పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం )
కౌటిల్యుడు –అర్ధశాస్త్రం
కౌటిల్యుడు అని పేరొందిన ఆర్య చాణక్యుడు రాసిన అర్ధ శాస్త్రం పై పుల్లెల వారు ఎన్నో విశేషాలను ‘’కౌటిలీయం అర్ధ శాస్త్రం ‘’లో వివరించారు .అందులోని కొన్ని ముఖ్యాంశాలను మీ ముందుంచుతున్నాను .
మహా మేధావి అయిన కౌటిల్యుడు అర్ధ శాస్త్రం రాశాడు .ఆయనకు తలి దండ్రులు పెట్టిన పేరు ‘’విష్ణు గుప్తుడు ‘’.చణకుని ‘’కుమారుడు కనుక చాణక్యుడు అయ్యాడు . కౌటిల్యుడు అనేది గోత్రనామం అని ‘’శామ శాస్త్రి’’ అనే మైసూర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ అధికారి పేర్కొన్నారు ఈయనే ఈ గ్రంధాన్ని విస్తృతం గా పరిశోధించి కొన్ని భాగాలు ‘’ఇండియన్ యాంటి క్వెరీ ‘’లో 1905లో ప్రకటించారు .1909లో సంపూర్ణ గ్రంధాన్ని సేకరించి ప్రచురించారు .కాల గర్భం లో కలిసి పోయిన ఈ ఉద్గ్రంధాన్ని బయటికి తీసి వెలువరించి మహోప కారం చేసిన ఘనత శామ శాస్త్రి గారిదే .వారికి యావద్ భారత జాతి రుణ పడి ఉంది .మౌర్య చంద్ర గుప్తుని అమాత్య శేఖరుడే కౌటిల్యుడు అని ,ఆయనే అర్ధ శాస్త్రం రచించాడని సప్రమాణం గా ,సంయుక్తికం గా ప్రతి పాదించారు శాస్త్రి గారు .హిల్ బ్రాట్ ,హర్తల్ ,యాకోబి ,స్మిత్ మొదలైన పరిశోధకులు సమర్ధించారు .క్రీ.పూ.325-273కాలం లో పాలించిన చంద్ర గుప్తమౌర్యుని మహా మాత్యుడైన చాణక్యుడు క్రీ.పూ..400లో అర్ధ శాస్త్రాన్ని రాశాడు .ఈ విషయాలన్నీ శ్రీ జయ చంద్ర విద్యాలంకార్ ‘’భారతీయ ఇతి హాస కి రూప రేఖ ‘’పుస్తకం లో ‘’కీత్ ‘’పండితుని అభియోగాలన్ని తప్పు అని రుజువు చేసి ప్రచురించాడు .
ప్రాచీన కాలం లో అర్ధ శాస్త్ర ప్రభావం అనేక గ్రందాల మీద ఉంది .సంస్కృత సాహిత్యం లో అర్ధ శాస్త్రం కామ శాస్త్రం ప్రభావం మరీ ఎక్కువ .కామందకుడు ‘’నీతిశాస్త్ర సారం ‘’అనే గ్రంధాన్నిక్రీ.శ.400లో అర్ధ శాస్త్రం ఆధారం గానే రాశాడు .కౌటిల్యుడే విష్ణు గుప్తుదని నంద వంశాన్ని నిర్మూలం చేసి మౌర్యునికి పట్టాభి షేకం చేసింది చాణక్యుడే నని ఇందులో వివరించాడు .కాళిదాసు ,భారవి మాఘుడు పై కూడా దీని ప్రభావం ఉంది .బట్టభాణుడు చాలా చోట్ల అర్ధ శాస్త్ర ప్రస్తావన చేశాడు .క్రీ.శ.300ప్రాంతం లో రాయ బడిన ‘’పంచతంత్రం ‘’లో చాణక్యుని పేరు ఉంది .క్రీ.శ.600లో విశాఖ దత్తుడు రాసిన ముద్రా రాక్షస నాటకం చాణక్యుడికి రాక్షస మంత్రికి సంబంధించిన కదా .
