పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3
-చివరి భాగం
పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణుడు ,పాదుకా పట్టాభిషేకం లో భరతుడు ,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హుడు,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రుచ్చ కటికం లో చారు దత్తుడు వేషాలు ధరించి అన్నిటికీ గుర్తింపు తెచ్చుకొన్నారు .రాజ సింహ పాత్రకు పోటీలలో బంగారు పతకం గెలుచుకొన్నారు .ఈ పోటీని పురాణం సూరి శాస్త్రిగారే నిర్వ హిమ్చారు . శాస్త్రి గారు పింగళి వారికి’’ రాయల్ పాట్రన్ ‘’అయ్యారు .రాజ సింహ పాత్ర వేషం లో ఖడ్గం ధరించి కనీ పిస్తే వీరావతార మూర్తిగా భాసించే వారు .ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రిగా ఆయన చూపిన అభినయం లోకోత్తరం గా ఉండేది .చందన దాసు ముఖం చూడలేని జన్మ ఎందుకు అని పరితపించే ఘట్టాన్ని అద్భుతం గా పండించేవారు. కోపం తో మళ్ళీ కత్తి చేత బూని కన్నీరు ఓడుస్తూ ‘’ఆహా !కస్టమెంత కష్టము ‘’అంటూ మూడు పేజీల డైలాగులను భావ గర్భితం గా చెప్పి ,’’కాలము కాదు ఇది కత్తికి ‘’ఆని బాధ పడుతూ తనకు దేహ నాశనమే శరణ్యం అని దీనం గా బాధ పడి మళ్ళీ కత్తితో
భయపెడుతూ నిష్క్రమించే సన్నీ వేశాలలో పింగళి వారి నటన అజరామరం అని వర్ణించ టానికి వీలుకాదని ఆ నాడు అందరు మెచ్చే వారు .
పాదుక నాటకం లో భరతుడు వేస్తూ సంభాషణలను తానె రాసుకొనే వారు కాంతం గారు .మేన మామ ఇంటి నుంచి అయోధ్యకు తిరిగి వస్తు పట్నం అంతా చిన్న బోయినట్లు కనిపించటం చూసి ఏదో కీడు జరిగిందని మనసులో శంకించే సందర్భం లో వారు రాసుకొన్న సంభాషణలు రసవత్తరం గా కరుణ రస స్పోరకం గా ఉండి చూచే వారిని చలింప జేసి గుండెలు పిండించేవి . .
పింగళి వారిలా పద్యం చదవాలని, డైలాగ్ చెప్పాలని ఆ కాలం లో ఎందరో నటులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు .’’లక్ష్మీ కాంతం గారిని అనుకరిస్తూ ,వారి వెంట తిరుగుతూ ఉండేవాన్ని ‘’అని విశ్వనాధ చెప్పుకొన్నారు .తన నాటక రంగ ప్రవేశాన్ని గూర్చి పింగళి వారు ‘’నాటక రంగం లో ప్రవేశం నాకు మొదట మా గురుపాదులైన శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి మూలం గానే కలిగింది .శాస్త్రి గారు తాము ఏ ఊళ్ళో అవధానం చేసినా ,అచట తాము రచించిన నాటకాలను కూడా తన శిష్యులతో ప్రదర్శింప జేసే వారు .శిష్యులకు కవిత్వం తో బాటు నటనలో కూడా తరిఫీదు ఇచ్చేవారు .నాటకాలలో వేషం వేసే వారిని ఆ నాడు చిన్న చూపు చూసే వారు .కాని వెంకట శాస్త్రి గారు తమ శిష్యుల చేత వేషాలు వేయిస్తున్నారంటే నాటక కళకు ,నటులకు కూడా గౌరవం ఏర్పడింది ‘’అని అన్నారు .
పురాణం సూరి శాస్త్రి గారు తమ ‘’నాట్యాంబు జం ‘’లో ‘లక్ష్మీ కాంతం ’రాజ సిమ్హుని వీర రస పుత్ర గుణాలు యధోచితం గా ప్రదర్శిం ఛి పరిషత్ వారి స్వర్ణ పతాకాన్ని గెలుపొందారు .శాంత స్వభావము గల ధీర నాయకుల వీరావేశము లెస్సగా అభినయిన్చును ధర్మ రాజు గుణాభినయం లో లక్ష్మీ కాంతాన్ని మించిన నటుడు లేడు .రాక్షసుని స్వభావం అంతా వాని ఆర్యా వర్త భూచరణ సామర్ధ్యము లక్ష్మీ కాంతము చే చక్కగా ప్రదర్శింప బడింది .కదా సందర్భాన్ని విమర్శించుకొని తనకు ఏ పాత్ర తగునో ,దానినే గైకొని పాత్ర సాదృశ్యము నొంది నేర్పు యేర్పడ అభినయించు లక్షణములు లక్ష్మీకాంతమునకే కలవు ‘’అని ప్రశంసిస్తూ రాశారు .
‘’సాహితీ వైదగ్ధ్య సహిత నాటక కళా శోభి పింగళి ధర్మ సూనుడొకడు ‘’అని కవి పాదుషా పువ్వాడ శేష గిరిరావు గారు బందరు నటులను మెచ్చుకొంటూ పింగళి వారి గురించి అన్నారు ..మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారు కృష్ణా పత్రికలో ‘’నా కవి మిత్రులు ‘’అనే వ్యాసం లో ‘’ఆ కాలం లో పింగళి వారితో చెలిమి చేసిన వారు ఏమండీ అంటూ ప్రారంభించి ఒక వారం లోనే యేమిరా అంటూ మార్పు చెందే వారు .అయన అతి గంభీరులు, సింహము వంటి వారు .అయన దగ్గరకు వెళ్ళుటకు భీతి చెందే వారు .ధైర్యము తో దగ్గరకు చేరిన వారు మరల తిరిగి అవతలకు పోవుట అనేది ఉండేది కాదు ‘’అని పింగళి వారి వ్యక్తిత్వాన్ని గొప్ప గా ఎస్టిమేట్ చేశారు .ఇదీ పింగళి వారి సౌజన్యం .
కవి అవధాని ,సాహితీ దిగ్దంతులు ,విమర్శనా సామ్రాట్ ,సాహిత్య శిల్ప వేత్త ,అభినయ సూరి ,కావ్య నిర్మాత ,సాగర సమానప్రతిభా సంపన్నులు ,ఉత్తమ దేశికులు అత్యుత్తమ శిష్యులు ,జంట కవిత్వకవి శేఖరులు ,మిత భాషి ,గంభీర స్వభావులు ,భక్తీ భావ తత్పరులు ఆచార్య వరేన్యులు,డీన్,వాజ్మయ చరిత్ర కారులు ,పాఠ్య పుస్తక రచనా సలహా
దారులు,వ్యాకరణ కర్త ,శ్రీ పింగళి లక్ష్మీ కాంతం అన్నిటా సర్వ సమర్ధులని పించుకొన్న పుంభావ సరస్వతి .
సమాప్తం
నాగుల చవితి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 7-11-13- ఉయ్యూరు

