తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -4(చివరి భాగం)
1తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3
తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2
తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం —
శ్రీ కృష్ణుని బాల్యం అంతా వ్రజ భామల మధ్య గోపాలుర మధ్య గడిచింది .వీరికి చదువు లేదు .ఆయనపై అమిత అనురక్తి ,ఆరాధనా మాత్రమె ఉన్నాయి .వారి నిష్కామ ప్రేమ కు తగిన ప్రతి ఫలం ఇవ్వాలను కొన్నాడు .’’తన దివ్య విభూతి ని నిరతిశయం గా ప్రేమించి భజిస్తే మోక్షం వస్తుందని ‘’హామీ ఇచ్చాడు వారికి .వారితో రాసక్రీడలు జరిపాడు అదొక దివ్య విభూతి .దీనిని కొందరు అపార్ధం చేసుకొన్నారు .ఆనీబిసేంట్ దీనిపై ఒక పుస్తకమే రాసింది అందులో ఆమె ‘’till 19 th century rasaleela provoked only devotion and not ribaldry ‘’అని ఘంటా పధం గా చెప్పింది .
‘’ ఏ జాతి ,ఏ కులం వాడైనా ఏ రూపం లో ధ్యానించినా మోక్షం కలుగుతుంది ‘’అని చెప్పాడు .గీతలో పరమాత్మ .అంటే భక్తిలో ‘’సోషలిజం ‘’తెచ్చాడు .’’రిలీజియన్ ఆఫ్ డివోషన్ ‘’అంటే భక్తిలో ఉదాత్తత ను శ్రీ కృష్ణుడు చెప్పిన భక్తీ మార్గం లోనే సాధ్యమవుతుంది .’’ధర్మం విషయం లో న్యాయం గా ,ఉచితం గా ఉండాలని సంసారాలను వదిలి అరణ్యాలకు
వెళ్ళటం సన్యాసం కాదని ,కామ్య కర్మ ల సన్యాసమే నిజమైన సన్యాసమని’’బోధించి భక్తిలో విప్లవం తెచ్చాడు గీతా చార్యుడు . కర్మ ను వదిలిన్చుకోవటము త్యాగం కాదని ,కర్మ ఫలాసక్తి లేక పోవటమే త్యాగమని గట్టిగా చెప్పాడు .ఇది ఆనాడే కాదు ఈ నాడు అందరికి ఆదర్శ మైంది .ఇప్పుడు కొన్ని ప్రధాన ఘట్టాలలోకి తొంగి చూద్దాం
అభి మన్యుడు ఉత్తర పాణి గ్రహణం చేశాడు అది ఎలా ఉందంటే ‘’మత్తేభం చిగురాకు పై ఉన్న ఆసక్తితో వ్రుక్షాగ్రం నుంచి సుకుమారంగా ,తొండం తో గ్రహించి నట్లుంది ‘’మార్దవం కోమలం రక్తిమ కిసలయాల ప్రధాన ధర్మం .అలాంటి హస్తాన్ని అంటే సమగ్ర సౌందర్యాన్ని అభి మన్యకుమారుడు గంభీరం గా ,అనురాగం తో ,నాగరకత తో గ్రహించాడు ఇది లోకోత్తర భావం .ఈ నాటి వదూవరులకు చక్కని సుకుమార భావాన్ని తిక్కన కవి అందించాడు .
రారాజు కొలువు లో ఉన్న భీష్మ ద్రోణుల పరిస్తితి దారుణం గా ఉంది .ధర్మాన్ని ప్రతిఘటటించ టానికి మనసొప్పటం లేదు .కాదు అని అధర్మ పరుల ఆగడాలను ప్రతిఘటించే నైతిక ధైర్యమూ చాలని ధర్మా ధర్మాల మధ్య సంకట స్తితిలో ,సందిగ్ధం లో నలిగి పోయారు
.అంటే అవసరమైనప్పుదు చేతులు ముడుచుకొని కూర్చుని జరిగే అనర్ధానికి కారకులయ్యారు .అలాగే కొడుకు పై వ్యామోహం ,సంపద పై ఆశ ,రాజ్యాధికారం ,పాండవుల పట్ల భయం గుడ్డి రాజుని కిం కర్తవ్యతా మూఢుడిని చేసింది .ఒక రకం గా భారతం లో ప్రతి పాత్రా సంకట స్తితి నేడుర్కొన్నదే .
