నమ్మాల్సిన నిజాలు -2
లోక్ నాయక జయ ప్రకాష్ నారాయణ గారికి కూడాఆరోగ్య విషయం లో దేవరహా బాబా ఏంతో తోడ్పడిన విషయం ఇప్పుడు తెలుసుకొందాం .ఇందిరా గాంధి ఎమర్జన్సీ విధించి ముఖ్య రాజ కీయ నాయకులను జైల్లో పెట్టించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది .ఆ సమయం లో లోక్ నాయక జయ ప్రకాష్ నారాయణ ను కూడా వృద్ధాప్యం అని లెక్క చేయకుండా జైల్లో పెట్టారు .ప్రజాగ్రహం ,స్వంత పార్టీలో వ్యతిరేకత గమనించిన ఇందిరా తన నియంతృత్వ ధోరణికి కొంత తగ్గి నాయకుల్ని జైలు నుంచి విడుదల చేయించింది .జయప్రకాష్ విడుదల అయిన తర్వాతా తీవ్ర మైన కిడ్నీ సంబంధ మైన జబ్బు చేసి బొంబాయి జేస్లోక్ హాస్పిటల్ లో చేరారు .డాక్టర్లు ఆయన్ను కాపాడటానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు .
ఆయన సన్నిహితులందరూ కలిసి ఈ సంక్షోభం నుంచి బయట పడద వేయ గల వారు ఒక్క ‘’దేవా రాహా బాబా ‘’మాత్రమె అని నిశ్చయించు కొన్నారు .సమాజ్ వాది పార్టీ నాయకుడు రామా నంద సిన్హా
లోక్ నాయకు కు అత్యంత సన్నిహితుడు . అంతేకాక బాబా పై అత్యంత భక్తీ విశ్వాసాలు కల వాడు.అతను వచ్చి బాబా ను పదేపదే జయప్రకాష్ ను కాపాడమని కాళ్ళా వేళ్ళా పడి వేడుకొన్నాడు .అప్పుడు బాబా ‘’నాయనా !ప్రమిదలో నూనె అయి పోయిన తర్వాత ఒత్తిఎలా వెలుగుతుంది ?’’అని ప్రశ్నించారు.అప్పుడు రామా నంద ‘’నూనె మళ్ళీ పోస్తే వెలుగుతుంది కదా బాబా ‘అలాగే జయప్రకాశ్ గారికి జీవితాన్నివ్వండి ‘’అని ప్రార్ధించాడు .మళ్ళీ బాబా ‘’నాయనా ఎవరు తన ఆయుర్దాయాన్నిజయ ప్రకాశ కు ఇవ్వటానికి ఒప్పుకుంటారు ?’’అని ప్రశ్నించారు .వెంటనే రామా నంద ‘’నేను ఇవ్వటానికి సిద్ధం బాబా .ఆయన్ను ఎలాగైనా బతికించండి ‘’అన్నాడు .బాబా మళ్ళీ ‘’నీఆయుర్దాయం అంతా ఇవ్వక్కర్లేదు .ఒక అయిదేళ్ళ ఆయుర్దాయాన్ని ఆయనకిస్తే చాలు .ఈ అయిదేళ్ళలో జయప్రకాష్ బతికి ఉన్నంత కాలం నీకోరికలేవీ నేర వెరవు నీకిస్ట మైతే ఆయన్ను కాపాడతాను ‘’అన్నారు .ఆనందం గా రామానంద్ అంగీకరించారు .మళ్ళీ బాబా ‘’నీ ఆయుర్దాయం తీసుకొని తానూ బతికానని జయప్రకాశ్ కు తెలిసిన మరుక్షణం ఆయనకు విరక్తి కలిగి అదే ఆఖరి క్షణం అవుతుంది. కనుక ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండి పోవాలి జయరకాష్ కు తెలియ నివ్వద్దు సుమా ‘’అని హెచ్చరించారు
‘’నేను ధర్మ దేవతను జయప్రకాశ్ కోసం ప్రార్ధిస్తాను .అప్పటి దాకా నువ్వు హరి నామ స్మరణ చేస్తూ ఉండు ‘’అని చెప్పి కుటీరం లోపలి వెళ్లి పోయారు బాబా .అక్కడ చేరిన భక్తులందరూ రామానంద్ టో కలిసిజయప్రకాష్ కోసం హరి నామ స్మరణ భక్తిగా చేశారు .కొద్ది సేపటికి బాబా బయటికి వచ్చిరామానంద్ తో ‘’నేను నారాయణ కోసం ధర్మ రాజు ఖాతాలో నీఆయుర్దాయం నుండి అయిదు సంవత్సరాలు జమ చేశాను .ఈ విషయం మాత్రం జయప్రకాశ్ కు తెలియ కూడదు ‘’అని చెప్పి ఒక విభూతి పొట్లం ఇచ్చి నారాయణ్ తలదిండు కింద పెట్టమని చెప్పారు బాబా .కొన్ని ఉసిరికాయలు కిస్ మిస్ పళ్ళు రామానంద్ కు ఇచ్చి ‘’నువ్వు నారాయణ్ ను చేరగానే ఆయనతో వీటిని తిని పించు .ఇదంతా శనివారం లోపే జరిగి పోవాలి ‘’అని ఆదేశించారు .రామా నంద ఆనందం తో అలాగే నని బయల్దేరాడు .నాలుగడుగులు వేశాడో లేదో బాబా అతన్ని పిల్చి ‘’నువ్వు జయప్రకాష్ ను ఇప్పుడు చేరలేవు .మరేవ్వరికైనా ఇచ్చి
పంపించు .ఆ వెళ్ళే మనిషికి ఈ ప్రసాదం తిని పించు .ఏ ఆటంకం లేకుండా అప్పుడు అతను రాయణ్ ను చేరగలడు ‘’అని చెప్పారు .
