శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి వితరణ
ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా లో అలబామా రాష్ట్రం లోని హాంట్స్ విల్ లో నివాసం ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం ,స్నేహం ఆత్మీయత, ఆదరణ ,పరోప కార పారీణత ,వితరణ అందరకు తెలిసిన విషయమే . 2004లో ఆయన ఉయ్యూరుకు వారి భూరి విరాళం తో రూపు దిద్దుకొన్న ఏ.సి గ్రంధాలయ ప్రారంభోత్సవానికి వారు వచ్చిన సందర్భం గా దాని నిర్మాణ కమిటీ కన్వీనర్ గా వారితో తోలి పరిచయం ఏర్పడింది .2008లో మేము అమెరికా వెళ్ళిన సందర్భం లో ఈ బంధం గాఢ పడింది .అప్పుడే సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివలక్ష్మి కుమార్తె ఛి బిందు వెంకట దత్తశ్రీ అమెరికా లో భగవద్గీత పోటీలలో పాల్గొన టానికి కుమార్తె తో వచ్చింది .శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఫోన్ నంబర్ అడిగి తీసుకొన్నది .గోపాల కృష్ణ గారికి తన ఆర్ధిక పరిస్తితి వివరించి ,బిందు కు ఏదైనా ఆర్ధిక సాయం చేయమని కోరిందట .ఈ విషయం నాకు ఆయనా చెప్పలేదు ఈమె కూడా చెప్పలేదు .ఆమె కు సాయం చేయాలని ఆ నాటి నుంచీ మనసులో ఉంది కాని వెసులు బాటు కాక డబ్బు సాయం చేయలేక పోయానని ఈ ఫిబ్రవరి చివర్లో నాకు మెయిల్ రాసి ,ఇప్పుడు కొంత వీలు దొరికిందని బిందుకు అందజేయ మని నాకు వేస్త్రెన్ మని ట్రాన్స్ ఫర్ ద్వారా 15,000రూపాయలు పంపి నాకు తెలియ జేసి ఆ పైకాన్ని శివ లక్ష్మి ద్వారా బిందు కు అంద జేయమన్నారు .ఆ డబ్బును మార్చి ఒకటవ తేదీ న పోస్ట్ ఆఫీసు నుండి నేను తీసుకొని శివలక్ష్మికి ఫోన్ చేసి ఆమె మా ఇంటికి ఆ సాయంత్రం రాగానే అంద జేశాను ..
ఈ పారితోషికాన్ని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సన్నిధిలో మీడియా మిత్రుల ముందు సరసభారతి అధ్యక్షుని గా నన్ను అంద జేయ మని శివ లక్ష్మి కోరింది .ఈ రోజు మార్చి నాలుగవ తేదీ మంగళ వారం’’ స్వామి’’ సన్నిధిలో భక్తుల సమక్షం లో శివ లక్ష్మి శ్రీనివాస శర్మ దంపతుల సమక్షం లో ఛి బిందు కు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తరఫున నేను అంద జేశాను.అందరూ మైనేని వారికి కృతజ్ఞతా సూచకం గా కర తాళ ధ్వనులు చేశారు .ఆయన వితరణ గురించి నాలుగు మాటలు చెప్పాను .బిందు బాగా చదివి అభి వృద్ధి లోకి రావాలని ఆశీర్వ దించాను .మాది రాజు కుటుంబం ఉచిత రీతిని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు .
ఛి బిందు వెంకట దత్తశ్రీ కి శ్రీ మైనేని గోపా కృష్ణ గారు (అమెరికా ) పంపిన పారి తోషికం -15,000రూపాయలు నేను శ్రీ సువర్చలన్జనేయ దేవాలయం లో అంద జేసే దృశ్య మాలిక
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-14-ఉయ్యూరు

