విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19
ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్
సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే భారతీయులు ,చైనా వారు ,ఈజిప్షియన్లు గ్రీకులు చెప్పారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఖగోళ విజ్ఞానం అభి వృద్ధి లోకి రాక ముందే ,ఏ యూని వర్సిటి విద్య లేకుండా ,టెలిస్కోపులు కూడా లేని కాలం లో చేతి పరికరాల సాయం తో పరిశీలన చేసి గణన చేసి ఖచ్చితమైన విలువలను రాబట్టిన ‘’పటాని సామంత్ ‘’అనే ఖగోళ శాస్త్ర వేత్త ను అందరం మర్చి పోయాం .ఆయన పరిశోధనా ఫలితాలు ఈ నాటి వారిని అత్యాశ్చర్యం లో ముంచెత్తాయి ఈ మహాను భావుని పూర్తీ పేరు’’ మహా మహోపాధ్యాయ చంద్ర శేఖర సింగ్ హరి చందన మహా పాత్ర సమంత్.’’.1835డిసెంబర్ పద మూడు న ఒరిస్సా లో ‘’ఖండాపర ‘’ప్రాంతం లో జన్మించాడు .

patani samant planetarium
చిన్న నాటి నుంచే విశ్వం ఖగోళం ,రాశులు మొదలైన వాటిపై ఆసక్తి ఉండేది .వీటిపై సంస్కృత గ్రంధాలు విస్తృతం గా చదివాడు .ప్రాచీన విజ్ఞానాన్ని ఔపోసన పట్టాడు .ప్రయోగ శీలిగా పరి వర్తన చెందాడు .సామాన్య కళ్ళ తో చూడలేని ‘’దనూ రాశి ‘’ని ఆరు శతాబ్దాల కిందటే భారతీయులు కానీ పెట్టారు .మిగిలిన రాశులను ఏ శాస్త్రీయ పరిజ్ఞానం తో గుర్తించారో ఈ రోజుకీ ఎవరికీ అంటూ బట్టటం లేదు .సూర్యుడు రాప్తాశ్వ రధా రూఢుడు అని మన వాళ్ళు వేలాది ఏళ్ళ క్రితమే గుర్తించి ఆయన లో ఏడు రంగులున్నాయని చెప్పగలిగారు
ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త ‘’నేకల్స్హన్ మెర్లే ‘’కి కొన్ని వందల సంవత్స రాలకు పూర్వమే శ్రీ నాద మహా కవి ‘’కాశీ ఖండం ‘’లో కాంతి వేగాన్ని ఎలా చెప్పగలిగాడో ఎవరికీ తెలియలేదు .అప్పటికి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్నే కవి చెప్పి ఉంటాడు .అలాగే ‘’సమంత్’’గారి పరిశీలనలకు గణన లకు మూలాధార మేమిటో తెలుసుకో లేక పోతున్నారు .ఖగోళ విజ్ఞానాన్ని భూకేంద్ర సిద్ధాంతం ,సూర్య కేంద్ర సిద్ధాంతాల ద్వారా తెలుసుకొనే వీలుంది .ఖగోళం లో జరిగే అపురూప సంఘటనలనుఆధారం గా చేసుకొని గణించే అవకాశం ఉంది ఫలితాలను సమీక్షించుకో వచ్చు కూడా .సంప్రదాయ పండితుడైన సమంత్ 1874 లో జరుగ బోయే ‘’శుక్ర గ్రహ సంక్రమణం ‘’అంటే శుక్ర గ్రహ ప్రయాణ మార్గం (ట్రాన్సిట్ ఆఫ్ వీనస్ )గురించి చాలాకాలం ముందే ప్రకటించాడు .
