గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం )
గోదే కార్య కలాపాల లిస్టు చూస్తె ఆయన ప్రతిభ ఏమిటో యిట్టె తెలుస్తుంది .స్వతహాగా కవి ,నాటక రచయితా ,నాటక దర్శకుడు ,గొప్ప విమర్శకుడు ,విజ్ఞాన శాస్త్ర వేత్త ,మహా రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్ .ఇవన్నీ చూస్తె ఆయన ఉన్న కాలం నాటి మేధావులలో ఆగ్ర శ్రేణి లో నిలిచి నట్లు తెలుస్తుంది .ఈ సర్వజ్ఞత్వం అంతా ఆయన రాసిన ఫ్రాస్ట్ నాటకం లో ప్రతి బిమ్బిస్తుంది .ఈ నాటకం వలన గోదే,గ్రీకు ప్రాచీన కవి హోమర్ ప్రముఖ రాచయిత డాంటే ,ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్ పియర్ సరసన చేరాడు .ఈ నాటకం లో రసభావాలు తరచుగా మారి పోతూ గోదే శక్తి సామర్ధ్యాలను,హాస్య చతురతను వ్యంగ్య వైభవాన్ని ,సాను భూతి ని ,వీటి నన్నిటిని మించి ఆయన కవితాఝారి,ప్రతిభను ని నియంత్రించు కుంటూ ముందుకు సాగి పోతూ ఉంటుంది .
ఫాస్ట్ నాటకం ‘’universal experience of the troubled human soul ,ut its spiritual values far transcend
mere Satanism and its consequences ‘’అని కీర్తింప బడింది .ఇందులో డైరెక్టర్ చేత ‘for art may need long years of true devotion –to bring perfection to the light of the day ,the brilliant passes like the dew at morn ,-the true endures for ages yet un born ‘’అని పిస్తాడు కళాత్మక విషయానికి యెంత విలువ ఉండాలో దీని వలన తెలుస్తుంది .అలాగే ఒక కమెడియన్ తో ‘’but never put good fooling out of fashion ‘’అని నిజం చెప్పించాడు .ప్రేక్షక స్త్రీలను గురించి దర్శకుడు అన్న మాటలు చూద్దాం ‘’the ladies bring us fashion’s gallery –and play their parts without a salary ‘’అని వారి పాత్రనూ వివరిస్తాడు .ఇందులో ఒక పాత్ర అయిన లార్డ్ ‘’enwrap your minds in love’s immortal folds –and all that life in floating semblance holds –estabilish in fast thought that shall ‘’endure ‘’.లార్డ్ తన తో చాలా మంచిగా మాట్లాడతానని గురించి మేఫేటోఫ్లేస్ ఇలా అనుకొంటాడు ‘’it is decent in the first of gentlemen –to speak so friendly even to the devil ‘’.ముఖ్య పాత్ర ఫాస్ట్ ‘’I stand no wiser than I was before ‘’అని,’’ I made in god’s wn image –not with you cmpare ‘.if feelings fail yu vain will be yurs co urse-and idle what you plan unless you art –springs from the soul with elemental force to hold ‘’. తనను తానూ ఆవిష్కరించు కంటాడు .వాగ్నర్ అనే పాత్రతో మాట్లాడుతూ ‘’god’s own image who have seemed for sooth –near to the mirror of eternal l truth ‘’అంటాడు .ఈ కవన్నీ చిక్కని మధురసం వలక బోసేకవితా పంక్తులే చదువుతుంటే ఆనందం ,హాయి గంభీర భావం తో పరవశం కలుగు తుంది .పంచ భూతాలలో ఏమి ఉందొ తెలియ జేస్తూ ఇలా అంటాడు ‘’in elements of water ,earth and air –in moisture r in drought –in warm or cold –a ceaseless multitude of seeds un fold ‘’.
అదృష్టం ఎలా ఉంటుందో చెప్పాడు ‘’fortune some times scores a lucky pint ‘’అంటాడు .
ఫాస్ట్ తో చాలా విలువైన మాటలను గోదే చెప్పిస్తాడు చివరలో .’’life has taught me with its weary weight –to long for death –and the dear light to hate ‘’అని పిస్తాడు .ఫినిషింగ్ టచ్ గా ‘’happy the man who keeps his faith un strained –no sacrifice will come to him amiss ‘’అని ఫాస్ట్ తో గోదే అనిపిస్తాడు .
