విదేశాల్లో హారర్ సాహిత్యం
1764లో హోరేస్ వాల్ పోల్ రాసిన’’ ది కాజిల్ ఆఫ్ ఆర్ త్రాంటో’’మొదటి గోతిక్ నవల గా వచ్చింది .1787లో ‘’విలియం బ్లాక్ ఫోర్డ్ ‘’రాసిన ‘’ వాతెక్’’విడుదల అయింది . ‘’ది మిస్టరీస్ ఆఫ్ ఉడాల్ ఫో ‘’హారర్ నవలను ‘’అన్నే రాడ్ క్లిఫ్ ‘’1794లో రాసి ప్రచురించాడు .1796 లో’’ ది మాంక్ ‘’ పేరిట ఏం. జి .లీవీస్ రాశాడు .తర్వాత సి.బి . బ్రౌన్ రాసిన ‘’వీ లాండ్ ‘’విడుదలైంది .1818లో ప్రఖ్యాత కవి షెల్లీ భార్య ‘’మేరీ షెల్లీ ‘’’’ఫ్రాన్కేం స్టీన్ ‘’నవల వచ్చింది .
‘’మొదటి ఇంగ్లీష్ వాం పైరీ కద ‘’గా పేరు పొందిన జే.పోల్దారిస్ రాసిన ‘’ది వాం పైరీ ‘’1819లో వచ్చింది .ప్రఖ్యాత కవి కధకుడు నవలా రచయిత విమర్శకుడు డిటెక్టివ్ నవలా రచయిత ,అయిన ‘’ఎడ్గార్ అల్లెన్ పో’’ 1840 లో రాసిన ‘’టేల్స్ ఆఫ్ గ్రోటోస్కి అండ్ అరెబిస్కి ‘’ హారర్ నవల విడుదలై సంచలం సృష్టించింది. ఫిమేల్ వామ్పైర్ ‘’గా పేరొందిన జే.ఎస్.లఫాన్ 1872లో రాసిన ‘’కార్ మిల్లా ‘’మంచి పేరు పొందింది .ఆ తర్వాత ‘’డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ ‘’అనే అద్భుత నవలను ‘’రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ‘’1880 లో రాసి ఒక చరిత్ర నే సృష్టించాడు .మనిషి లోని ద్వంద్వ ప్రవృత్తికి ఈ నవల అద్దంపట్టింది .మనిషి లోని ‘’అపరిచితుడు ‘’బయటి కొచ్చి భీభత్సం సృష్టించాడు .ఇందులో ‘’స్ప్లిట్ పర్సనాలిటి’’అని మనం ఈ రోజున పిలిచే ఆ ప్రవృత్తిని ఆ నాడే స్టీవెన్సన్ సృష్టించాడు .దీన్ని సినిమా గా కూడా తీసి ప్రచారం చేశారు .

‘’బ్రాం స్తోకర్స్ ‘’1897రాసి ప్రచురించిన ‘’ది డ్రాక్యులా ‘’అంతకు ముందెప్పుడూ రాని హారర్ నవలగా ప్రసిద్ధ మైంది. ఇదీ సినిమా1821లో అయింది. సీరియల్ గా అనేక డ్రాక్యులాలు వచ్చాయి కూడా ..చదివితేనే ఒళ్ళు గగుర్పోడిస్తే సినిమా చూస్తె గుండె ఆగి పోయినంత పనే అవుతుంది. భీభత్స భయానక నవల గా చిత్రం గా డ్రాక్యులా పేరొందింది . ఆ తర్వాత’’ రాబర్ట్ బ్లాచ్’’ రాసిన ‘’సైకో ‘’నవల 1959 లో వచ్చి పిచ్చ క్రేజ్ ను పెంచింది .వెంట్రుకలను నిక్క బోడుచుకోనేట్లు చేసింది .భయ పడి పారి పోయేట్లు చేసింది .అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ‘’ది ఎక్సార్సిస్ట్’’హారర్ నవలను ‘’విలియం పీటర్ బ్లాట్టీ ‘’రాసి సంచలనానలకే సంచలనం సృష్టించాడు .1974లో స్టీఫెన్ కింగ్ రచించిన ‘’కారీ ‘’విడుదలై హారర్ ను ఆగకుండా కారీ చేసింది .







‘’అన్నే రైస్’’ రాసిన ‘’ఇంటర్ వ్యూ విత్ వామ్పైరి ‘’తరువాత వచ్చిన నవల .1978 లో ‘’స్టీఫెన్ కింగ్ ‘’’’ది షై నింగ్ నవల రాసి హారర్ సాహిత్యానికి షైనింగ్ పెట్టాడు .1987లో ‘’ది.సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ ‘’హారర్ నవలను ‘’థామస్ హీరీస్ ‘’రాశాడు .ఆయనే మళ్ళీ 1999లో ‘’హాని బాల్ ‘’నవల రాసి మరోతీవ్ర సంచలమే కలిగించాడు .
ఇంతకీ హారర్ కు ఆధారం ఏమిటో తెలుసా ?’’By the same particular form of content the emotion is produced and that is called fear –is the basis for horror ‘’ అని చెప్పారు .
16-10-2002 బుధ వారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-3-14- ఉయ్యూరు

