పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -2
పింగళి వారికి”దేవ గాంధారి ”రాగం అంటే చాలా ఇష్టం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ ,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా నప్పింది పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్టం లో అంతా కరుణ రాసం విస్తరించి ఉంటుంది అర్జునుడు కర్ణుడిని చంపకుండా వచ్చినప్పుడు సంభాషణలు రస వత్తరం గా ఉంటాయి. ఆ సీన్ లో పింగళి వారు అద్భుత నటన ప్రదర్శించి సెహబాస్ అని పించుకొన్నారు తిరు వెంగళా చార్యులు అనే గొప్ప నటుడు ..”కరండక వేషం ”వేసే వారు .లక్ష్మీ కాంతం గారు ఈ ఘట్టం లో చూపిన విషాదం అందరిని కళ్ళ నీరు పెట్టించేవి ..
ద్రోణ వధ లో కృష్ణార్జునులు ధర్మ రాజు ను అబద్ధం చెప్ప మని బల వంత పెడతారు .”వొడ బడడీ ప్రుదాగ్ర తనయుండు అనృతమ్మువచింప ”అంటూ కోపం లో ధర్మజుడు లేచి పోతాడు అంతకు ముందు విషాదం చూపిన చూపిన పింగళి వారు విషాదం వదిలి కాల రుద్రునిగా మారి నిష్క్రమిస్తారు మళ్ళీ వచ్చి .”అశ్వత్థామ హత కుంజరః ”అని అయినా అనమని పట్టుబడతాడు కృష్ణుడు ససేమిరా అననంటాడు నేను అబద్ధమాడాను నేనేక్కడికైనా వెళ్లి పోతాను అంటదు ధర్మ రాజు ఈ సందర్భం లో . ధర్మ రాజు
” ”ఏను అసమర్దుదన్ ధరణి ఎలాగా జాల తపోనిరూఢికై -కానన సీమకుం జనియెద కర్ణుని ద్రున్తువో ,కర్ణుని చేతనే
ప్రాణము కోలు పోయేదవో,భండన భూమి పరిత్యజించుడువో -పూనిన మానమున్ విడిచి పోయి సుయోధను నాశ్ర యింతువో ”అని తిరుపతికవుల పద్యం పాడేటప్పుడు కూడా ప్రేక్షకులు కంట తడి పెట్టె వారు చివరికి తమ్ముడు అర్జునుని లెవ దీసి మన్నింపు మని కన్నీటితో కౌగ లించుకోవటం తో ఆ రంగం లో కాంతం గారి నటనా కౌశలం పతాక స్తాయి నందు కొంటుంది ఇంతటి మహా నటుడు ఆంద్ర దేశానికి లభించి నందుకు బందరు పౌరుల ఆనందం వర్ణనా తీతం. ధర్మ రాజు పాత్ర వారికి అజరామర కీర్తి సాధించి పెట్టింది ఆయన్ను అపర ధర్మ రాజు గా భావిం చే వారు. నట జీవితం లోనే కాదు నిజ జీవితం లోను అబద్ధం ఆడని అపర సత్య సంధులు పింగళి వారు .
”చతురంబోది పరీత మైన ధరణీ చక్రంబు ”అనే పద్యం ,”చచ్చిరి సోదరుల్ సుతులు ”పద్యం పాడినా రస ప్లావితమయ్యే వారు రసిక లోక జనం ధర్మజ పాత్ర పింగళి వారు వెయ్యటం ఎలా జరిగిందో తెలియ జేసే సంఘటన ఒకటి ఉంది చెళ్ళ పిళ్ళ వారి ఆధ్వర్యం లో ఒక ఊళ్ళో పాండవ ఉద్యోగ విజయం నాటకం జరుగుతోంది. ధర్మ రాజు పాత్ర దారికి జబ్బు చేసి రాలేదు .శాస్త్రి గారు ఆ పాత్రను తనతో బాటు వచ్చిన పింగళి వారిని వెయ్యమని ప్రోత్స హించారు .వెంటనే సంకోచించకుండా వెయ్యటం అందరి మెప్పు పొందటం జరిగి పోయింది .అప్పటి నుంచి ధర్మ రాజు పాత్ర వేస్తున్నారు .
ఒక సారి రాజ మండ్రి లో ఈ నాటకాన్ని వేస్తున్నారు ,నాటకం మధ్యలో వడ్డాది సుబ్బా రాయ కవి (వసు రాయ కవి )లేచి నిల్చుని ”ఎవరు నాయనా నువ్వు “?అపర ధర్మ రాజు లాగా ఉన్నావు ”అని అన్నారట. లక్ష్మీ కాంతం గారు స్టేజి ముందుకొచ్చి అందులో భీమ పాత్ర దారి అయిన తన అన్న గారు నరసయ్య గారి ని వేలు పెట్టి చూపిస్తూ
”వీర రసావ తారుడని విశ్రుతి కెక్కిన నాటకుండువా-క్శూరుడుమానృసిమ్హునకు కూరిమి తమ్ముడ
వీర ,శోక ,శృంగార రస ప్రధానముల నాయక వేష ధరుం డ ,సత్కవిన్ -పేరున కేను కాంతుడ పవిత్రపు వంశ జాతుడ”న్
అని ఆశువుగా తనను పరిచయం చేసుకొన్నారు . మహేంద్ర పండితులంతా సెహబాస్ అని మెచ్చుకొన్నారు . నరసయ్య గారు ఉబ్బి తబ్బిబ్బు అయి లోపలకు వెళ్లి తమ్ముడిని ఆప్యాయం గా కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. నరసయ్య గారినటనకు బంగారు గంటల వెండి గదను బహూకరించారు నరసయ్య గారు ఆంజనేయ ఉపాసకులు కూడా ..”సంపూర్ణ మహాభారతం ”అనే నాటకం రాసి ప్రదర్శించారు కూడా .
కాంతం గారు స్పుర ద్రూపి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు మనిషి. విశాలమైన పద్మ పత్రాల వంటి కనుదోయి ఉత్తమ లక్షణ సమన్వి.తులు.పలుచని చర్మ ఉండటం వల్ల ధీరో దాత్త గుణాలున్దేవి .. వారి జీవితమూ కరుణ రస ప్రధానమే అందుకే కరుణ తో ఉన్న ధీరో దాత్త పాత్రలు ఆయనకు మరీ అచ్చోచ్చాయి .రాయల్ కంపెని మూత పడింది .ఆంద్ర సభ అనే సంస్థ ఏర్పడింది బందరులో. దీనిలో అంతా ఉద్యోగస్తులే మెంబర్లు .ముంజులూరు కృష్ణా రావు పింగళి వారు దీనికి సారధులు .ముత్తరాజు వెంకట సుబ్బారావు గౌరవాధ్యక్షులు. వీరు గయోపాఖ్యానం .,పాడుక ,కంఠా భరణం ,రస పుత్ర విజయం ,మ్రుచ్చ కటిక ,ముద్రా రాక్షసం ,ప్రతాప రుద్రీయం ,చిత్ర నళీయం ,మొదలైన నాటకాలు ఆడారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 6-11-13- ఉయ్యూరు

