నమ్మాల్సిన నిజాలు -3
తాను అత్యంత లౌకిక వాదినని ,మత విశ్వాసాలు తన ఒంటికి పడవని ,సోషలిస్ట్ భావాల పుట్ట నని మతం గీతం జామ్తానై అని కమ్యూనిస్టులను ప్రసన్నం చేసుకోవటానికి కుహనా లౌకికవాద నినాదాన్ని పూరించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవసరం వచ్చినప్పుడు, గతిలేక పోయి నప్పుడు వీతికన్నిటికి గుడ్ బై చెప్పి మతాధికారులను ఆశ్రయించాడు .ఆయనే కాదు ఆయన తండ్రి మోతీలాల్ ,కూతురు ఇందిర, ఆమె కొడుకు రాజీవ్ కూడామొత్తం ‘’ఫామిలీ అంతా ‘’‘’ భవరాహా బాబా’’ ను అనేక సార్లు సందర్శించారు .వారి సందేహాలను నివృత్తి చేసుకొని ,శిష్య పరమాణువు లై ఆజ్ఞలను ఔదల దాల్చిబాబా మహాభినిష్క్రమణ వరకు దీన్ని కోన సాగించిన న అపూర్వ సంఘటనల గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
మోతీలాల్ నెహ్రు ‘’బవారీ బాబా’’ కు ప్రీతి పాత్రుడైన శిష్యుడు .ఆయన తన కొడుకు జవహర్ కు చిన్నతనం లోనే బాబా దగ్గర దీక్ష ఇప్పించాడు . కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రూపు దాల్చిన తర్వాత ఆ పార్టీకి ఎన్నికల గుర్తు
దేన్నీ తీసుకోవాలో తెలియక తబ్బిబ్బు పడ్డారు .ఏదీ నిర్ణయించలేక ఊగిస లాడారు ..అప్పుడు జవహర్ ఒక రోజు అనుకోకుండా ‘’భవరాహా’’ బాబా దగ్గరికి వచ్చాడు .సమస్యను బాబా కు విన్న వించి ఏదైనా’’ క్లిక్ ‘’అయ్యే చిహ్నం కాంగ్రెస్ కు సూచించమని కోరాడు .అప్పుడు బాబా ‘’పద్మ పురాణం లో విష్ణు భగవానుడు ‘’ఆవు –దూడ ‘’ను తన స్వరూపం గా భావించి ఆరాధించమని చెప్పాడు .కనుక ఈ ‘’ఆవుదూడ ‘’గుర్తునే నువ్వు కాంగ్రెస్ కు ఎన్నికల చిహ్నం గా తీసుకో .నీకు శుభం కలుగుతుంది .నువ్వు పండితుడివి కనుక ‘’ధర్మం ‘’మీద ద్రుష్టి పెట్టి ముందుకు సాగు ‘’అని ఆశీర్వ దించాడు .అప్పటి నుంచి ఆవు దూడ యే కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల గుర్తు అయింది ఇందిరా స్వంత కుంపటి పెట్టి హస్తం గుర్తు పొందే దాకా .
1977-78నెహ్రు కూతురు ఇందిర దేశమంతా ‘’ఎమర్జన్సీ ‘’విధించింది .ఆ సమయం లో ధిల్లీ లోని ‘’గో రక్షా సమితి ‘’కార్యాలయాన్ని కూడా ఆమె కొడుకు సంజయ్ దగ్గరుండి కూల్పించాడు .అరాచకం పెరిగి పోయింది .అనేక అత్యాచారాలు జరిగాయి .ఇదంతా ఆమె కొడుకు సంజయ్ నిర్వాకమే .ఆమె పై అనేక ఆరోపణలోచ్చాయి .కేసుల్లో ఇరుక్కోంది .జనతా పార్టి చేతిలో చిత్తుగా ఆమె, ఆమె కాంగ్రెస్ ఓడి
అభాసు పాలైందన్న సంగతి మనందరికీ తెలుసు .ఆమెలో నిరాశ నిస్పృహ నిండి పోయి అడుగు ముందుకు వేయలేని పరిస్తితి వచ్చింది .
