రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ )
1-హాస్యం పొగరు విగరు, సెక్సూ ,మసాలా కలబోసిన ‘’హేపీ యశ్వంత్ ‘’
‘’ సర్దార్జీ జోకులకేకుల’’ మాస్టరు, సెంచరీ మిస్సయిన ‘’ఖుషీ కుష్వంత్ ‘’.
2-‘’డర్టి ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ‘’ముద్ర పడ్డా’’
శృంగారం, బూతులు, జోకులు తన జీవితం లో ఒక భాగమే నన్న ‘’పంజాబ్ బిడ్డ ‘’.
3-నాలుగో ఏటనే ‘’శృంగార క్రీదాభిరాముడి’’నని జబ్బ చరచి చెప్పిన ‘’సర్దార్జీ ‘’
స్త్రీలను తల్లుల్లా చెల్లెల్లా చూచే సంస్కారం తనకు లేదన్నాడీ ‘’రాత మాస్టర్జీ’’.
4-‘’పరిటాల’’ వారసురాలు బాంబు నేల ‘’సునీత ‘’
‘’సైకిల్’’ దిగి’’ కమలం’’ పట్టి అవుతుందా’’ కాషాయం నేత ‘’?
5- కాంగీ కి జెల్ల కొట్టి’’ జేసి బ్రదర్స్ ’’
సైకిలెక్కి జిల్లాలో చేసేస్తారా ‘’అదుర్స్ ‘’.
6-జనం లోకి నడిచి వెళ్ళే ఓపికా దమ్మూ లేక చేబట్టారు ‘’బస్సు యాత్ర ‘’
చేసిందానికి పేడకల్లాపి చల్లి ‘’చిరుకు ‘’జనం చేస్తారా ‘’తుస్సు యాత్ర ?’’
7-‘’రాయ పాటి’’ తో సహా చేరుతాడట’’ డొక్కా ‘’
గుంటూరు ఏం పి గారి ప్లాన్ మాత్రం ‘’పక్కా ‘’.
8-నమ్మక ద్రోహి కెసిఆర్ అన్న ‘’నాగేంద్ర దానం ‘’
ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదా ‘’జంప్ జిలానీ వైనం’’?.
9- ఓటమి భయంతో ఎన్నిక కు దూరమైన ‘’చిదంబరం ‘’
కొడుకుని నిల బెట్టినా ఓడించి పంపిస్తుందట’’ జయ’’ ‘’చిదంబరం ‘’.
10- ‘’తెరాసా’’ నుండి తనకు స్పందన లేదన్న’’ కత్తీ సుత్తీ నారాయణ ‘’
‘’ హలో’’ అనలేదని, జత కట్టేవారు లేరని.పాడుకొంటున్నాడు ‘’అల్లో నారాయణా ‘’!
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-14-ఉయ్యూరు

