కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )
ఆంధ్రా లో లాగే మద్రాస్ లోను ట్యూషన్ మాస్టర్లు పేపర్ లీక్ చేసి తన దగ్గర చదివిన వారికి మాక్సిమం మార్కు లోచ్చేట్లు చేసే వారట .జయదేవ్ లెక్కల మేస్టర్ దగ్గర ట్యూషన్ చదివితే ఎప్పుడూ తొంభైకి పైనే మార్కులోచ్చేవిట. లీక్ పేపర్ వలన .కాని పబ్లిక్ పరీక్ష లో అత్తిసరు మార్కులతో పాస్ అయ్యాడు .మార్కులు తగ్గటానికి కారణ మేమిటి అని బాబాయి అడిగితె నిజాయితీగా ‘’పేపర్ అవుట్ కాలేదు ‘’అని చెప్పి చప్పున నాలుక కరుచుకొన్నాడు .లెక్చరర్లు ట్యూషన్ బాగా చెప్పి పిచ్చ డబ్బు సంపాదిన్చేవారట. అందుకే కాలేజీ లలో ఇంటర్ తీసేసి పి..యు.సి తెచ్చారంటాడు .తానూ బాచిలు బాచిలు గా ట్యూషన్ చెప్పానన్నాడు .ఒకప్పుడు బయాలజీ లో డిగ్రీ చదివిన వారికి మెడిసిన్ లో పదిశాతం ప్రవేశార్హత ఉండేదట .వాళ్ళ కాలేజిలో నాటకాలు ఆడించి డబ్బులు వసూలు చేసి బిల్డింగులు కట్టించిన జ్ఞాపకం ఉందాయనకు .
నవాబు రాజ మాణిక్యం తమిళ నాడు లో డ్రామా ట్రూపు పెట్టి పెద్ద పేరు పొందాడట .వాళ్ళు ఆడిన అవ్వయ్యార్ నాటకం చూశాడు స్టేజి ఎఫెక్ట్స్ బాగా ఉండేవట .స్టేజి మీదకు ఏనుగు ను తెప్పించేవాడు .మద్దెల చప్పుడు తో సీన్లు వేగం గా మారి పోయేవట .మంటలు వర్షాలు స్టేజి మీద తెప్పించి ఆశ్చర్య పరచే వారట .కుమార సంభవం నాటకం లో తారకాసుర సంహారం అచ్చం గా సినిమా లో చూసినంత ఎఫెక్టివ్ గా ఉండేదట .మన రాష్ట్రం లో ‘’సురభి ‘’నాటక కంపెని ఇలానే చేసేది .మాణిక్యం సినిమాల్లో విలన్ గా నూ రాణిం చాడట. .అతని ‘’ఇలాంగేశ్వార్ ‘’,చాణక్య ‘’నాటకాలు రికార్డులు సృష్టించాయి .వీటిని దూర దర్శన్ వారు టి వి సీరియల్ గా టెలికాస్ట్ చేశారట .
‘’ రాజాధి రాజు ‘’సినిమా లో నూతన్ ప్రసాద్ ‘’శిశువా ‘’అని చెప్పే డైలాగులు మరీ ఇష్టమట .దీని సేన్సారుకు జయదేవ్ బోర్డు సభ్యుడుగా ఉన్నాడు .సినిమా టైటిల్స్ మీద పది కార్టూన్లు గీశాడు .బాపు మెచ్చుకున్నాడు .దర్శకుడు వంశీ’’ గోదావరి తన నరనరాల్లో ప్రవాహిస్తూ ఉంటుంది’’ అని ఎప్పుడూ ఆవేశం తో, ఆరాధన తో అనే వాడట ..వంశీ అసిస్టంట్ డైరెక్టర్ గా తాయారమ్మ –బంగారయ్యకు’’,సీతాకోక చిలుక ‘’కు చేశాడట .’’డీకా రామన్ ‘’అనే లెక్చరర్ ‘’వేన్ ఐ వాస్ ఇన్ అమెరికా ‘’అనే డైలాగు లేనిదే ఏమీ మాట్లాదేవాడుకాదట .అదేదో సినిమాలో సి.ఎస్.ఆర్ ‘’ఆ రోజుల్లో నేను కాలేజీ లో చదివే రోజుల్లో ‘’అనే డైలాగు మనకు జ్ఞాపకం వస్తుంది కదూ .
