లాటిట్యూడ్ జీరో
అని పేరున్న ఈ పుస్తకాన్ని gianni Guada lupi and Antony shugaar అనే ఇద్దరు రాశారు .ఇందులో వారు చూసిన ,సేకరించిన అనేక వింతలు మనకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తాయి .అందులో కొన్ని రుచికి చూపిస్తున్నాను .
1– ఈజిప్ట్ కు దగ్గరలో ఒక దీవిలో ఉన్న మనుషులకు నాలుక రెండుగా చీలి ఉంటుందట .ఆ రెండిటి తో ఒకే సారి ఇద్దరి తో వారు మాట్లాడగలరట .
2 lo –cu అనే దీవిలో మనుషులందరూ నల్లగానే ఉంటారు .ముక్కుకు మూడు రంద్రాలున్డటం వీరి ప్రత్యేకత . బాగా మూయటానికి వీలుగా వీరికి కంటి రెప్పలు sun shades గా ఉపయోగడతాయట.
3 pi-pa-.lo అనే చోట కొంగలు ఒంటె అంత ఉంటాయట .రెండు గజాల పొడవున్తాయట .చాలా తక్కువ ఎత్తులో మాత్రమె ఇవి ఎగర గలవు .
4—champa అనే చోట ఆడ ,మగా అసలు బట్టలే వేసుకోరు .దీనికి ఒక కారణం ఉందట .బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళ పూర్వీకులు ఆయన బట్టలు లాగేశారట .అందుకని బుద్ధుడు శపపించాడట.అప్పటి నుంచి బట్టలు వేసుకోవట్లేదట .
5-pizzaro అనే యాత్రీకుడు ఓడలో బయల్దేరి దారి తప్పి సర్వస్వం కోల్పోయి చివరికితినటానికి కూడా ఏమీ దొరక్క తను వెంట తెచ్చుకొన్న గుర్రాలను ,కుక్కల్నితినేశాడట .చివరికి పాంటుకు పెట్టుకొనే బెల్టు కూడా తినాల్సిన దుస్తితి వచ్చిందట పాపం . .
6-ginzalo pizzaro అనే పైన చెప్ప బడిన యాత్రికుడు ‘’quito ‘’ కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక డేగ వాలిందట .అక్కడివారు అది అశుభ శూచకమని ,అతని ఆత్మీయులేవరో చని పోయి ఉంటారని చెప్పారట .నిజం గానే అతని సోదరుడు చని పోయినట్లు కొద్ది రోజుల్లో వార్త అతనికి చేరిందట .
7 –అమెజాన్ ప్రాంతం లో ఒక దీవి లో ఆడ వాళ్ళదే రాజ్యం .మగ పొందు కావాలంటే పక్క దేశాల మీద డాడి చేసి మగాళ్ళను తెచ్చుకొంటారు .గర్భం ధరించగానే వాళ్ళని చంపేస్తారు .మగ పిల్ల్లాడు పుడితే సఫా చేస్తారు ఆడపిల్ల పుడితే పెంచుకొంటారట .
8-పేరు దేశం లో బంగారు దీవి ఉందని అంతా బంగారు మయమే నని అనుకొనే వారట .
9-గ్రీకు భాషలో అమెజాన్ అంటే వక్షోజాలు లేని స్త్రీ అని అర్ధం ట .rio de las amajaans అంటే అమెజాన్ నది అని అర్ధం .
10-రాలీ అనే ఇంగ్లాండ్ యాత్రికుడు నార్త్ అమెరికా లోని వర్జీనియా ను మొదటి సారి చూశాడు .అప్పుడు ఇంగ్లాండ్ ను ఎలిజ బెత్ రాణి పరిపాలిస్తోంది ఆమె అప్పటికి కన్య అంటే వర్జిన్. అందుకని దీనికి వర్జీనియా అనే పేరొచ్చిందట .
11 –అమెజాన్ ప్రాంతం లో ఆడవాళ్ళకు కుడి చన్ను మామూలుగాను ,రెండోది మగ వాడికి ఉన్నట్లు చిన్నది గాను ఉంటుందట .