రాయ బారాల విషయానికి వద్దాం .ఇందులో మానవ విలువలు ప్రతి బిమ్బించాయి వ్యక్తిత్వాలు ప్రకాశించాయి .ముందుగా ద్రుపద పురోహితుడిని పాండవులు కౌరవుల దగ్గరకు రాయ బారం పంపారు .అతడు బ్రాహ్మణుడు కనుక సహజం గా పరుషం గానే చెప్పాడు దానితో అక్కడి వారి మనసుకు గాయాలయ్యాయి .ఇది గ్రహించాడు పితామహుడు .’’ఏ మయ్యా !ఇలా పరుషం గా మాట్లాడితే కార్యం సానుకూల మవుతుందా ?’’అని మెత్తగానే చివాట్లు పెట్టాడు .కాని విప్రుడు కనుక అధర్మాన్ని ఖండించే ధైర్యం ,నిజాన్ని నిర్భయం గా చెప్పే స్వాతంత్ర్యం ఉన్న వాడని పించాడు .రాజ పురోహితుడు కనుక అధికారం తో కూడిన తీక్ష్ణత ఆయన మాటల్లో ఉన్నాయి ‘’దుర్యోధన సర్పాన్ని రెచ్చగొట్టిన వాడయ్యాడు ‘’అంటాడు తిక్కన
రెండవది సంజయ రాయ బారం –ఇతను రెండు పక్షాల వారికీ కావలసిన వాడే .యుక్తాయుక్తాలు ,నేర్పు ఉన్న వాడు .’’గాస్ కొట్టగలడు తీసేయ్య గలడు. రాగానే ధర్మ రాజును పొగిడాడు .’’అస్తోక పుణ్య ధనుడు –మీ తండ్రి ధరణి నాధుడుఅని గ్రేడింగ్ లో చెప్పాడు .మన మెత్తని పులి ధర్మజుడు తక్కువ తిన లేదు ‘’ఆ రాజు మా దేశంగల కారుణ్యము కతమునను సుఖముగా నిట్లున్నాము ‘’అని ‘’కాకువు ‘’తో సమాధానం చెప్పి ,,కౌరవ క్షేమాన్ని అడిగి ,తన తమ్ముల వీర విక్రమ పరాక్రమాలను ఏకరువు పెట్టాడు .సంజయుడు ధర్మ రాజు ఆంతర్యం గ్రాహించాడు .’’కారుణ్యం చూపు ‘అని చాలా చెప్పాడు ‘’చంద్ర వంశం వాడివి మనసు చల్లగాఅమృతం గా ఉండాలి .’’అని ‘’నిపుణ హృదయ ‘’అని ములగ చెట్టు ఎక్కించాడు .యుద్ధం లో జయాపజయాలు దైవాధీనం అన్నాడు .చివరికి కాళ్ళ బేరానికి వచ్చి అందరికి వంగి వంగి దణ్ణాలు పెట్టాడు .క్రోధ శాంతి చేయ మని విన్న వించాడు .పెద్ద రాజు ఇతన్ని పంపేటప్పుడే ‘’శాంతి ప్రకారం కార్యం నడుపు .ఒక్కటిగా ఉండటానికి ఏర్పాటు చేసిరా ‘’అని ఆదేశించాడు దీన్ని ఓర్పుగా నేర్పుగా ప్రయోగించాడు రాయ బారి.
ధర్మ రాజుకు ఎక్కడో కాలింది .’’ఏమయ్యా !ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో వాళ్ళే జయిస్తారని బీరాలూ పలికావు .చివరికి సంధి అంటున్నావు .ఇంత పక్ష పాతం నీ కెందుకు ?’’అని నిలదీశాడు .సంజయుని మాటలు ‘’దుర్నయం బెట్టిదం బెండు ‘’లాగా ఉన్నాయన్నాడు .కానీ అతని వినయం ,నేర్పు ఎవరి దగ్గరా ఉండవు అని కితాబు ఇచ్చాడు కూడా .అయిదు ఊళ్లు ఇవ్వటానికి కొడుకు ఒప్పుకోడు .వాడి మూర్ఖత్వం చెల్లాలి .ధర్మ రాజు శాంతించాలి అదీ గుడ్డి రాజు తపన .అందుకే సంజయ రాయ బారం .
సంజయుడు ద్రుత రాస్త్రుడితో నిష్కర్ష గానే ‘’వాళ్ళ సైరణ వెరపు గా భావించటం తప్పు .సాదు రేగితే ప్రళయమే ‘’అని హెచ్చరించాడు .సంజయుడు హితుడు ,వాక్చతురుడే కాని అక్కడి ఆస్తానం లో’’ సోషల్ స్టేటస్’’ లేని వాడు .కనుక అతని ఉపదేశం ఫలించదు అని గ్రహించిన కృష్ణుడే తానె రాయ బారిగా వెళ్ళాడు .
