శ్రీ నారాయణ మూర్తి శ్రీ రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ
శ్రీ నారాయణ మూర్తి గారు నాలుగు రోజుల రాత్రి క్రితం నాకు ఫోన్ చేసి తాను,రాం ప్రసాద్ గారు అక్టోబర్ ముప్ఫై ఒకటి న రిటైర్ అవుతున్నామని, తనకు నా ఆశీస్సులు కావాలని ,ఇంటికి వచ్చి చెబుతానని సన్మానం రోజు వచ్చి డిన్నర్ కూడా తీసుకొమ్మని కోరారు .సరే అన్నాను.నిన్న ఉదయమే మా ఇంటికి మూర్తి గారు వచ్చి పాదాల నంటి నమస్కరించి ,ఆశీర్వాదం తీసుకొన్నారు .మనస్పూర్తిగా ఆశీర్వదించి మన సరసభారతి ప్రచురించిన ‘’సిద్ధ యోగి పుంగవులు ,’’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’రెండు పుస్తకాలు కానుకగా అందించాను. ఎంతో ఆనందం గా తీసుకొన్న సంస్కారి .నా ఆశీర్వాదం తీసుకొన్న తర్వాతే ,చివరి రోజున కాలేజికి వెళ్దామని అనుకోని వచ్చానని చెప్పారు మేమిచ్చిన కాఫీ తాగి, కాలేజికి వెళ్ళారు
పొలిటికల్ సైన్స్ హెడ్ అయిన మూర్తి గారు అందరికి తలలో నాలుకగా వ్యవహరించి మంచి ప్రజా సంబంధాల నేరుపుతారు .గొప్ప స్నేహ శీలి .ఆత్మీయత ,ఆప్యాయత కురి పిస్తారు .నేను పదేళ్ళ క్రితం ఫ్లోరా స్కూల్ లో అడ్మిని స్త్రేటార్ గా పని చేసి నప్పుడు వారి రెండవ పాప టెన్త్ చదివింది .అప్పటి నుంచి పరిచయం .నవ్వు ముఖం చూడ గానే వ్యక్తిత్వం తెలుస్తుంది. గొప్ప సంస్కారి ,ఆప్యాయం గా అందర్నీ పలకరిస్తారు .నాలుగేళ్ళు గా మేం నిర్వహించే సరస భారతి కార్యా క్రమాలకు అన్నిటికి దాదాపు హాజరై ఎంతో సంతృప్తి ని వ్యక్తం చేసే వారు .ఒకసారి ఒక సమావేశానికి అధ్యక్ష స్తానం కూడా అలంకరించారు. మాకెంతో ప్రోత్సాహ కారి .బెజ వాడలో జరపదలచుకొన్న మూడవ ప్రపంచ తెలుగు రచయితల సంఘానికి ప్రతి నిధి గా కోరిన వెంటనే నమోదైన సాహితీ పిపాసి .శ్రీ దత్త భక్తులు కూడా. .మా ఆంజనేయ స్వామి ఆలయానికి తరచూ వస్తారు దంపతులు.వారి పెద్దమ్మాయి వివాహం దత్త గుడి లోనే చేస్తూ శుభ లేక ఇంటికి వచ్చి ఇచ్చి, వచ్చి ఆశీర్వదించమని కోరారు. అలానే నేను, మా మనవడు చరణ్ తో వెళ్లి ఆశీర్వదించి విందు భోంచేసి వచ్చాను .కాలేజి లో సరసభారతి, కృష్ణా జిల్లా రచయితల ,సంఘం కాలేజి తెలుగు శాఖ,సం యుక్తం గా విద్యార్దులకోసం చేసిన అనేక కార్య క్రమాలకు చక్కని సహకారం అందించిన వారు .ప్రిన్సిపాల్ రాయుడు గారికోరిక పై నేను అక్కడ మూడేళ్ళు గెస్ట్ లెక్చర్లు ఇస్తే వాటికి స్వయం గా హాజరై ప్రశంశించిన సహృదయులు .ఇలాంటి సీనియర్ అయిన వీరి పదవీ విరమణ తో, కాలేజి లో కొంత కొరత ఏర్పడుతుంది .యాజ మాన్యం నిన్న సభలో వీరిసేవలు సద్వినియోగం చేసుకొంటామని చెప్పటం అందరికి శుభ వార్తయె .