సమంత్ పరి శీలనకు జ్ఞానానికి కోపర్నికస్ తెచ్చిన ఖగోళ విప్లవం గురించి పరిచయం తెలియనే తెలియదు .అయినా 1874డిసెంబర్ తొమ్మిది నసంభ వించిన శుక్ర గ్రహ సంక్రమణం ఆయన చెప్పిన తేదీననే ఖచ్చితం గా జరిగింది .ఇది మన భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుత పరిశోధనా మిగిలి పోయింది సువర్నాధ్యాయమై వెలిగి పోతోంది .ఈ సంఘటన వ్యవధి సమయం ఆధారం గా భూమి –సూర్యుడి మధ్య దూరాన్ని గణన చేయటం ఏంతో ఆసక్తికర విషయం .ఆ నాటి బ్రిటిష్ పాలకులు కూడా ఈ పరిశోధనా ఫలితాన్ని ఆశ్చర్యం తో గమనించారు .ప్రభుత్వ ఆధ్వర్యం లో ‘’అబ్సర్వేటరి సెంటర్లు ‘’ప్రారంభ మైనాయి అంటే ఇది సమంత్ కృషి ఫలితమే అని గుర్తించుకోవాలి పటాని సమంత గణించి ,నిర్ధారించిన ఖగోళ సంఘటన మళ్ళీ 2004జూన్ఎనిమిది న జరిగింది .ఈ రెండు సంఘటన పరిశీలనలు లెక్కలు పాశ్చాత్య శాస్త్ర వేత్తల కృషి కి ఏ మాత్రం తీసి పోవేమీ కాదు .ఇలా తనకున్న స్వంత చిన్న పరికరాలతో అమూల్య ఫలితాలను తెలియ జేశాడు .తన కృషిని అంతటిని ‘’సిద్ధాంత దర్పణ’’సంస్కృతంలో పొందు పరచాడు .ఇది ఒరియా లిపి లో తాళ పత్రాల మీద రాయగా కలకత్తా యూని వర్సిటీ వారు 1899 లో ప్రచురించారు .ఇందులో మొత్తం 2,500శ్లోకాలున్నాయి .
ఈ సిద్దాన్తగ్రంధం లో అనేక అద్భత అంశాలున్నాయి .సూర్య ,శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32అని లెక్క చెప్పాడు ఇది 31నిమిషాల ,31సెకనులు గా లెక్కించి చెప్పటం మరింత గొప్ప విషయం .ఈ పుస్తకం లో కొన్ని ముఖ్య భాగాలను అరుణ కుమార్ ఉపాధ్యాయ ఇంగ్లీష్ లోకి అనువదించారు .శుక్ర గ్రహణ సంక్రమణం సమంత్ ఇంట ఖచ్చితం గా ఎలా చెప్పా గలిగాడో ఎవరికీ అంటూ బట్టటం లేదు .పటాని సమంత్ 1904లో మరణించాడు భారతీయ పురాణాలలో ,సంస్కృత గ్రంధాలలో మంత్రాలు శ్లోకాలరూపాలలో అనేక శాస్త్రీయ విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి
.ధ్రువుడి తపస్సుకు మెచ్చి విష్ణువు మెచ్చి ధ్రువ నక్షత్రం ఏర్పరచి ‘’నువ్వు ఆకాశం లో అత్యున్నత స్తానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 2,600 ఏళ్ళ కోసారి ప్రదక్షిణాలు చేస్తారు ‘’అని భాగవతం లో ఉంది . ఈ విషయాన్ని క్రీ.పూ..’’హిపార్చస్ ‘’అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు దీనిని ఎన్నో వేల ఏళ్ళ క్రితమే మన భాగవత కర్త వ్యాసుడు చెప్పటం అత్యాశ్చర్యం కరం .మన సమంత డాక్టరేట్లు సైన్సు పట్టాలు లేకుండా నే ఖగోళ అద్భుత రహస్యాలను కను గోన్నాడు కేంద్ర ప్రభుత్వం 11-6-2001న సమంత్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి గౌరవించింది .’’హాట్స్ ఆఫ్ టు సమంత్’’.
3000 ఏళ్ళ క్రితమే దక్షిణ భారత దేశానికిజల మార్గం – 2006 ఫిబ్రవరి పన్నెండున పంజాబ్ లోని చండీ ఘడ్ నుంచి వెలువడిన ఒక వార్తా ప్రకారం ఆసియాకు ,దక్షిణ భారత దేశానికి సముద్ర వర్తకం మూడు వేల ఏళ్ళ క్రితమే జరిగిందని తెలుస్తోంది .ఈ విషయాన్ని భారతీయ పురా తత్వ అరుణ్ మాలిక్ చెప్పాడు. బయట పడ్డ ఎముకలు కపాలాలు పరిశీలించి చెప్పిన విషయం ఇది .తమిళ్ నాడు లో తూట్టికోరియాన్ ప్రాంతం లో త్రవ్వకాలలో లభించిన నూట అరవై కళాశాలలో ఈ విషయం ధృవీకరణ జరిగిందని మాలిక్ చెప్పాడు .వీటిని బట్టి మూడు వేల సంవత్స రాలకు పూర్వమే దక్షిణ భారతం ఆసియా ల మధ్య సముద్ర వర్తకం జరిగినదని ప్రజల రాక పోకలు జరిగాయని తెలుస్తోందని .మాలిక్ ఉవాచ .ఇంత ప్రాచీన విజ్ఞానం మనది అని తెలియ జేయటమే నా ఉద్దేశ్యం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-13-ఉయ్యూరు

