కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2
కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక
కార్తీకం లో మా పంచా రామ సందర్శనం
మా ‘’పంచ రామములు ‘’బస్సు అమరావతిలో దాదాపు నాలుగు గంటలు ఆలస్యం గా ఉదయం తొమ్మిదింటికి బయల్దేరింది .బెజవాడ బెంజ్ సర్కిల్ కు పదిన్నరకు చేరి అక్కడి నుండి కంకిపాడు వచ్చి అక్కడ పావుగంట ‘’రీసెస్ ‘’కోసం ఆగి ,మానికొండ గుడివాడ ,కైకలూరు ,ఆకివీడు ,అర్తమూరు ,ఉండి మీదుగా భీమవరం కు మధ్యాహ్నం రెండుగంటలకు సుమారు అయిదు గంటలు ప్రయాణించి చేరింది .డ్రైవర్లు అరగంటలో దర్శనం చేసుకొని రావాలని చెప్పారు .బస్ ఆగిన చోటు నుండి గుడికివెళ్ళటానికే పావు గంట పట్టింది .దారిలో వినాయక స్వామి గుడి షిర్డీ సాయి బాబా గుడి అయ్యప్ప గుడులు చూసి శ్రీ భీ మేశ్వరాలయం చేరాం .విపరీత మైన రద్దీ గా ఉంది .యాభై రూపాయల టికెట్ కొని ముగ్గురం లైన్ లో నిలబడి ఉన్నాం . దాదాపు గంట ‘’నరుకుల వేట్లాట ‘’తర్వాత ఇరుకు క్యూలో కాళ్ళు నెప్పి పుట్టేలా నిలబడి ,భీమేశ్వర స్వామిని దర్శించాం .అమ్మ వారు పార్వతి దేవిని సందర్శించాం .అసలు ఇక్కడ చూడాల్సింది గును పూడిలో ఉన్న సోమేశ్వరాలయం అందుకే దీనికి సోమా రామం అని పేరొచ్చింది .కానిమా బస్ వాడు దీని నే చూపించాడు .ఇది వరకే మేం సోమారామం చూశాం కనుక నిరాశ పడలేదు .
చాళుక్య భీముడు అనే రాజు పేర భీమ వరం ఏర్పడింది .భీమ వరం దగ్గర ఉండిరాజులువీర శైవులు .వీరికాలం లో నూజి వీడు జల్లి సీమలలో భీమ వరం శోభాయమానం గా విలసిల్లింది . 1434 లోదేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు .ఒక సారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమ రామం లో శివుని అమృత లింగ శకలం పడి ఉందని ,అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అన్న పూర్ణా సమెత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు .అలాగే మాటలు వచ్చాయి రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు




సోమేశ్వర ఆలయం ముందున్న చంద్ర పుష్కరిణి లో స్నానం చేయాలి దానికి ఎదురుగా పది హీను అడుగుల నందీశ్వర దర్శనం చేయాలి .నందిని దాటి ఏడు అంతస్తుల ముఖ మండపం దాటిలోపలి వెడితే
,దక్షిణం లో సూర్య నారాయణుడు ఉత్తరం లో సుబ్రహ్మణ్య స్వామి ,ఈశాన్యం లో నవ గ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖం లో గణపతి ,ఉత్తరాన కుమార స్వామి ,సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖం గా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మ వారు కోటి కాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు .గర్భాలయం లో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తునకన్పిస్తాడు .దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్న పూర్ణ అమ్మ వారు దర్శన మిస్తారు .దక్షిణాన కళ్యాణ మండపం ఉంది .
క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమం లో తూర్పు ముఖం గా ఉంటాడు అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకో వచ్చు .శ్రీ నాద కవి సార్వ భౌముడు భీమపురాణం లో లో అగస్త్య మహర్షి సోమా రామాన్ని సందర్శించి నట్లు రాశాడు .
రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు శాప విమోచనం తెలప మంటే చంద్ర
పుష్కరిణి లో స్నానం చేసి అక్కడి శివుడిని అషె కిస్తే .విమోచనం జరుగుతుందని చెప్పాడు అలాగే చేశాడు.అందుకే అది చంద్ర పుష్కరిణి అని పేరొచ్చింది స్వామిని కి సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది .
మళ్ళీ బస్ దగ్గరకు చేరేసరికి మూడున్నర అయింది .అందరు వచ్చేసరికి అయిదు దాటింది .అప్పుడు బయల్దేరి ‘’మావూళ్ళమ్మ’’అమ్మ వారిని దర్శించాం .మేము తెచ్చుకొన్న పూరీ లను కూర తో పాటు కడుపు నిండా లాగించాం .కమలాలు కొని తిన్నాం .ఇక్కడ రోడ్లు ఇరుకు .న్యాయం గా గుడి దగ్గరే బస్ పెట్ట వచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులెన్నో .మా డ్రైవర్ అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ ను అడిగితె ‘’ఇక్కడ కొటీశ్వరులున్నారు కాని ప్రజల్ని గురించి పట్టించుకొనే వాడు ఒక్కడూ లేడు మా బాధ యేమని చెప్పం ?/’’అన్నాడు .అక్కడి నుండి బయల్దేరి రాత్రి ఏడున్నరకు పాల కోల్లు చేరాం .ఇక్కడ క్షీరామమం ఉంది .దాని వివరాలు తరువాత తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-13-ఉయ్యూరు

