విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8
అలనాటి మన విద్యా విధానం
రామాయణం లో మహర్షి వాల్మీకి హనుమంతుడు సంజీవిని తెచ్చి లక్ష్మణ మూర్చ నుంచి ,గాయ పడ్డ వానర సైన్య చికిత్సకు ఉపయోగించిన సంగతి మనకు తెలుసు .మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -గ్వాలియర్ శాస్త్ర వేత్త కే.షా బృందం సంజీవిని బయో యాక్టివ్ కాంపౌండ్ ను పొంద వచ్చునని ,దీనితో వైద్య చికిత్స లో అద్భుతాలు చేయచ్చునని తెలియ జేశారు .ఈ బృందం లో దర్భంగా సి.ఏం.కాలేజి, ,హైదరాబాద్ డి.యెన్.ఏ.ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్ కు చెందిన పరి శోధకులు కూడా ఉన్నారు .అమితమైన అల్ట్రా వయొలెట్ రేడియేషన్ మూలం గా శరీరం లోని కణాలు నిర్జీవమైనప్పుడు సంజీవిని మూలిక ఉపయోగిస్తే కణాలు తిరిగి జీవం పోసుకొంతాయని నిరూపించారు .ప్రసవ సమయం లో బలహీన పడ్డ స్త్రీలకూ ,ఋతు క్రమం సరిగా లేని వారికి ,కామెర్ల వారికి సంజీవిని చూర్ణం అద్వితీయం గా ప్రయోజనం సిద్ధింప జేస్తుందని వీరి పరిశోధన లో తేలింది .
అలాగే ఉసురు అంటే ప్రాణం ను నిలిపే కాయ ”ఉసురు కాయ” అంటే ఉసిరికాయ .చ్యవన ప్రాస ,త్రిఫల చూర్నాలలో ఇదిదీని ప్రాధాన్యత ఉంది .దీనిలో సి విటమిన్ అధికం .రెండవ ప్రపంచ యుద్ధం లో స్కర్వీ వ్యాధి నుంచి భారత సైనికులను రక్షించింది ఉసిరి పండ్ల తో చేసిన కాండీ లను తిని పించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు .అలాగే కల బంద ,వెల్లుల్లి ,తులసి ప్రక్రుతి సిద్ధ ఆరోగ్యాభి వృద్ధి కారకాలు .
క్రీ.పూ.వాడైన కశ్యప ముని కుమారుడు ఇంద్ర వనమూలికా సారం తో ”సోమ రసం ”తయారు చేయటం కనీ పెట్టాడు .ఇది ప్రాణ శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుందిఅని ఋగ్వేదం చెప్పింది .ఈ రసాన్ని తాగితే శారీరక ,మానసిక బలం పెరుగుతుందని ఇంద్ర స్వయం గా చెప్పాడు . దీని విశేషాలను వివరిస్తూ ఋగ్వేదం లో నూట ఇరవై మంత్రాలున్నాయి .కంటి చూపు ,చర్మ వ్యాధులు ,మానసిక అస్వస్తత ,గర్భస్త సంరక్షణ మొదలైన వాటికి ఎంతో ప్రయోజన కారి .”ఇంద్ర రసాయనం ”పేరా ఓక టానిక్ కూడా చేశాడు ఇంద్ర .ఇది బాల వార్ధక ఔషధం .సోమ మొక్క ను గూర్చి అనేక పరిశోధనలు జరిగాయి జరుగుతున్నాయి .
సీల్; వేయటానికి ఉప యోగించే లక్కను మొదట తయారు చేసింది కూడా భారతీయులే .లక్క ఒక సూక్ష్మ కీటకం నుండి స్రవించే ద్రవం .దీని పొడవురెండున్నర సెంటి మీటర్లు .ఉత్తర భారతం దే లాండ్ ,చైనా లో ప్రత్యెక చెట్ల మీదనే ఇది పెరుగుతుంది .మనదేశం లో దాక్ ,బేర్ ,కుసుమ్,చెట్ల మీద బాగా జీవించే కీటకం ఇది .పాండవులను నిర్మూలించటానికి దుర్యోధనుడు నిర్మింప జేసిన లక్క ఇల్లు ఉత్తర ప్రదేశ్ లో బాగ్ పట్ లో ఉంది అని కేంద్ర త్రవ్వకాల ,పరిశోధన చేసిన శాఖ వారు నిర్ధారించారు .దీన్ని మీరట్ జిల్లాలో 2004లో జరిపిన త్రవ్వకాలలో త్రవ్వి కనుగొన్నారు .ఈ నాటికీ ప్రపంచ లక్క ఉత్పత్తిలో భారత దేశం యాభై శాతం ఉత్పత్తి చేస్తోంది .ఇప్పుడు లక్క ఇన్సులేట ర్ గా .శిలల మీద రాసే సిరాగా ,అద్దకం రంగుగా ,పెయింట్లు వార్నీష్ ,లెదర్ దుస్తులలో టాబ్లెట్స్ పై పూటగా నమూనా తయారీ లో ,సౌందర్య సాధనం గా ,ఫుడ్ కలర్స్ గా చాక్లెట్స్ తయారీలో ,పేకముక్కలు ,బొమ్మలు పాలిష్ చేయ టానికి ఎన్నికలలో సీల్ వేయటానికి ఉత్త్సరాల సీఎల్ కు మరెన్నో రకాలుగా ఉపయోగ పడుతోంది. దీన్ని మొదట కనీ పెట్టింది మన వాళ్ళే అని గర్వం గా చెప్పుకో వచ్చు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-13-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,642 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


ఎన్నో తెలియని కొత్త విషయాలు అందిస్తున్న సరస భారతి వారికి ధన్యవాదములు
ayurbless team
LikeLike