రామానంద్ కు బాబా మాటల్లో అంతరార్ధం తెలియ లేదు .కొన్ని గంటల్లోనే ఆయనకు జ్వరం వచ్చి కదలలేక పోయాడు .బాబా మాటలు జ్ఞాపకం చేసుకొన్న రామా నంద పాట్నా లో ఉన్న తన స్నేహితుడు నారాయణ అనే వ్యక్తిని పంపాడు .ఈ నారాయణ బాబా ను ఎప్పుడూ చూసిన వాడు కాదు .వెంటానే బయల్దేరి బొంబాయి చేరి జయ ప్రకాష్ ను కలిశాడు .అప్పటికే చిక్కి శల్య వస్త లో ఉన్న జయప్రకాష్ ను చూసి దిగులు పడ్డాడు .’’దేవా రాహా బాబా ఈ ప్రసాదం మీకు ఇమ్మన్నారు.తినండి ‘’అని చెప్పికిస్ మిస్ నోట్లో వేసి ,ఉసిరి రసాన్ని తీసి బాబా నోటిలో పోశాడు విభూతి పొట్లం దిండు కింద పెట్టాడు .నారాయణ్ దగ్గర ఈ నారాయణ సెలవు తీసుకొని పాట్నా చేరుకొన్నాడు .సాయంత్రం బజారులో ఒక దుకాణం దగ్గర ఆగితే ఆ దుకాణ దారు ‘’జయ ప్రకాష్ నారాయణ్ చని పోయారు ‘’అని ఏడుస్తూ చెప్పాడు .ఆశ్చర్యం వేసింది బాబా అబద్ధం చెప్పరుకదా అని పించింది .
ఈ వార్త తో తెల్ల వార్లు నిద్ర పట్టక నారయణ చాలా బాధ పడ్డాడు
పొద్దున్నే దిన పత్రిక చూస్తె ‘’నిన్న రాత్రి జయ ప్రకాష్ ఆరోగ్యం విషమించింది .ఆయన్ను ‘’ఇన్సెంటివ్ కేర్’’ లో చేర్చారు .అందువల్ల ఆయన చని పోయారనే వార్త లోకం లో వ్యాపించింది కాని అర్ధ రాత్రి అయిన తర్వాత ఆయన బాగా కోలుకొన్నారు .ఆహారం కూడా తీసుకొన్నారు .’’అని రాసి ఉంది .జయప్రకాష్ బాబా దయ వాళ్ళ బతికారని ఏంతో సంతోషించిన నారాయణ బాబా కు జయప్రకాష్ గారి కృతజ్ఞతలు తెలియ జేయటానికి సరయూ నది ఒడ్డున ఉన్న బాబాను చేరాడు .రాగానే బాబా ‘’జయప్రకాష్ ను కలిశావా ?కిస్ మిస్ తిని పించావా ?విభూతి దిండుకింద పెట్టావా ?’అని ప్రశ్నల వర్షం కురిపించారు .బాబా ను చూడటం నారాయణ కు ఇదే మొదటి సారి .తర్వాత బాబా దగ్గర శిష్యుడై దీక్ష తీసుకొన్నాడు
బాబా అనుగ్రహం టో జయ ప్రకాష్ నాలుగేళ్ళు జీవించారు .అయన ఆయుర్దాయాన్ని అయిదేళ్లకు పెంచారుకదా నాలుగేళ్ళకే ఎలా చని పోయారని భక్తులు బాబా ను ప్రశ్నించారు .బాబా నిర్లిప్తంగా’’ తన ఆయుర్దాయం పెరగటానికి కారణం జయప్రకాష్ కు తెలిసిన మరుక్షణం మనస్తాపానికి గురౌతాడు .అది ఆయన మృత్యువుకు కారణం అవుతుంది అని ముందే సూచించాను .ఆయనకు ఈవిషయం తెలిసింది వెంటనే శరీరం వదిలేశాడు ‘’అని జరిగింది చెప్పారు బాబా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-13-ఉయ్యూరు

