నమ్మాల్సిన నిజాలు -1
అనేక పేర్లతో పిలువబడుతూ ,అనేక వేల సంవత్సరాలుగా జీవిస్తున్నానని చెబుతూ ,కాలా తీత సిద్ద యోగిపున్గవునిగా ఉంటూ ,తనను తానూ బ్రహ్మ స్వరూపునిగా ప్రకతిన్చుకొంటు,కబీర్ నానక్ లతో కలిసి తిరిగానని చెబుతూ నేపాల్ రాజ వంశేకులు తనకు 18తరాలుగా శిష్యులని తెలియ జేస్తూ ,కదలాడే మహేశ్వరునిగా భక్త జనం చేత భావింప బడుతు ,బృందావన్ బాబా గా ప్రసిద్దులై ,అత్యంత శీతాకాలం లో కూడా గంగా ,యమునా నదీ తీరాలలో మంచే మీద నే నగ్నం గా పద్మాసనం లో కూర్చుంటూ ,ఆర్తత్రాణ పరాయణుడిగా పూజ లందుకొంటు ,కేవలంరోజుకు వంద గ్రాముల అవుపాలను మాత్రమె ఆహారం గా స్వీకరిస్తూ ,అహింసా మూర్తిగా ,కరుణా మయుడుగా సార్ధక నాముడై ,గోసేవా సంరక్షకుడై ,త్రికాల దర్శి ,మహాజ్ఞాని ,అభయ ప్రదాత ,సర్వాంతర్యామిగా ,సాక్షాతూ భగ వంతుని సాకార రూపం గా అశేష జన సందోహం చేత కీర్తింప బడిన వారు బ్రహ్మర్షి ‘’దేవ రాహో బాబా’’.(దేవారియా బాబా )
.![]()
ఋషుల జన్మ ఏరుల జన్మ తెలియదు అన్నట్లే ఈ బాబా ఎక్కడివారో ఎప్పటి వారో తెలియదు .కాని వారి మహిమలు మాత్రం వర్ణనా తీతాలు .అందుకు కొందరుభారత రాష్ట్ర పతులు ,ప్రధాన మంత్రులు సాక్షులు .వీరిని అనుగ్రహించటం ,అవసరమైన వారికి ముందు హెచ్చరికలు చేయటంతో బాబా పై వారికి అపార నమ్మకం కలిగింది .ఇవి మనకు నమ్మలేని నిజాలు అని పించ వచ్చు .కాని ప్రత్యక్ష సాక్షులు చెప్పటం వల్ల అవి ‘’నమ్మాల్సిన నిజాలు ‘’అనినేను అనుకోని మీకు తెలియ జేస్తున్నాను .
ఒక సారి మన ప్రధమ రాష్ట్ర పతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చిన్నతనం లో వారి తాత గారు ఈ కుర్రాడిని దేవరాహో బాబా దగ్గరకు తీసుకొని వెళ్ళారు .దారిలో తాతగారిని రాజేంద్ర ఆ బాబా ఎన్నాళ్ళనుంచి తెలుసు అని అడిగితె , నీఅంత వయసున్న దగ్గర్నుంచి అని సమాధానం చెప్పారు తాత .ఆ బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని ఈ చిన్నారి మరో ప్రశ్న .ఆయన్ను చూస్తె తన మనసు ఆనంద పరవశమవుతుందని తాత జవాబు .ఈ చిన్న వాడు ఆటతలాదుతు ,బాబా ఆశ్రమంలో లో తిరిగాడు తాత కోప్పడ్డాడు. అప్పుడు దేవరాహో బాబా ‘’వీడిని కోప్పడకండి .గొప్ప సంస్కారి వీడు .వీడికి నాఆశీర్వాదం ఎప్పుడూ
ఉంటుంది ‘’అని చెప్పారు .ఈ బాలుడితో ‘’నాయనా !నువ్వు రాజువు అవుతావురా ‘’అని దీవించారు .నిజంగానే ఆయన రాష్ట్ర పతి అయ్యాడని మనకు తెలుసు .ఆ పదవిలో ఉండగా బాబాను దర్శించారుకూడా ‘’నువ్వు రాజువురా ‘’అన్నారు బాబా .దానికి సంస్కారంతో రాజెన్ బాబు ‘’బాబా !దుమ్ముకణం ఆకాశం లో ఎగురుతుంది అది దాని గొప్ప కాదు .వాయుదేవుని దయతో దానికి ఆ అదృష్టం పట్టింది .మీ ఆశీర్వాద ఫలితం గానే నేను ఇంతవాడినయ్యాను ఇది నా గొప్ప తనం కాదు ‘’అని ఏంతో వినయం గా తెలియ జేశారు .ఈ విషయాన్నిరాజేంద్ర ప్రసాద్ తన ఆత్మ కద లో ఆయన రాసుకొన్నారు కూడా .