శ్రీ రాం ప్రసాద్ గారు ఫిజిక్స్ హెడ్ .రాం ,నారాయణులు ఇద్దరు నరనారాయణు ల వంటివారు కాలేజికి. ,ఫిజిక్స్ లో పెద్ద దిక్కు, ఫ్లోరా హైస్కూల్ మూల స్తంభాలలో ప్రసాద్ గారొకరు .మంచిఅవగాహన ఉన్న వారు .సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ .కూడా .నేను ఫ్లోలోరాలో పని చేసినప్పుడు వీరి అమ్మాయి టెన్త్ చదివింది .భక్తీ పరులు .అప్పటి నుంచే పరిచయం .ఎక్కడ కనీ పించినా ,నమస్తే అంటూ పలకరించే సంస్కారం రాం ప్రసా ద గారిది. భార్య శ్రీమతి పద్మ గారు
ఫ్లోరాలో హాస్టల్ నిర్వహణ లో సమర్ధురాలు .ప్రతి మంగళ వారం మా ఆంజనేయ స్వామి గుడికి వస్తారు. ఇక్కడ జరిగే అన్నికార్యక్రమాలలో భక్తిగా పాల్గొంటారు .అలాంటి వీరి సేవలను కూడాకాలేజి వారు కొనసాగిస్తామని సభలో చెప్పటం ఆనందం గా ఉండే విషయమే. వీరి విరమణ జీవితం సుఖ ప్రదం గా ఉండాలని కోరుకొంటున్నాను .
విరమణ వేడుకలో పదనిసలు
వేదిక మీద ఉన్న బానర్ లో’’పదవీవిరమణ’’ అని ఉండాల్సింది ‘’పదవ విరమణ‘’అన్నట్లు గా ఉంది .అలాగే చెరుకు మొక్కలు ఉయ్యూరు ప్రాంతం లో పండే పంచదార చెరకు మొక్కలు గాలేవు .బెల్లం చెరుకు గడల్లాఎర్రగా ఉన్నాయి .బహుశా ఎవరూ గమనించలేదేమో .
ఈ కాలేజి లో బాటనీ లెక్చరర్ గా ,ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ కోటేశ్వర రావు గారు నన్ను పలకరించి చాలా అఆప్యాయం గా మాట్లాడారు. బెజ వాడలో ఉంటున్నారట .వారబ్బాయి కెనడా లో ఉద్యోగిఅట .పేరు కిషోర్ అని చెప్పిన జ్ఞాపకం. అతను నిత్యం సరసభారతి బ్లాగ్ చదివి ఎంతో ఆనందించి తనకు ఫోన్ చేస్తూ ఉయ్యూరు విశేషాలు బాగా తెలియ జేస్తున్నారని మెచ్చుకోన్నాడట .ఈ మధ్య వర్షాలకు గ్రౌండ్ జల సముద్రం గా మారినది నేను ఫోటోలు తీసి పంపిన వాటిని కూడా చూశాడట .ఇది సరసభారాతికి మంచి కితాబు .
రాం ప్రసాద్ గారి సన్మానం పూర్తీ అయ్యేసరికే రాత్రి దాదాపు తొమ్మిదయింది .తర్వాత మూర్తి గారి సన్మానం.చాలా ప్రేమ ఆప్యాయతలతో వీడ్కోలు సభ నిర్వహించారు. అందరు అభినందనీయులే . డిన్నర్ కాంటీన్ లో అని అనౌన్స్ చేస్తే అక్కడికి వెళ్తే ఏమీ కనీ పించక ఉండలేక ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేశాను .
మీ- గబ్బిటదుర్గా ప్రసాద్ -1-11-13-ఉయ్యూరు