ముందుగా పాండవుల అభి ప్రాయాలన్నీ విన్నాడు అంతా శాంతి మంత్రమే జపించారు .ద్రౌపది మాత్రం వీళ్ళ సంధి యత్నాల్ని నిర్దాక్షిణ్యం
గా నిరసించింది .తన పరాభవాల్లి వెళ్ళ గక్కింది .ఆమె క్షోభ భూ దేవి క్షోభే అయింది . భూభారం తగ్గాలని ఆరాట పడింది .దుర్జనులతో పోత్తేమిటి ?అని నిల దీసింది .సంధి ప్రయత్నాలు మానక పొతే పాండవులంతా బుద్ధి హీనులు ,క్రుపాణులు ,క్షత్రియ తేజం లేని వారు అని పురజనులు అనుకొంటారని ఈసడిం చింది . నిస్తేజం గా ఉండటం కంటే రాజుకు వీర మరణమే మంచిది అని గుర్తు చేసింది .హస్తిన లో కుంతీ కూడా ఆత్మ గౌరవం గల స్త్రీ గా ,కోడలి అవమానాన్ని దిగ మింగిన అత్తగా క్షోభించింది .తగిన ప్రతిక్రియ జరగక పొతే పీడన చల్లారదు అని తెగేసి చెప్పింది .భార్యకు జరిగిన పరాభవానికి ప్రతీకారమే తగిన కర్తవ్యమ్ అని కొడుకులకు చెప్పి పంపింది .దీనితో’’ ధర్మజ మహా సముద్రానికి చెలియలి కట్ట లేదు ‘’అని అందరు గ్రహించారు .ఇలా భిన్న వ్యక్తుల మనోభావాలు ప్రతి బిమ్బిం చాయి రాయ బారాలలో .
భీష్ముడు శర తల్పం మీద ఉన్నాడు .కర్ణుడు ఆయన్ను సందర్శించి భక్తీ ,వినయాలు ప్రదర్శించి ప్రణామం చేశాడు .’’అలుక దక్కి నన్ను అధిక వాత్సల్య శీలతము గాజూచి తగిన మాట లాడవే మహాత్మా !’’అని
రుద్ధ కం ఠం తో ప్రార్ధించాడు .పశ్చాత్తాపం తో పరితపించాడు .పితామహుడు కూడా ‘’ నీదెస గోపింతూనే !అది శిక్ష కాని దోషంబు కాదు –నీవు పాండుతనయుం డగుట జేసి, నీ యెడల వాత్సల్యంబు కాని ,మత్సరంబు లేదు ‘’అని అనునయించాడు .కౌరవులకు జయం కలగదని పాండవులను చేరమని ఉచిత సలహా పారేశాడు ..’’దైవా ధీనము సర్వ మున్ మన మతిం దప్పింప గావచ్చునే ?’’అని మర్యాద గా చెప్పాడు .తన ధర్మాన్ని నేర వేర్చటానికి అనుమతి నివ్వమని కోరి అనుజ్న తీసుకొని కదిలి వెళ్ళాడు కర్ణుడు .భీష్ముడి దయనీయ స్తితి ని చూసి ‘’భారత వీరాగ్రణీ!నీ సచ్చరితము ఫలమే ఇట్లిచ్చట యునికి –దాత నేమనగనేర్తున్ ‘’ అంటూ ‘’బాణాల పరుపు’’ మీద పడి ఉన్న భీష్ముని పరిస్తితిని చూసి కలత చెందాడు .కన్నీరు కార్చాడు .భీష్ముడు చని పొతే తప్ప అస్త్రం పట్టనని భీష్మించిన కర్నుడిలో ఇంత మార్పు వచ్చింది .మానవీయ విలువలను వర్షించిన ఘట్టం ఇది .మానసిక స్వభావ ఆవిష్కరణ గొప్పగా జరిగిన సందర్భం ఇది
కౌరవ స్త్రీఅలు అందరు కలిసి చని పోయిన వారి అపర కర్మలకు బయల్దేరి వెళ్ళే టప్పుడు శోకం ఘనీభ వించింది మంచు లా కురిసింది . .ద్రుత రాస్త్రుడి హృదయ వేదన, శోకం వర్ణనా తీతం .గాంధారి పుత్ర శోకం లో మునిగి పోయింది .తానూ ఏడుస్తూనే మిగిలిన స్త్రీలను ఓదారుస్తోంది ఇంతలో ద్రౌపది కనీ పించింది .ఆమె కూ పుత్రశోకమే కదా. కాని ఆమెను పొదివి పట్టుకొని ఓదార్చింది .’’నీనా తెరగ కోక్కటియ ‘’ అని నిట్టూర్చింది .భీముడు ఎదురైతే ‘’గుడ్డి వారికి ఊతకర్ర అవసరం .అలాంటి డి ణా కొడుకుల్లో ఒక్కడినైనా మిగిల్చి ఊతకోలగా ఉంచక అందర్నీ చంపెశావా “??అని హృదయ విదారకం గా దుఖించింది .కడుపు కోత అంత బాధిస్తుంది .