నంద గోపాల్ అనే ఆయన కొడుకు ప్రత్యగాత్మ తో ‘’మూవీ మార్కెట్ ‘’అనే ఫిలిం మేగజైన్ పెట్టిన్చాడట .చాలా బాగా ఉండేదట దానికి పోటీ గా ఏ పత్రికా నిలవ లేదట .నంద గోపాల్ ఏ పత్రిక లో రివ్యూలు రాస్తారని జయదేవ్ అడిగితె ‘’నాకు పారి తోషికం ఇచ్చే స్తోమత మా ప్రత్య గాత్మ కు లేదు .ఇచ్చినా పుచ్చుకోను పుచ్చుకోకుండా ఏదీ రాయను ‘’అన్నాడట .దీనినే బ్లిట్జ్ ఎడిటర్ కరాంజియా ‘’he knows only to write about good films –there are no good films these days and –that is why he does not write ‘’ని చమత్కరించాడట .మద్రాస్ లోఆ రోజుల్లో ‘’బుహారీ ‘’హోటల్ కు మంచి క్రేజ్ ఉండేదన్నాడు .’’బ్రిటానియా గోల్డెన్ పఫ్’’బిస్కెట్లు బాగా ఉండేవని అవి మెత్తగా పొరలు పోరలుగా తక్కువ తీపితో రుచి గ ఉండేవని గుర్తు చేసుకొన్నాడు .’’రెడ్ వాటుల్ద్ లాప్ వింగ్ ‘’పక్షి ని తమిళం లో ‘’ఆల్ కుట్టి కురివి ‘’అంటారని అది అడవిలో ఎవరైనా మనుషులువస్తే పై నుంచి చూసి అరచి మేస్తున్న జంతువులను హెచ్చరిస్తుంది .వేటగాళ్లకు ఈ పిట్ట అంటే గిట్టదు వేటాడి చంపెస్తూన్తారు .
తాను వేసిన కార్టూన్ లలో వందలాది వాటికీ తెలుగు లెక్చరర్ గోపాల్ క్యాప్షన్లు సరిదిద్దే వాడట .బాపూ ,రమణ లకు గోపాల్ ను జయదేవ్ పరిచయం చేశాడు .రమణ కు తెలుగు సాహిత్యం లో అనుమానం వస్తే గోపాల్ నే అడిగే వాడట .తమిళ సాంప్రదాయాలను గురించి చెప్ప గలిగే వాడు గోపాల్ మాస్టారు మాత్రమె నని బాపు నమ్మకం ట .త్యాగయ్య షూటింగు కు బాపు గోపాల్ ను తన తో బాటు తిరువయ్యార్ షూటింగు కు తీసుకు వెళ్ళాడు .కాలేజి లో అబ్బాయ్ గా జయదేవ్ బాబాయ్ గా గోపాల్ చలామణి. అయ్యారట . అదే పేరుతో కార్టూన్ సీరియల్ వేశాడు .’’పురాణం’’ గారికి ఇది నచ్చి ఆంధ్ర జ్యోతి లో సీరియల్ గా ప్రచురించాడు .జంధ్యాల బాబాయ్ అబ్బాయ్ పేరు తో సినిమా తీశాడు కద వేరు .
జలగ పట్టుకొంటే విడిపించుకోవటానికి సిగరెట్టూ లోని పొగాకు తీసి తడిపి, నలిపి, జలగ మీద వేస్తె నికోటిన్ ప్రభావం వలన అది మొద్దు బారి పట్టు వదిలేస్తుందనే చిట్కా చెప్పాడు జయదేవ్ .మద్రాస్ యూని వర్సిటి లో జయ ఆస్థాన చిత్రకారుడై పోయాడు .ఎంతో మంది పరిశోధకుల దిసీస్ లకు జయ బొమ్మలు గీసి విజయానికి తోడ్పడ్డాడు .అబ్సర్వేషన్ మీదనే ఎక్కువ కార్టూన్లు వేశాడు .జువాలజీ దిపార్టు మెంట్ లో మ్యూజియం ‘’సినిమా హాల్ లో టాయ్ లెట్ ‘’లాగా ఉంటున్దని చెప్పాడు .మద్రాస్ రేడియో లో గొల్ల పూడి జయదేవ్ తో టాక్ లిప్పించాడట .రికార్డింగ్ చేస్తున్నంత సేపూ గొల్ల పూడి ముఖం లో అనేక భావాలు కని పించాయని ఆయన సినిమాల్లో మంచి వేషాలలో రాణించ గలడని ఊహించిన జయదేవ్ మాటలు నిజమే అయ్యాయి కదా .