అర్ధ శాస్త్రం లో 15 అధికరణా లున్నాయి .ప్రతి అధికరణానికి కొన్ని అధ్యాయాలున్నాయి .మొత్తం మీద 150అధ్యాయాలున్నాయి .సాధారణం గా అధ్యాయాలలో అధికరణలుంటాయి దీనికి విరుద్ధం గా చాణక్యుడు అధికరణ లలో అధ్యాయాలను ఉంచాడు .వాత్సాయన కామ సూత్రాలలో నూ ఇలాగే ఉంది .రాజ శేఖరుడు కావ్య మీమాంస లో ఇదే పద్ధతిని అనుసరిమ్చాడని పుల్లెల వారు అన్నారు .
32అక్షరాలను ఒక గ్రంధం గా పేర్కొంటారని అర్ధ శాస్త్రం లో 600గ్రంధాలు ఉన్నాయని చెప్పారు .అతి సులభ మైన శైలిలో సూత్రాల లాగా చిన్న చిన్న వాక్యాలుగా అర్ధ శాస్త్రాన్ని రాశాడు .కొన్ని శ్లోకాలూ ఉన్నాయి .ప్రాచీన అర్ధ శాస్త్ర జ్ఞు లైన శుక్రుడికి ,బృహస్పతికి ముందు గా నమస్కరించి అర్ధ శాస్త్రం మొదలెట్టి రాశాడు .’’దీరీ’’ తో బాటు ప్రయోగాన్ని చెప్పాడు .ఆ నాడు చెప్పినవి నేటికీ అనువర్తిస్తాయి .అందుకే దీన్ని ‘’త్రికాలా బాధిత గ్రంధం ‘’అన్నారు
కౌటిల్యుడు గ్రీకు మేధావి తత్వ వేత్త శాస్త్ర వేత్త అలేక్జాందర్ గురువు అయిన అరిస్టాటిల్ కాలం వాడు ..కౌటిల్యుడు మౌర్య వంశ స్తాపకుడు చంద్ర గుప్తుని గురువు ,మహామాత్యుడూ కూడా .ఇద్దరి భావాలలో కొన్ని మౌలిక భేదాలున్నాయి .’’రాజ్యం అత్యన్నత రాజ్యంగా విదానంద్వారా పాలించాలి అధికారులు కార్య నిర్వహణ దక్షులు ,సద్గుణ సంపన్నులు గా ఉండాలి .రాజ్య పాలకులు సుస్తిరం గా ఉంటేనే రాజ్యం ఇది సాధ్యం ‘’అని అరిస్టాటిల్ అ భిప్రాయ పడ్డాడు .కౌటిల్యుడు కూడా ‘’రాజ్యం సుస్తిరం గా ఉండాలంటే ఒక వ్యక్తీ సర్వాధికారి గా ఉండాలి .అప్పుడే క్షేమం కలుగుతుంది ‘’అన్నాడు సంఘ రాజ్యాలు లేక గణ రాజ్యాలు సంఘటితం గా బలం గా ఉంటాయన్నాడు కౌటిల్యుడు .రాజు నిరంకుశం గా ప్రవర్తించటానికి వీలు లేదని ‘’అతను కూడా జీతం తీసుకొనే ఒక ప్రజా సేవకుడు ‘’అని అంటాడు ..రాజు అపరాదుల్ని శిక్షించటం వరకే అధికారి అని ఆయన చేసే ప్రతి పని మంత్రుల పర్య వేక్షణ తోను ప్రజా సంక్షేమ ద్రుష్టి తోను ధర్మం బద్ధం గాను ఉండాలని ఆంక్షలు విధించాడు. అంటే రాజుకు నిరంకుశాధికారం కట్ట బెట్ట లేదు .త్రయీ ధర్మాన్ని రక్షించాలని కౌటిల్యుని అర్ధ శాస్త్ర సారాంశం .
‘’మానవుడిని భయ పెట్టి పాలించాలి ‘’ అన్న ‘’మాక్ విల్లి ‘’భావానికి కౌటిల్యం విరుద్ధం .దండానికి ప్రాధాన్యత నిచ్చినా ,అపరాధాన్ని మించిన దండాన్ని ఒప్పుకో లేదు కౌటిల్యుడు .మాక్ విల్లి రాసిన ‘’ప్రిన్స్ ‘’గ్రంధం కౌటిల్యుని అర్ధ శాస్త్రాన్ని ఆధారం గా చేసుకొని రాసినా విపరీత ధోరణులు ఎక్కువ .పంచతంత్రం ఎనిమిదో శతాబ్దం లోనే పాశ్చాత్య దేశాల్లో కాలు పెట్టింది .అర్ధ శాస్త్రం అంటే ఆర్ధిక వ్యవహారాలను అంటే ఎకనామిక్స్ మాత్రామే చెప్పేదికాదని అర్ధం అంటే ‘’మనుషులున్న భూమి ‘’అని కౌటిల్యుడే చెప్పాడు .అందుకే అర్ధ శాస్త్రం ‘ప్రాచీన భారతీయ లౌకిక విషయ విశ్వ కోశం ‘’అని నిస్సందేహం గా చెప్ప వచ్చు నని ఆచార్య పుల్లెల అన్నారు .
