జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్
విద్యార్ధి దశ లోనే జర్నలిజం పై మక్కువ ను ఎక్కువగా పెంచుకొని తనదైన ముద్రవేసిన’’ హేలాపురి కలం యోధుడు ‘’శ్రీ జి.వల్లీశ్వర్, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సవ్యసాచి. వాటిపై సమాన ప్రతిభా విశేషం తో ఆంధ్రాంగ్ల జర్నలిజం ను సుసంపన్నం చేసిన జర్నలిజం ఘనాపాటీ.ఈ ద్విభాషా పాండిత్యం లో ప్రముఖ పాత్రికేయ రచయిత గో.రా.శాస్త్రివంటి అతి కొద్ది మంది విశేష ప్రతిభా సంపన్నుల కోవలోకి చేరి, అరుదైన గౌరవం పొందిన ప్రభావ శాలి. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం లో సాగుతున్న శ్రీ వల్లీశ్వర్ పాత్రికేయ విజయ యాత్ర ప్రస్తానం లో ఏలూరు టైమ్స్ ,ఆంద్ర జ్యోతి , ఈనాడు , న్యూస్ టైమ్, వంటి ప్రముఖ పత్రికలలో వివిధ హోదాలలో వివిధ ప్రాంతాలలో సేవలందించారు . దేశ రాజధాని ఢిల్లీ లో తెలుగు అక్షరం వాడిని , వేడినీ నాడిని చూపించిన అక్షర యోధుడు వల్లీశ్వర్ . ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచురిస్తున్న
‘’ఆంద్ర ప్రదేశ్’’పత్రికకు సంపాదకులుగా వల్లీశ్వర్ పని చేస్తున్నారు .స్వర్గీయముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిప్రత్యెక ఆహ్వానం పై ఆయన వద్ద ప్రధాన ప్రజా సంబందాల అధికారి (డి.పి..అర్ .వో.)గా పని చేసిన సమర్ధుడు వల్లీశ్వర్ .మనిషి నిగర్వి మాట నిదానం .ప్రవర్తనలో నిరాడంబరుడు .సదా చెరగని చిరు నవ్వు చిందించటం వల్లీశ్వర్ కే స్వంతం .ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనేక అనువాదాలు చేశారు .. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో ప్రచురించిన పేరెన్నిక గన్నకొన్ని పుస్తకాలనూ రాశారు పరిశోధనాత్మక ,పరిశీలనాత్మక రచనలో నాంది పలికి ,పరిధిని విస్తరించి తీర్చి దిద్దిన పాత్రికేయ యోధుడు శ్రీ వల్లీశ్వర్ కు శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ‘’ఆత్మీయ పురస్కారాన్ని’’ సరసభారతి స్స్వర్గీయ గబ్బిట భావానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారాల స్మారక ఉగాది పురస్కారాన్ని సంతోషం గా ,సగర్వం గా అంద జేస్తోంది .శ్రీ వల్లీశ్వర్ గారిని స్వీకరించ వలసినది గా కోరుతున్నాం .