పులి చర్ల సాంబశివ రావు చాలా ‘’వీజీ ‘’గా కార్టూన్లు గీసి పారేసే వాడట .అచ్చ మైన పదహారణాల కార్టూన్లు పులి చర్ల వి అని మెచ్చాడు .అతని వ్యాఖ్యలకు బాబు తో కలిసి జయదేవ్ ఫుల్ పేజీ కార్టూన్లు గీశాడు .విదేశీ కార్టూన్ కి తనకు ‘’ప్రతి అయిడియా’’ తట్టేది అన్నాడు .1975-1985పదేళ్ళ కాలం లో ‘’కార్టూన్ కు స్వర్ణ యుగం ‘’అన్నాడు జయ .నాలుగు వందల మంది కార్టూనిస్టు లు అప్పుడు తెలుగు పత్రిక లలో వేసేవారని మహదానందం పొందాడు .తన పాత చాకలి వాని పేట లో దేవాంగులు చాలా మంది ఉన్నారట .దేవాంగుల మూల పురుషుడు దేవుల బ్రహ్మ .రామ లింగ చౌడేశ్వరి దేవికి పరమ భక్తుడు .కనుక వారికి ఆమె ఇలా వేలుపు .తిరునాళ్ళలో అమ్మవారికి జంతుబలి ఇస్తారు . నిప్పుల మీద నడుస్తూ శాంభవీ పరాక్ అంటారు .వీరికి రొమ్ము మీద కట్టి గాట్లుంటాయి .రాజులకు వస్త్రాలు నేసె వారట .రంగులు డిజైన్లు వేయటం లో వీరిదే పై చేయి .
ఒక సారి మంగళం పల్లి గారితో జయదేవ్ కు సన్మానం చేసి ‘’కార్టూన్ బ్రహ్మ ‘’అని పొగడటం మర్చి పోలేనన్నాడు .దీన్ని నిర్వహించిన డాక్టర్ సి ఏం కే రెడ్డి గారు ‘’ఇక్కడ స్వర బ్రహ్మ కొంటె బొమ్మల గీత బ్రహ్మ ఉన్నారు నేను మాత్రం కోతల బ్రహ్మను ‘’అంటే అంతా పక్కున నవ్వారట .తమిళ హాస్య నటుడు నగేష్ ‘’జెర్రీ లూయీస్ ‘’ను బాగా అనుకరించేవాడన్నాడు .మద్రాస్ చైనా బజార్ లో కంటికి కని పించకుండా పర్సులు కొట్టే దొంగలు విపరీతం అన్నాడు .పోలీసులకు కంప్లైంట్ చేస్తే అయిదు నిమిషాల్లో తెప్పించి పోయిన వస్తువు ను ఇప్పిస్తారట .వీరిదంతా ఒక నెట్ వర్క్ అన్నాడు .యెన్ టి ఆర్ .సంతకానికి ‘’సైకిల్ బొమ్మ ‘’వేయటం మరువ రాని అనుభవం అన్నాడు .ముళ్ళ పూడి కి శివాజీ గనేషణ్ చాలా ఇష్టమైన నటుడని చెప్పాడని గుర్తు చేసుకొన్నాడు
పర్యా వరణ సంరక్షణ మీద చాలా కార్టూన్లు గీశాడు .అయిదు వేల రూపాయల పారితోషికం లభించింది .స్విట్జర్లాండు నుంచి ‘’రసాలా’’ అనే కార్టూనిస్టు మద్రాస్ వచ్చి జయదేవ్ తో వారం గడిపాడట .ఇద్దరు కలిసి ఒక ఫుల్ పేజి కార్టూన్లు వేశారట .ధారా రామ నాద శాస్త్రి గారి ని కలిసి నప్పుడు తాను విల్స్ ఫిల్టర్ పాకెట్ ను ,,గోపాల్ విస్ కింగ్స్ పాకెట్ ను ఇచ్చారట.రెండు తీసుకొని ‘’so this is the tall and short of your affection towards me ‘’అన్నారట .తన పాకెట్ పోట్టిదని గోపాల్ డి పొడుగు దాని ఇంగ్లీష్ లో ‘’టాల్ అండ్ షార్ట్ ‘’అనే ఫ్రేజు ‘’పరి పూర్ణత ‘’కోసం ఉపయోగిస్తారని జయ దేవ్ అన్నాడు .
