కిసుక్కు కిసుక్కు

కిసుక్కు కిసుక్కు

1-ఒక కూతురు తండ్రి అల్లుడితో ‘’అల్లుడూ !మా అమ్మాయిని గారాబం గా పెంచినీ  చేతిల్ పెడుతున్నాం .ఎలా ఎలుకొంటావో ?’’

గడసరి అల్లుడు ‘’అదేంటి మామగారూ !మీరు సంపాదిస్తున్నంత వరకు మీఅమ్మాయిని   నేను జాగాత్తగానే చూసుకొంటాను ‘’అన్నాడు

2-కూతుర్ని వియ్యపు రాలికి అప్పగిస్తూ ‘ఒదినా !మాపిల్లను అల్లారు ముద్దుగా పెంచి ఎక్కడికీ పంపకుండా జాగ్రత్త గా చూసుకొన్నాను .ఇక మీదే బాధ్యత ‘’అంది

గడసరి అత్త’’అదేమిటి ఒదినా !నాలుగు రోజుల్లో మా కోడలికి  పుట్టిల్లు జ్ఞాపకం వచ్చేట్లుచెయ్యక పోతే మీ మీద ఒట్టు ‘’

‘’అంది

3-బాబూ !తెలంగాణా వస్తే నువ్వే ప్రభువువి కదా .నా సంగతి సేల్లెలు సంగతి ఎంది ?అని అడిగాడు కే.సి.ఆర్ ని కొడుకు కే.టి.ఆర్ .

‘’దాందేముంది కొడకా !వెంటనే హైదరాబాద్ వదిలేల్లమని ఒత్తిడి సేసి ఆంద్రోళ్ళ పై ఒత్తిడితెచ్చి పంపినంక నీకు పట్టాభిసేకం సేయనో ‘’అన్నాడు

‘’మరి కవిత సంగతేంది నాయనో ?”’మళ్ళీ ప్రశ్న .

‘’మెదక్ జిల్లాను రాష్ట్రం సేసి సిన్నమ్మకు కట్టబెట్టనో ‘’అన్నాడు తండ్రి .

4-‘’యేమిరా పొరగా !నువ్వు సువ్వలు లెక్కిస్తాఉంటే నేను నీ అక్కా,దేశాలు సుట్టి కాల్లు  పీక్కోచ్చ్చేదాకా నడిసి డిల్లీ ,ఇటలీ కెళ్ళి ఒత్తిడి తెచ్చి నిన్ను విడిపించి పట్టంకట్టే ఒప్పందం చేశాం .మా గతేంటి ?జయమ్మ అడిగింది కొడుకు జ’’గన్ ‘ ను .

‘’అమ్మరో !సేసిన మేలు మరిచే  వాణ్నికాను నాన్న లాగా .నీకు రాయల సీమ రాసిస్తా.అక్కకు బెంగుళూర్ రాసిస్తా ‘’అన్నాడు అలవాటులో పొరబాటుగా.

5- ఒరేయ్ !ఆ అమ్మాయికి వంద లవ్ లెటర్లు రాశా .రెస్పాన్సు లేదురా .ఏం చేయాలో తోచటం  లేదు ;;అడిగాడు ప్రేమా రావు తన స్నేహితుడు సలహాల్ రావు ను .

‘’భయపడకు బ్రదర్ .ఫలించక పోయినా రోజుకోటి రాస్తూండు. గిన్నీస్ బుక్ ఎక్కే అదృష్టం దక్కుతుంది ‘’అన్నాడు సలహాలు .

6-‘’ఓదినా !నిన్న జీడిపాకం సీరియల్లో చివరికేమైంది .?మా ఆయన అన్నం పెట్టమని పీక్కు తింటే వెళ్లాను చూడలేక పోయాను అడిగింది పక్కింటి ఆవిడను ఒక సీరియల్ రాణి

‘’ఏముంది ఒదినా !హీరోయిన్ చీర మార్చుకోటానికి వెళ్ళిందా .బీరు వాలో ఏ చీరా నచ్చక కింద పారేస్తుంటే ,అసలు చీర కట్టిందో లేదో తెలియ కుండా ఎపిసోడ్ పూర్తయింది అంతే ‘’అంది పక్కింటి ఆవిడ

7-‘’నాధా !ఆంధ్రాను చీలుస్తారా లేదా ?’’’’అడిగింది పార్వతి శివుడిని .

‘’నేను నిన్నూఎలుకొంటూనే  గంగనూనెత్తి కెత్తు కొన్నాను.శ్రీనాధుడు అడిగి నట్లు ‘’పరమేశా గంగ విడువు పార్వతి చాలున్ ‘’ అని  విడిచే చేద్దామంటే రాష్ట్రం అంతా వరదల్లో మునిగే పోయింది ఇంకా గంగ అవసరమే లేదు కదా ?అని నర్మ గర్భం గా నవ్వ్వి తప్పించుకొన్నాడు భవుడు .

8- పిల్లలూ !ఆంద్ర ప్రదేశ అవతరణ శుభా కాంక్షలు’’అన్నారు  ఓమేష్టారు క్లాస్ లోని పిల్లలతో

‘’సార్ !చెప్పండి ఇదే లాస్ట్ చాన్స్ ఏమో .వచ్చే ఏడు ఏం చెప్పాలో ?’’బుర్రగోక్కున్నాడోక గడుగ్గాయి

9-పింగళి లక్ష్మీ కాంతం గారు బందరు వదిలి మద్రాస్ లో ప్రాచ్య లిఖిత భాండాగారం లో రెండేళ్ళు పని చేసి మహా భారతం పై అపూర్వ పరిశోధన చేసి తిరిగి వచ్చినప్పుడు బందరులో మిత్రులన్తాఘన సన్మానం చేశారు పింగళి వారు రెండు గంటలు భారత విషయాలను అనర్గళం గా ప్రసంగించారు .అధ్యక్షా స్తానం లో ఉన్న విశ్వనాధ ‘’మా కాంతం మద్రాస్ లో నిద్ర పోతు ,చుట్ట కాల్చుకొంటూ కూచున్నదేమో అనుకొన్నాను .అట్లా కాదని ఇప్పుడు తెలుసుకొన్నాను భారతాన్ని తరచి పరిశోధించాడు ‘’అని మెచ్చారు .

10-స్వామినాధన్ అనే పెద్దాయన పింగళి వారికి పెట్రన్ .’’గొడుగు పేట గోల్డ్ స్మిత్ ‘’అని అందరు పిలిచే వారు .ఆ నాటి పెద్ద లందరి మీద స్వామినాధన్ చాటువులు చెప్పే వారు .

లక్ష్మీ కాంతం గారిపై ఆయన చెప్పిన రెండు  చాటువులు

‘’కాంతాయ కాఫీ హోటలు ప్రాంతాయ –రుజా క్రాంతాయ –వృధా సంభవాయ ‘’.

‘’చేత కానీ లేని పూరంగడు –పూవుల రంగడై విరియ బూచిన  తంగేడు సంగడీడు ‘’

11-కాటూరి వారి పై స్వామినాధన్ చెప్పిన చాటువు

‘’గూడ కట్టొక టేసి –అన్నంబు దిన్నచో –అరుగు దంచూరక –పోగాకునే త్రాగెడు గ్రాకు గాడు ‘’.

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-13-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.