![]()
![]()
gothe’s birth place gothe ‘s water colour painting
గోదే జీవిత విశేషాలు
-28-8-1749లో గోదే జెర్మని లోని ఫ్రాంక్ ఫర్ట్ లో జన్మించాడు .తండ్రి జోహాన్ కాస్పర్ గోదే .తల్లి కేతలీనా ఎలిజబెత్ టేక్స్తార్ .ఇంటికే మేస్టర్లను పిలిపించి తండ్రి చదువు చెప్పించాడు,నాట్యం ,గుర్రపు స్వారి ఫెన్సింగ్ నేర్చాడు .తనకు రాణి విద్యలన్నీ తన సంతానం నేర్చుకోవాలని తండ్రి కల . కవిత విమర్శ నాటకం ల తో బాటు స్వీయ జీవిత చరిత్ర రాసుకొన్నాడు .రాజకీయం గా గొప్ప పేరూ పొందాడు రాజ నీతిజ్ఞుడు గా రాణించాడు .బాటని,అనాటమీ ,కలర్ ల మీద అనేక పరిశోధనాత్మక వ్యాసాలూ రాశాడు .వెయ్యి ఉత్తరాలు మూడు వేల డ్రాయింగులతో బాటు నాలుగు నవలాలూ రాసిన అక్షర శిల్పి .’’సారోసాఫ్ యంగ్ వేర్టర్ అనే మొదటి నవల అందర్నీ ఆకర్షించింది .జెర్మని పాలకుడు డ్యూక్ ప్రీవీ కౌన్సిల్ లో ఉన్నత పదవి చేబట్టాడు .యుద్ధ పర్య వేక్షకుడు గా ఉన్నాడు .జేనా యూని వర్సిటి లో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టాడు .వీమార్స్ బొటానికల్ గార్డెన్ కు రూప శిల్పి అయ్యాడు .ద్యూకల్ పాలస్ ను అనేక మార్పులతో సర్వాంగ సుందరం చేశాడు .ఇటలీ పర్యటన చేసి 1788లో తిరిగి వచ్చిన తర్వాత ‘’మెటా మార్ఫసిస్ ఆఫ్ ప్లాంట్స్ (వృక్షాలలో రూప విక్రియ )అనే సైంటిఫిక్ గ్రంధాన్ని రాసి వెలువ రించాడు .వీమార్ నాటక శాలకు డైరెక్టర్ గా నియమింప బడ్డాడు .నాటక రచయితా చరిత్ర కారుడు ఫిలాసఫర్ అయిన ‘’ఫ్రెడరిక్ షీలర్ ‘’తో మంచి పరిచయం ఏర్పడింది .’’విలియం మీస్టర్ అప్ప్రేంటి షిప్ ‘’అనే రెండవా నవల రాశాడు .1808ఆయన మేధో సృష్టి అయిన నాటకం ఫాస్ట్ మొదటి భాగం విడుదల చేశాడు .తనకు ముందున్న ఫిలాసఫర్ ల రచనల పై ‘’వీమర్ క్లాసిసిజం ‘’రాశాడు .ఆర్ధర్ స్కోపెంహార్ గోదే రాసిన మొదటి నవల వీహేల్మ్ అప్ప్రేంటి షిప్ జెర్మని భాషలో వచ్చిన అత్యున్నత నాలుగు నవలలో ఒకటి అని మెచ్చాడు .మహా రచయితా విమర్శకుడు ఎమర్సన్ గోదే ప్రతిభకు నీరాజనాలు అందించాడు .జంగ్ ,ఫ్రాయిడ్ ,థామస్ మాన్ వంటి అగ్ర శ్రేణి రచయితల పై గోదే ప్రభావం అధికం .గోదే రాసిన అనేక కవితలను సంగీత దర్శకులైన మొజార్ట్ ,బీతొవెన్ బ్రాహం ,వాగ్నర్ లను పద్దెనిమిది పందొమ్మిదవ శతాబ్దం లో తమ సంగీత కచేరీలలో ఉపయోగించుకొని ప్రేరణ పంది ఆయన కవితా మాధుర్యాన్ని చాటారు .
![]()
gothe and scheler monument portrait of gothe gothe s monument in chikago
గోదే కు రోమన్ కేధలిక్ మతం అంటే ఇష్టం ఉండేది కాదు .1765-68కాలం లో న్యాయ శాస్త్రం చదివవాడు.కాని పాత బడిన ఆ శాస్త్రం చదివి బట్టీ పట్టటం అంటే ఏవ గింపు కలిగింది .దానికి బదులు పోయిట్రీ క్లాసులకు వెళ్ళే వాడు ..’’అన్నా కేధరీన పెంకాఫ్ ‘’అనే ఆమెను వలచాడు .ఆమె పై ఎన్నో కవితలు రాసి ‘’రోకో కో ‘’పేరు మీద విడుదల చేశాడు .అల్సేస్ అనే చోటుకు మారి ఆరోగ్యం బాగు చేసుకొన్నాడు .జోహాన్ గాట్ ఫ్రీదర్ తో పరిచయం ఏర్పడి అభి వృద్ధికి దోహద మైంది .ఆయన వల్లనే షేక్స్ పియర్ సాహిత్యం చదివాడు,అభిరుచి పెరిగింది ..17-10-1772న మొట్ట మొదటి సారిగా జెర్మని లో షేక్స్ పియర్ దినోత్సవాన్ని వైభవం గా నిర్వ హించాడు .షేక్స్ పియర్ రచనలు చదవటం వలననే తనలో సాహిత్య స్పృహ ఇనుమడించింది అని గోదే స్వయం గా వెళ్ళ డించాడు
![]()
gothe;s monument in leipgig gothe with contemporaries
1771లో లా డిగ్రీ పొంది ఫ్రాంక్ ఫర్ట్ నగరం లో ప్రాక్టీసు ప్రారంభించాడు .తొందర బాటు తనం తో మొదట్లో వచ్చిన కేసులను చట్ట పరిమితి నతిక్రమించి వాదించి దెబ్బ తిని కేసులు లేకుండా చేసుకొన్నాడు .బావ మరిది తో పరిచయం మళ్ళీ సాహిత్యం వైపు మళ్ళించింది .తన జీవిత చరిత్ర ను నాటకం గా మలిచి ప్రదర్శిస్తే అద్భుతం గా విజయ వంతమైంది .1815లో గ్రాండ్ డ్యూక్ వద్ద చేరి వీమార్ లోనే జీవితాంతం ఉండిపోయాడు .ఏంతో మంది అమ్మాయిలను ప్రేమించాడు కాని అన్నీ విఫలమే అయ్యాయి .తన రచనలలో మేరీ బాల్డ్ ఎలిజీ అనేది గొప్ప దని గోదే భావించే వాడు .22-3-1832 న 82వ ఏట గోదే మహా రచయిత మరణించాడు .వీమార్ లోని హిస్టారికల్ సేమేటరి ద్యూకల్ వాల్ట్ లో గోదే ను ఖననం చేశారు .
20-10-2002 ఆదివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-14-ఉయ్యూరు