1940లో తన తో బాటు ‘’నిక్ బెకర్ ‘’,మేకలా క్లాన్ ‘’,’’కోలిన్ విత్ కాక్ ,’’మైక్ విలియమ్స్ ‘’వంటి అద్భుత కార్టూనిస్టులు జన్మించారని గర్వ పడ్డాడు .తానూ కూపస్థ మండూకం అయినా రాగతి పండరి శిష్యురాలైనదన్నాడు .న్యూ యార్క్ కార్టూనిస్టు జేమ్స్ తర్బర్ కార్టూన్ కు అసలైన నిర్వచనం ఇచ్చిన మొదటి కార్టూనిస్ట్ అని చెప్పాడు .బొమ్మకీ వ్యాఖ్యకి లింకు పెట్టి చూపింఛి ఇదే ‘’వ్యాఖ్య సహిత కార్టూన్ ‘’అన్నాడు .ఆయన బొమ్మలు సింపుల్ గా చిన్న పిల్లలు గీసిన గీతల్లా ఉంటాయన్నాడు .తర్బర్ పై నేను ‘’చినుకు ‘’మాస పత్రిక లో ఒక వ్యాసం రాశానని ఇక్కడ గుర్తు చేస్తున్నాను .శంకర్స్ వీక్లీ లో విష్ణు అనే కార్టూనిస్ట్ ఇలాగే గీసేవాడు .విష్ణు గురించి ఇల్లస్త్రేతేడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో గమంచి వ్యాసం వచ్చిందని గుర్తు చేసుకొన్నాడు .ఆయన బొమ్మను గజి బిజీ గా గీసి వ్యాఖ్యతో ఫినిషింగ్ టచ్ ఇస్తాడని పొగిడారు అందులో .
తన కార్టూన్లు అన్నీ తనకు నచ్చినవే నని ఇతర కార్తూనిస్ట్లు మంచి కార్టూన్ గీస్తే అభినందించటం తనకు అలవాటన్నాడు .నాగార్జున సిమెంట్స్ కు ‘’2D’’యానిమేషన్ యాడ్ చేశాడు జయ దేవ్ .కార్టూన్ల మీదప్రయోగాలు M A D .కార్టూనిస్టులదే పై చెయ్యి అంటాడు .తన పేరన్నా తన కార్టూన్ లన్నా యండ మూరి వీరేంద్ర నాద్ కు చాలా ఇష్టం .ఆయన రాసిన తలసి దళం లో తన పేరే హీరో కి పెట్టు కున్నారట .’’ఐ లైక్ యు మోర్ దాన్ అమితాభ్ బచన్ ‘’అని మెచ్చుకొన్నారని పొంగి పోయాడు కార్టూన్ జయ దేవుడు .ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి తీసిన కొబ్బరి బొండాం ,రాజేంద్రుడు –గజేంద్రుడు ,మాయ లోడు ,ఘటోత్కచుడు సినిమాలకు పబ్లిసిటి డిజైన్ జయదేవ్ చేశాడట .
