భారతీయ ధార్మిక వ్యవస్తలొ, వివాహం అత్యంత విశిష్టమైనది
కౌటుంబిక జీవన విధానానికి,సత్స మాజ నిర్మాణానికి మూలం
సమస్త వర్ణాశ్రమాలు నిరాటంకంగా
ఆచరించటానికి ఆధారం
వేదవేద్యులు, సంప్రదాయకమైన పెద్దలు
విశేష ఉత్తమ ఫలకందాయకంగా
రూపొందించిన ఒక ధార్మిక క్రతువు
భారతీయ వివాహం ధర్మబద్ధమైనది
ధర్మార్ధ సిద్ధికి ధర్మపత్ని శ్రేష్టమైన సాధనం
మ్యారెజెస్ ఆర్ నాట్ ఫర్ రిక్రియేషన్ బట్ ఫర్ క్రియేషన్
వివాహం కేవలం విలాసానికి కాదు
సృష్టి ధర్మం సజావుగా,సక్రమంగా సాగటానికి హేతువు
వివాహం కేవలం స్త్రీ,పురుషుల మధ్య
భౌతిక సంబంధం మాత్రమే కాదు
భూమ్యాకాశాల మధ్య,భువిని, దివిని కలిపి ముడివేసే
మహత్తరమైన పవిత్ర బంధం
వివాహం, పరిపూర్ణులైన ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు
క్షమాగుణం, దయ అనే విలువలు నేర్చుకునే
అసంపూర్ణ ఇద్దరు వ్యక్తుల కలయిక
సహధర్మచారిణి అనేపదం చాలా విశిష్టమైనది
అన్నిరంగాలలో పాశ్చాత్య ధోరణులు ప్రబలుతున్న ఈ కాలంలో
భారతీయ వివాహ వ్యవస్తలోని అంతర్యాన్ని,ఔన్నత్యాన్ని
ఈ కాలపు యువతీ యువకులు అర్ధం చేసుకోవాలి
విభిన్న వర్ణాలు ఏకమైన ఇంద్రధనుస్సు ఎలా మనోరంజకమో
దాంపత్యం కూడా అలా రాగరంజితం కావాలి
అన్యోన్య దాంపత్యమంటే అణగి మణగి వుండటం కాదు
భర్త సంతోషమే భార్యది, భార్య సంతోషమే భర్తదని గుర్తెరగాలి
జీవిత భాగస్వామికి ఎలా వుంటే నచ్చుతుందో
ఎలా వుంటే నచ్చదో కూడా ఇరువురూ ఆలోచించాలి
లేకపోతె స్వీట్ హోం కాస్తా హాట్ హోంగా మారుతుంది
పూవులా వికసిస్తేనే అందం
పరిమళ వాతావరణంలో తనువు మనసు
హాయిననుభవిస్తాయి,సేదతీరుతాయి
పంతాలు,పట్టుదలలు,ఘర్షణలు తెగేదాక లాగొద్దు
విసుక్కోవడాలు,కసురుకోవడాలతో సమస్యలు కొలిక్కి రావు
వివేకంతో ఒకరి అలవాట్లు మరొకరు అర్ధం చేసుకోవాలి
గొప్పదైన వివాహబంధం,భార్యాభర్తల సమిష్టి కృషితోనే సాధ్యం
పరస్పర గౌరవం,శృతిమించని ప్రశంసలు, దయ, ప్రేమలు
వివాహం విజయవంతమవటానికి ముఖ్య కారణాలు
సరైన భాగస్వామిని ఎంచుకోవటమే కాదు
సరైన భాగస్వామిగా కూడా ఉండాలి
భార్యాభర్తలిద్దరూ ఇంటికి సేవకులే , ఇద్దరూ యజమానులే
ప్రేమతో,ఓర్పుతో ఏమైనా సాధించవచ్చు
ఆగృహమే స్వర్గసీమ
ఈభూమిపై, అతున్నత సంతోషమేదైనా వుంటే
అది వివాహబంధం వలన వచ్చిన సంతోషమే
జైహింద్
ఏ.మోహన్ మురళి కుమార్ (తేజస్విని)