విదేశీ పాలన కు పూర్వం భారత దేశం లో రాజ్యాల పాలన అర్ధ శాస్త్రం ఆధారం గానే జరిగిందని ప్రొఫెసర్ ఎస్.ఆర్ కులకర్ణి మరాఠీ లో రాసిన ‘’శివ కాలేన రాజ నీతి ఆణి రణ నీతి ‘’గ్రంధం లో సవివరం గా రాశాడని గుర్తు చేశారు .’’శ్రీ మూలం ‘’అనే పేర అర్ధశాస్త్రానికి మహా మహోపాధ్యాయ టి గణపతి శాస్త్రి సంస్కృతం లో వ్యాఖ్య రాసి 1923లో తిరువనంతపురం నుండి ప్రకటించినట్లు తెలిపారు .’’ప్రొఫెసర్ కాం గ్లే’’దీనికి ఇంగ్లీష్ లో విపులమైన వ్యాఖ్య టీకా టిప్పణి రాసి 1960లో ప్రచురించాడు .ఇది చాలా ప్రామాణిక గ్రంధం అంటారు పుల్లెల వారు .
శివ ద్రుష్టి
ఆచార్య శ్రీ రామ చంద్రుడు గారుశివ ద్రుష్టి పై ద్రుష్టి ప్రసరించారు .శైవమతం ‘’కాల్కొలిదిక్ యుగం ‘’( calcolithic age )పూర్వం ,ఇంకా పూర్వమే ఉండేదని సర్ జాన్ మార్షల్ చెప్పాడన్నారు .వివిధ దేశాల్లో వివిధ రూపాలను శైవం వర్ధిల్లింది అంటారు తమిళ నాడులో శైవ సిద్ధాంతం కాశ్మీర్ లో శివా ద్వైతం ,కర్నాటక లో వీర శైవం ప్రధాన శైవ మతాలు .కాశ్మీర్ లో శైవం చాలా కాలం గురు శిష్య పరం పర లో వర్ధిల్లింది .తొమ్మిదో శతాబ్దం లో ‘’ఉప గుప్తుడు ‘’శైవ సిద్ధాంతాలను మొదటి సారి గా గ్రంధస్తం చేశాడు .వాటికి ‘’శివ సూత్రం ‘’అని పేరు .శివుడు కలలో కన్పించి ఉపదేశించిన సూత్రాలివి .శంభో పాయం శాక్తోపాయం ,అణవోపాయం అనే మూడు భాగాలలో 77సూత్రాలున్నాయి .వ్యాఖ్యానాలు ఉంటె కాని ఇవి అర్ధం కావు .కాశ్మీర శైవం లోశివాద్వైతం ,త్రిక సిద్ధాంతం ,ప్రత్యభిజ్ఞాన సిద్ధాంతం అని మూడు పేర్లున్నాయి .త్రిక సిద్ధాంతం అంటే పరా అపరా పరాపర అని కొందరు ,అభేద భేద భేదాభేద అని కొందరు భావిస్తారు .చిత్ ,ఇచ్చా ,జ్ఞానాలు అంటారు మరికొందరు .పాణిని కాత్యాయన పతన్జలుల ను బట్టి వ్యాకరణానికి ‘’త్రిముని ‘’అనే పేరొచ్చిందని ఆచార్య అంటారు .