పాలకోట రాజు శ్రీ కృష్ణ సాహ దేవ్ .ఆ రాజ్యం లో ఒకప్పుడు విపరీతం గా ఎలుగు బంట్లు అడవుల నుండి వచ్చి జనాన్ని చీకాకు పరచేవి .ఎన్ని రకాల ప్రయత్నించినా పార ద్రోల లేక పోయారు .అప్పుడు దేవరియా బాబా ను దర్శించి భారం ఆయన మీదే వేశాడు రాజు .ఆయనా చెప్పినట్లు రాజు రెండు వేల మందికి సరిపోయే పూరీ, కూరా ,హల్వా చేయించాడు .బాబా ఎవరికి అర్ధం కాని భాషలో ఏదో పెద్దగా అన్నారు .అప్పుడు వేలాది భల్లూకాలు వచ్చాయి .వాటిని ఒక వరుసలో
కూర్చో బెట్టి విస్తర్లలో చేయించిన పూరీ కూరా హల్వా వడ్డింప జేశారు అవి ఏమీ మాట్లాడకుండా ఏంతో వినయం గా అవన్నీ తిని అందర్నీ ఆశ్చర్య పరచాయి .బాబా వాటితో ‘’ఇక నుంచి మీకు మానవులేవ్వరు హాని చేయరు .మీరు కూడా మీ ఆవాసాలు వదిలి రా వద్దు ‘’అని చెప్పారు అంతే అన్నీ క్రమ శిక్షణగా అరణ్యాలలోకి వెళ్ళిపోయాయి.మళ్లీ ప్రజల మీద దాడి చేయలేదు .దీన్ని బట్టి బాబాకు ఎలుగు బంటి భాష తెలుసు అని పించిందని రాజు తన చిన్నతనం లో జరిగిన ఈ సంఘటను గుర్తు చేసుకొన్నాడు .
ఒక సారి హరిద్వార్ కుంభ మేళాలో ఒక మఠాధిపతి గారి ఏనుగు పిచ్చి పట్టి వీర విహారం చేస్తోంది .పోలీసుల వల్ల కూడా దాన్ని అదుపు చేయటం సాధ్యం కాలేదు. అప్పుడు దేవహారా బాబా దగ్గరకు వెళ్లి మొర పెట్టుకొన్నారు .ఆయన ఒక ప్రసాదం ఇచ్చి ఏనుగుతో తిని పించమని భంవార్ సింగ్ అనేఆయనతో చెప్పారు .ఏనుగు కు దూరం గా నిలబడి ‘’దేవరాహా బాబా ప్రసాదం ఇది అని బాబా చెప్పినట్లు చెప్పి తినమన్నాడు భంవార్ సింగ్ .అంతే ఏనుగు కిక్కురు మన కుండ నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చి పండుతీసుకొని తినేసింది. సింగ్ గారి చేతిలో రెండో పండు ఉంది .దాన్ని కూడా ఇమ్మని తొండం సాచింది .ఆయన ‘’ఈ పండు బాబా నాకు ప్రసాదం గా ఇచ్చారు ‘’అని చెప్పగానే అర్ధమైనట్లు ఏనుగు తొండం వెనక్కి లాక్కుని ప్రశాంతం గా వెళ్లి పోయింది .ఆ మఠాధిపతి ఏంతో సంతోషించి ఏనుగును తీసుకొని బాబా ను దర్శించాడు. బాబా తన చేతులతో ఏనుగుకు ప్రసాదం తిని పించారు .ఆ తర్వాత ఆ ఏనుగును కుంభ మేళా లో ఊరేగించారు .ఇలా సకల జీవుల భాషా బాబాకు తెలుసు అని అంతా అర్ధం చేసుకొన్నారు
సశేషం
ఆధారం –బ్రహ్మర్షి దేవరాహో బాబా –రచన- డాక్టర్ ప్రేమ చంద్ భా ర్గవ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-13- ఉయ్యూరు

