మహిళా మాణిక్యాలు నా మాట
మేము నాలుగవ సారి అమెరికా 2012లో అమెరికాలో నార్త్ కరోలినా లోని షార్లెట్ కు మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడు ఛి అవధాని వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు లైబ్రరీలో తీసుకొని చదివిన అనేక పుస్తకాలలో మహిళల మీద రాసిన పుస్తకాలు నన్ను బాగా ఆకర్షించాయి .అందులో చాలా మంది మన వాళ్లకు తెలియనే తెలియదని పించింది . ఆ పుస్తకాలు ఆధారం గా వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్త్రీలపై అంతర్జాలం లో వరుసగా వ్యాసాలూ రాయటం ప్రారంభించాను .అవి అందర్నీ ఆకర్షించాయి .అదే సమయం లో ‘’విహంగ మహిళా వెబ్ మేగజైన్’’ మాస పత్రిక సంపాదకురాలు శ్రీమతి పుట్ల హేమలత గారు తమ పత్రికకు కూడా వ్యాసాలూ రాయమని కోరితే అమెరికా నుండే మహిళామతల్లుల మీదనే ఆ పత్రిక కోసం ప్రత్యేకం గా వ్యాసాలూ రాయటం ప్రారంభించాను .ప్రతి నెలా సుమారు పదిహేనో తేదీన మరుసటి నెలకు వ్యాసం రాయమని మెయిల్ రాసేవారు .అలానే రాసి పంపిస్తున్నాను .అందులో అచ్చు అయిన తర్వాతే సరసభారతి సాహితీ బంధువులకు పంపే వాడిని .దాదాపు పది హీను ఆర్టికల్స్ ఆ పత్రిక కు రాశాను .
ఇవి కాక అంతర్జాలం లో నేను ప్రతిబా వంతులైన స్త్రీలపై రాస్తూనే ఉన్నాను .ఇవన్నీ కలిపి ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరిట ఒక పుస్తకరూపం లో తేవాలని ఆలోచన ఈ మధ్యనే కలిగింది .ఏర్పాట్లు చేస్తూ విహంగ లో నేను రాయగా ప్రచురింప బడిన వ్యాసాలను ఈ పుస్తకం లో చేర్చటానికి శ్రీమతి హేమలత గారిని అనుమతించ వలసినది గా కోరగా వెంటనే సంతోషం తో స్పందించి పుస్తకం తెస్తున్నందుకు నన్ను అభినందిస్తూ ప్రోత్సహించి అనుమతి నిస్తూ నా వ్యాసాలను వరుస క్రమం లో నాకు పంపారు .వారికి కృతజ్ఞతలను తెలుపు కొంటున్నాను
సరసభారతి –సా హిత్య సంస్కృతిక సంస్థ
ఉయ్యూరు
‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తక రచనకు తోడ్పడిన పుస్తకాలు
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నాకు పంపి నాతో చదివించిన’’women of power and grace ‘’, ‘’Lincoln ‘s battles with God ‘’అనే రెండు పుస్తకాలు
మాతృశ్రీ పబ్లికేషన్ ప్రచురణ ‘’మాతృశ్రీ అనసూయా దేవి’’
తెలుగు విజ్ఞాన సర్వస్వం
ఇంగ్లీష్ వీకీ పీడియా
శ్రీ వాసవ్య రచించిన ‘’ప్రాచీన భారతీయ శాస్త్ర వేత్తలు ‘’
అమెరికా లో నార్త్ కెరొలిన లోని షార్లెట్ లో ఉన్న’’ బిల్లీ గ్రాహం’’లైబ్రరీలో నేను చదివిన అనేక ఆంగ్ల పుస్తకాలు
శ్రీ లకుమ కూర్చిన ‘’ఏం ఎస్ సుబ్బు లక్ష్మి ‘’పై వ్యాసాలు
వివిధ వార ,మాస ,దిన పత్రికలలో వెలువడిన వ్యాసాలూ
శ్రీ వకుళాభరణం రామ కృష్ణ గారు డొక్కా సీతమ్మగారి పై రాసిన వ్యాసం (దీనిని శ్రీ రామి నేని భాస్కరేంద్ర గారు నాకు పంపారు వారికి కృతజ్ఞతలు )
గబ్బిట దుర్గా ప్రసాద్
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
19-3-14-