తమిళ నాడు లో ‘’పిళ్ళై యార్ చవితి ‘’అంటే వినాయక చవితి అని అర్ధం అన్నాడు .దీనికి అర్ధం ‘’బిడ్డ ఎవ్వరు ?’’అని అర్ధం .పార్వతి నలుగు పిండితో వినాయక విగ్రహం చేసి ప్రాణం పోస్తే శివుడిని ఆయన అడ్డ గిస్తే త్రిశూలం తో తల నరికాడని మనకు తెలిసిందే .దక్షిణ వైపు తల పెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను తెచ్చి అతికించాడు శివుడు .పార్వతి సంతోషం తో కొడుకును వీధుల వెంట తీసుకొని వెడుతుంటే అందరూ వింతగా చూసి ‘’పిళ్ళై యార్ ‘’అని అడిగారట అంటే ఈ పిల్లాడు ఎవరు ?/అని అర్ధం అదే వినాయకుడి పేరై పోయిందట .
ఇళ్ళకొచ్చి కాగులకూ వాటికి కళాయి పూతా పూసే వారిని జ్ఞాపకం చేసుకొన్నాడు.రోమ్ నగరం లో పూర్వం సీసం పైపు లతో మంచి నీటి సరాఫరా చేసే వారట .ఆరోగ్యం దెబ్బతింటుంది అని సీసాన్ని నిషేధించారట .ఆర్టిస్ట్ జయ రాజ్ అంటే చాలా ఇష్టం అన్నాడు .చివరగా జయదేవ్ ‘’మిడిల్ క్లాస్ జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది .కష్టాలను చవి చూపిస్తుంది .సుఖం విలువ ను ఎత్తి చూపిస్తుంది .ఉండీ లేనట్లు ,గడిచీ గడవ నట్లు సాగితేనే జీవితం లో ఒక అర్ధం ఉంది .మనిషికి చేతినిండా మాత్రమె డబ్బు ఉండాలి .పెట్టె నిండా ఉంటె అది పోతుందేమో నని భయం వేస్తుంది ‘’అన్నాడు ఇది అందరికి తెలుసుకోవాల్సిన విషయం
ఈ విషయం లో ఒక కద గుర్తు చేశాడు .విష్ణువు కు శ్రీదేవి ,మూదేవి అని ఇద్దరు భార్యలు .మొదటి ఆవిడే లక్ష్మి రెండో ఆవిడా ఆమె కు విరుద్ధం .వికారం గా ఉంటుంది ,దరిద్ర దేవత .ఇద్ద్దరూ ఒక సారి తగాదా పడ్డారు .ఎవరు విష్ణువు కు ప్రీతి పాత్రం అనే విషయం మీద జుట్లు పట్టుకున్నారు .విష్ణువు తగాదా తీర్చటానికి ఒక పరీక్ష పెడ తానంటే ఇద్దరూ ఒప్పుకొన్నారు .ఇద్దర్నీ పది అడుగులు నడిచి వెనక్కి రమ్మన్నాడు .అలానే చేశారు .అప్పుడు విష్ణువు తమాషా గా తగవు తీర్చాడు .’’శ్రీ దేవి నడిచి వస్తుంటే అందం .మా దేవి నడిచి వెడుతుంటే అందం ‘’అన్నాడు ఇద్దరూ సంతోషించారు .దరిద్రం మనిషి ని కుంగ దీస్తుందని జయ దేవ్ ఆటాడు .ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు జమ్మి కోనేటి రావు జయ దేవ్ కు జువాలజీ ప్రొఫెసర్ .ఆ సబ్జెక్ట్ ను తెలుగులోకి అనువదించారు రావు గారు .ఆర్ధికం గా ఏమీ లాభం లేక పోయినా తెలుగు లో చెప్పగలం అనే తృప్తి ఆయనకు మిగిలిన్దన్నాడు జయదేవ్ .ఆంద్ర పత్రిక లో సైన్స్ ఆర్టికల్స్ చాలా రాశారు
జీవితం లో ఏదో ఒకటి సాధింఛి తీరాలి .అందుకోసమే కష్ట పడి పని చేయాలి . ఆ ఆనందాన్ని అనుభ వించాలి .’’దట్ ఈజ్ లైఫ్ ‘’ అని ముగించాడు ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’ను .చదివితే మనమూ .’’గ్లాచ్చ్యూ రీచ్చ్యూ జయదేవ్ ‘’అన బుద్దేస్తుంది
సమాప్తం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలతో –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-14-ఉయ్యూరు