శక్తి రూపం అయిన పరతత్వం తనను ప్రకటించటం అనేదే జగత్ సృష్టి .మర్రి విత్తనం లో మహా వృక్షం శక్తి రూపం లో ఉన్నట్లు ఈ చరాచర జగత్తు అంతా పరమ శివుని హృదయం లో బీజ రూపం లో ఉంది అని ‘’పరాత్రిమ్షిక ‘’చెబుతోంది .చిత్ అంటే స్వయం ప్రకాశమైన పరతత్వ రూపం .ఆనందం అంటే పరిపూర్నానందం .దీనికే స్వాతంత్ర్యం అని కూడా పేరు .బాహ్య అపేక్ష లేకుండా ఏ పని అయినా చేయగలదు .పరతత్వం లో ఉన్న ఈ విభాగానికే’’ శక్తి’’ అని పేరు .నిజంగా చిత్ ఆనందం రెండూ పరతత్వ రూపాలే .సృష్టి ప్రక్రియ ను ‘’ఇచ్చ’’అంటారు ఇచ్చాశక్తిని బట్టి పరతత్వానికి సదాశివుడు లేక సాదాఖ్యుడు అంటారు ..జ్ఞానం అంటే తెలుసుకొనే శక్తి. దీన్ని పురస్కరించుకొని పరతత్వానికి ఈశ్వరుడు అనే పేరొచ్చింది .ఏ రూపాన్ని అయినా ధరించే శక్తికి ‘’క్రియ ‘’అని పేరు .ఈ శక్తిని బట్టి పరతత్వం సద్విద్య లేక శుద్ధ విద్య అని చెప్ప బడుతుంది
శివ తత్త్వం– అంటే పరమ శివుని ‘’విశ్వోత్తార స్వరూపం ‘’విశ్వ మాయ స్వరూపం అనీ అనచ్చు. సృష్టి చేయటానికి పరమ శివుని లో మొదట కలిగే ప్రధమ స్పందననే ‘’శివ తత్త్వం ‘’అంటారు పరతత్వం స్వతంత్రం గా తనలో ఉన్న ప్రపంచాన్ని బహిర్గతం చేయటానికి చేసిన మొదటి స్పందనమే లేక కదలిక ఏ’’ శివుడు ‘’.అంటే మొదటి కదలిక పుట్టిన పరమ శివుడే శివుడు లేక శివ తత్త్వం
శక్తి తత్త్వం –అంటే శివుడి లో ఉన్న అనంత అచింత్య మైన శక్తి యే శివ తత్త్వం .శక్తిలో ఉన్న జ్ఞాన విభాగమే శక్తి ఇచ్చా శక్తి ప్రధానం గా ఉన్న పరమ శివుడే ‘’సదా శివత్వం ‘’.దివ్యానుభూతిలో ఇదం అనే అంశ ఎక్కువైఅనప్పుడు భాసించే దశ కు ‘’ఈశ్వరుడు ‘’అని పేరు ఇదం అంటే ద్రుశ్యమానమైనది .ఇలా భాసించటానికే ‘’ఉన్మేషం ‘’అని పేరు .ఇలా ఎన్నోన్నో విశేషాలు వివరాలు పుల్లెల వారి ప్రస్తావనలలో లభిస్తాయి .అదొక విజ్ఞాన సాగరం .లోతుకు వెళ్ళిన కొద్దీ అనర్ఘ రత్న రాసులు లభించి జ్ఞాన నేత్రాలను తెరిపిస్తాయి. అదొక విజ్ఞాన భాండారం .తీసుకున్న వారికి తీసుకకొన్నంత జ్ఞాన సంపద లభిస్తుంది .నాకున్న అతి తక్కువ పరిమిత జ్ఞానం తో నేను తెలుసు కొన్నవి ,అర్ధం చేసుకొన్నవి అయిన జ్ఞాన నిధి ని మీకూ అందజేసి పుల్లెల వారి విస్తృత పరిజ్ఞానాని నమస్సు లందిస్తూ సెలవు .
Prof. P. Sriramachandrudu is an ‘exact man’ in the words of Francis Bacon, for he has penned such a large number of books with which he shines in the galaxy of scholars like the moon (chandrudu) with his pleasant rays. He is a great teacher, poet, critic, satirist, essayist, grammarian, rhetorician translator and above all a great commentator of several Sanskrit works which include his magnum opus the translation of Valmiki Ramayana with word to word meaning and commentary in Telugu which runs into over 10,000 pages. Sri Pullela Sriramachandrudu is devoted to teaching and research till date. Padamanjari two volumes were published during term of Mahamahopadhyaya Prof. sriramachandrudu. Being grammarian, Sri Ramachandrudu could bring out these editions very well.
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-14-ఉయ్యూరు