అప్పుడు ఇందిర బాబా ను సందర్శించింది ‘’బాబా ! మీ రోక్కరే నన్ను ‘’అమ్మాయీ’’ అని ఆప్యాయం గా పిలిచారు .జనం అంతా నన్ను ఏవగించుకొని దూరం అయ్యారు .నాపై కృప చూపండి .’’మీ అమ్మాయి’’ ఇప్పుడు మీ చరణాలను ఆశ్రయించింది .దేశ సేవ చేయాలి అంటే అధికారం ఉండాలి ఇప్పుడది నాకు లేదు ‘’అని గోడు వెళ్ళ బోసుకోంది .బాబా ఆమెతో ‘’నువ్వు గో సేవ చేస్తే అప్పుడే దేశ సేవ చేసి నట్లు .గో గౌరవమే భారత మాత గౌరవం .గోవుకు కష్టం వస్తే భారత మాతకు కష్టం వచ్చి నట్లే .ఈ దేశం లో పేదరికం,దరిద్రం ప్రజల కస్టాలు పోవాలి అంటే గో సేవ యే మార్గం .ముందు గో సేవ తో ప్రారంభించు .అప్పుడు దేశ సేవ చేసే అదృష్టం కలిసి వస్తుంది .కుంగిపోయిన ఇందిరా ‘’ఇక నుంచి గోసేవే నా పరమావధి నన్ను ఆశీర్వదించండి బాబా ‘’అని ప్రాధేయ పడింది .’’నీకు మరో సారి దేశ సేవ చేసే అదృష్టం వస్తుంది అయినా గో సేవ మరచి పోకు సుమా ‘’అన్నారు బాబా .అప్పుడు ఇందిరా ‘’మా నాన్న కు ఎన్నికల గుర్తు గా ఆవుదూడ ‘’ను సూచించారు మీరు. ఇప్పుడు నాకు కూడా ఎన్నికల గుర్తు అవసరం ఉంది .దయతో సూచించండి ‘’అని కోరింది ‘’గో సేవ చేసే వారికి నాఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ‘’అని చేయెత్తి ఆశీర్వ దించారు .గ్రహించిన ఇందిర ‘’బాబా !మీ ‘’హస్తం ‘’చిహ్నమే నా పార్టీ కి ఎన్నికల గుర్తు గా అనుగ్రహించండి .’’అంది .బాబా ఆశీర్వ దించి పంపిస్తూ ‘’అమ్మాయీ !నా శిష్యురాలు’’ ఆనందమాయి ‘’హరిద్వార్ లో ఉంది .నువ్వు అక్కడికి వెళ్లి గంగలో పవిత్ర స్నానం చేసి ఆమెను సందర్శించు .ఎమెర్జెన్సీ లో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలకు గురి అయిన దీనుల ,దరిద్రుల ,సాధువుల ,మహాత్ముల శాపం నుంచి నీకు విముక్తి కలుగు తుంది ‘’అని చెప్పి కిస్ మిస్ పండ్లను ప్రసాదం గా ఇచ్చి ,ఒక ‘’నల్ల రంగు శాలువా’’ ఆమెకిస్తూ అది ఆమె దగ్గరున్నంత వరకు ఆమెకే కష్టం రాదు అని దీవించి పంపారు బాబా .
’’హస్తం ‘’గుర్తుతో ఇందిరా కాంగ్రెస్ పేర ఎన్నికలలో నిలబడి అపూర్వ విజయం సాధించిన ఇందిర బాబా ను దర్శించింది ‘’బాబా !మీ అమోఘ ఆశీర్వాద బలంతో మీరు ఇచ్చిన హస్తం గుర్తు తో ఎన్నికలో గెలిచాను. మీ ఆశీర్వాదం అమోఘ శక్తి కలది .మీ వంటి యోగులు సిద్ధులను కన్న భారత దేశం ధన్యమైంది ‘’అని బాబా పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని వ్యక్తం చేసింది నెహ్రు కూతురు ఇందిర .ఇప్పటికి తాత ,తండ్రి కూతురు ల బాబా భక్తీ ని గురించి తెలుసుకొన్నాం .తరువాత ఆమెకొడుకు రాజీవ్ బాబా యెడల ఎలా ప్రవర్తించాడో తెలుసుకొందాం
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -.10-11-13- ఉయ్యూరు