భారతం చివరి పర్వాలలో కరుణ కురిసింది .విషాద అంతం అయింది .విధి ప్రాబల్యం అర్ధమైంది .స్వార్ధ త్యాగం ప్రధానమైంది .స్త్రీ పర్వం లో శోకం ఉద్వేగం –శాంతి ఆనుశాసనికాలలో నిర్వేదం ,మౌసలం లో కరుణ ప్రధానం అయినా ధ్యేయం అయిన శాంతరసం మూడింటా అంతర్వాహిని గా ప్రవహించింది .ఇతి వృత్తాన్ని తనలో లయం చేసుకొని ఒక గొప్ప పర మార్ధాన్ని బోధించింది మహా భారతం .’’అని నా ప్రసంగాన్ని ముగించాను .దాదాపు నాన్ స్టాప్ గా గంటా పది నిమిషాలు ప్రసంగించాను .
అందరు మెచ్చుకొన్నారు .ఉచిత రీతిలో సన్మా నించి ,శాలువా కప్పి ‘’రెండు కవర్లు ‘’నా చేతిలో పెట్టారు అధ్యక్షులు ,.మిగిలిన నిర్వాహకులు .వినయం గా అందరికి నమస్కరించాను .సభ బయట నన్ను శ్రీ రస రాజు గారికి పరిచయం చేశారు మూర్తి గారు. ఆయన్ను కృష్ణా జిల్లా రచయితల సంఘ సమా వేశాలలో రెండు మూడు సార్లు చూశాను తణుకు నివాసి .మా టి వి .సత్యనారాయణకు మంచి మిత్రుడు .నేను చాలా బాగా మాట్లాడానని రస రాజు గారు మెచ్చుకున్నారు .మా దూరపు బంధువు శశి కాంత్ కూడా వచ్చి చివరిదాకా ఉన్నాడు. రస రాజు గారితో కలిసి ఫోటోలు దిగాం అందరం .మూర్తి గారి అబ్బాయి హర్ష ,స్పందన కూడా వచ్చి అయన తో ఫోటోలు దిగారు .రస రాజు గారి అడ్రస్ తీసుకొని సరస భారతి పుస్తకాలు వారికి పంపిస్తానని చెప్పాను ఆయన కూడా తమ పుస్తకాలు పంపుతామన్నారు .
మూర్తి గారు స్కూటర్ మీద తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు .అక్కడ వెంటనే భోజనం చేశాను .చేమ దుంపలు మెత్తగా వేయించిముక్కా ముక్కా అంటూ కోకుండా వేయించారు . మహా రుచి కరం గా ఉంది .టమేటా చట్నీ ,పులుసు తో కమ్మని భోజనం పెట్టారు . ఆ రాత్రి అక్కడే ఉండమని మూర్తిగారు ,భార్య ,కొడుకు కోడలూ బతిమిలాడారు ఉండలేనని చెప్పాను .మూర్తి దంపతులు నాకు శాలువ కప్పి సత్క రించారు ఇంట్లో .స్పందన తాంబూలాల సమయం లోను వారింట్లో నాకు ,మా బావ మరిది ఆనంద్ కూ శాలువా కప్పారు ..అంతసహృదయులు మూర్తిగారు .నన్ను స్కూటర్ మీద వై జంక్షన్ లో ‘’ఇంద్ర బస్ ‘’ఎక్కించారు వచ్చేటప్పుడు బెజ వాడ నుండి ఎక్స్ప్రెస్ బస్ చార్జి నూట అయిదు (కాట్ కార్డ్ )అయితే,ఇప్పుడు ఈ’’ శీతల యంత్రం’’ చార్జి నూట తొంభై ఒక్కటి విజయ వాడకు .రాత్రి పదకుండు నలభై అయిదుకు బెంజ్ సర్కిలో దింపాడు. వెంటనే’’ ఇసుక లారీ ‘’దొరికితే ఎక్కి రాత్రి ఒంటి గంటకు ఉయ్యూరు చేరి ఇంటికొచ్చి హాయిగా పడుకొన్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-13-ఉయ్యూరు
.
