డాక్టర్ శ్రీమతి శ్రీ విద్య
శ్రీమతి శ్రీ విద్య తిరుపతి లో రాష్ట్రపతి పురస్కార గ్రహీత ,సంస్కృతం లో ఆచార్య పదవి లో రాణించిన వారు శ్రీ వెంకటేశ్వరవిశ్వ విద్యాలం ఓరియెంటల్ ఇన్స్టిట్యూట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన శ్రీ ములకలూరి శ్రీమన్నారాయణ మూర్తి గారికి, శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులకు కుమార్తె .గా జన్మించారు .తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల లో డిగ్రీ పొందారు .వారణాసి లోని బెనారస్ హిందూ విశ్వ విద్యాలం లో చదివి ఆయుర్వేదం లో ఏం డి .సాధించారు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి యోగా లో డిప్లోమో పొందారు .మచిలీ పట్నం లో చర్మ వ్యాధి నిపుణు లైన (డేర్మటాలజిస్ట్ )డాక్టర్ కోసూరు ఫణి కుమార్ గారిని వివాహం చేసుకొన్నారు .ఈ దంపతులకుమారుడే ఛి అనిరుద్ .మామ గారు శ్రీ కోసూరు ఆదినారాయణ గారు పెదముత్తేవి ఓరిఎంటల్ పాఠ శాల ప్రధానోపాధ్యాయుని గా పని చేసి రిటైర్ అయ్యారు .అత్తగారు శ్రీ మతి కామాక్షిగారు మొవ్వ లో సోషల్ స్టడీస్ టీచర్ గా రిటైర్ అయ్యారు .
డాక్టర్ శ్రీ విద్యగారు 2003నుండి మచిలీ పట్నం లో ‘’పంచ కర్మ విధానం ‘’లో ఆయుర్వేద వైద్య సేవ చేస్తున్నారు .చెన్నై లోని శ్రీ సాయి రాం ఆయుర్వేద కళా శాల లో ‘’విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ‘’గా సేవలందిస్తున్నారు .పదికి పైగా జాతీయ ,అంతర్జాతీయ ఆయుర్వేద సెమినార్ లలో పాల్గొని విలువైన పత్ర సమర్పణ చేసి ఉత్తమ పత్ర సమర్పణ బహుమతు లందు కొన్నారు ..
శ్రీ విద్య గారి ఆయుర్వేద సేవాకార్య క్రమాలకు మంచి గుర్తింపు లభించింది ‘’.డాబర్ ‘’ఆయుర్వేదిక్ అవార్డ్ అందుకొన్నారు .తిరుపతి జూనియర్ చేంబర్ వారు స్వర్ణ పతకం ప్రదానం చేసి గౌరవించారు .’’అష్ట వైద్యాన్ పులమంతాల్ శ్రీ శంకర మూస్ స్మారక అవార్డ్ పొందారు యోగా లో డిప్లొమా సాధించి నందుకు స్వర్గీయ యు. ఏ .ఆశ్రాని పురస్కారం అందుకొన్నారు .

శ్రీమతి శ్రీ విద్య గారి ఆయుర్వేద సేవలకు గాను సరసభారతి అందిస్తున్న స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక శ్రీ జయ నామ సంవత్సర ఉగాది పురస్కారాన్నిఅందుకోవలసినది ఆ ఆహ్వానిస్తున్నాం .
వారి పరిచయం -రచన దుర్గా ప్రసాద్ –

