుడిగా విశ్వనాధ ‘’ను‘’మెచ్చుకొన్నాడు .
మిగిలిన విషయాలు రేపు
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –26-4-13-ఉయ్యూరు