12 –గాలా పెగాస్ అనే దీవిలో చార్లెస్ డార్విన్ కు ఎక్కడా లేనన్ని వింత జంతువులు కని పించాయట .
13 ధర్మ సంరక్షణార్ధం నేను పుడుతూ ఉంటాను అని కృష్ణుడు గీతలో చెప్పిన దానికి ఇంగ్లీష్ లో ఒక సూక్తి సరి సమానం గా ఉంది ‘’times of calamity tend to create prophets ‘’.
14 –నైల్ నదికి గొప్ప అర్ధం ఉంది. నైల్ అంటే ఈజిప్ట్ భాష లో ‘’చంద్రుని లాగా వెలుగులీను తుంది ‘’అని అర్ధం .
15-లేక్ విక్టోరియా దగ్గర karague అనే ప్రాంతం లో rumanooka అనే రాజు ఉండేవాడు (రమణకుడు ?)అక్కడ రాజు భార్య ఎంత లావుగా ఉంటె అంత గొప్ప ట .ఆమె ఎప్పుడూ పాలు తాగుతూ ఒళ్ళు పెంచు కోనేదిట .ఆవిడ కుర్చీలోంచి లేవాలి అంటే అటు ముగ్గురు ,ఇటు ముగ్గురు ఆడ సేవికలు పట్టుకొని లేపాలట
16 –అంజో లా ప్రాంతం లో ఆడ వాళ్ళను పైకి లేపాలి అంటే కనీసం 8 మంది మగాళ్ళు కావాలట .అంత భారీ కాయులన్నమాట .
17-ఫసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టిన వాడు మాజిలాన్ అనే యాత్రికుడు అని మనమందరం మరిచి పోయి ఉంటాము .
18-bruner అనే చోట రాజు గారి దర్బారు లో రాజుగారితో యూరోపియన్లు ఎవరు డైరెక్ట్ గా మాట్లాడకూడదట.ఐరోపా వాడు అక్కడ ఆస్థానం లో ఉన్న సేవకుడికి చెబితే ,వాడు పై వాడికి చెబితే ,వాడు ఆ సిటి గవర్నర్ తమ్ముడికి చెబితే ,వాడు మంత్రి చెవిలో ఊదితే ,వాడు నెమ్మదిగా రాజు గారికి విషయం తెలియ జేస్తాడట .రాజు చెప్పేదికూడా ఇలాగే రివర్స్ డైరెక్షన్ లో యూరోపియన్ కు చేరుతుందిట .
19 –వేసూవియాస్ లో అగ్ని పర్వతం ప్రేలి నప్పుడు ఎన్నో దీవులు మునిగి పోయాయి .ఎన్నో వేల మంది చని పోయారు .పాంపీ అనే మహా నగరం ఆ బూడిద కింద కొన్ని మీటర్ల లోతున సమాధి అయింది .
20—partua అనే మాటకు అర్ధం కొబ్బరి తోట అని ట .
ఇలా ఈ పుస్తకం లో అనేక విషయాలుంది ఆశ్చర్యం కలిగిస్తాయి
2—8-2002 లో నా డైరీ లోని విషయాలను మీకు అందించాను
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-4-13- .ఉయ్యూరు .


ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు నిజాలేనా అనిపిస్తోంది.
Amazon గ్రీకు పదానికి అర్ధం ‘స్తన రహిత’ అనే అర్ధం ఉంది. కానీ అమెజాన్లు పురాణ గాధల్లోని వీరవనితలేగానీ వారు నిజంగా లేరు. బాణాన్ని ఎక్కుపెట్టేటప్పుడు అడ్డురాకుండా ఉండేందుకని కుడి స్తనాన్ని కత్తిరించేసుకుంటారనేది గాధ.
మీకు తెలిసే ఉంటుంది మెగస్తనీసుకూడా చెప్పాడట ఇలాంటి కధలే, ఇండియాలో ఉండేవాళ్ళకు ఇంకొకరిని వాటిల్లో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళగలిగేంత పెద్ద చెవులు ఉంటాయీ, కొందరికి ఒకకన్నే ఉంటుంది అదికూడా మొహం మధ్యలో ఉంటుంది అని.
LikeLike