శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి
విజయ వాడ ఆకాశ వాణి లో దశాబ్డాల పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ,కద లను చదవటం లో తనకు తానే సాటి అని నిరూపించుకొంటు ,బాలల కార్యక్రమాలను అద్వితీయం గా నిర్వహిస్తూ ,ప్రతి దాని లోను తనదైన ముద్ర వేసిన సాహితీ సంపన్ను రాలు శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి ..హాస్యానికీ ,లోతైన పరిశీలనకు ,పరిశోధనకు పెట్టింది పేరు అనిపించుకొన్న శ్రీపన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి అర్ధాంగి కృష్ణ కుమారి గారు .భర్త పేరు భట్టు ను వాడుకోకుండా స్వయం శక్తితో ఎదిగిన మహిళా మాణిక్యం .తెలుగు మహిళగా కట్టూ బొట్టూ తో చూడగానే పవిత్రత జ్యోతకం అవుతుంది .అదీ ఆమె స్పెషాలిటి .అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గా విశిష్ట సేవలందించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో కొంతకాలం ఉద్యోగించారు .సుబోధకం గా బాల సాహిత్య రచన చేసినందుకు కృష్ణ కుమారి గారికి ఆంద్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ తుర్ల పాటి కుటుంబరావు ,బాలసాహిత్య సృష్టికర్త ,గ్రంధాలయోద్యమ సారధి శ్రీ వెలగా వెంకటప్పయ్య గారల చేతుల మీదుగా విజయ వాడ పుస్తక మహోత్సవం లో పురస్కారాన్ని అందుకొన్నారు .

గత మూడు సంవత్సరాలుగా విజయ వాడ ఆకాశవాణి కేంద్రం లో పూర్తీ బాధ్యతలతో ముఖ్య సంచాలకులుగా సేవలందిస్తూ విభిన్న కార్యక్రమాలకు రూప కల్పన చేసి,ప్రసారం చేస్తూ ప్రశంసలను అందు కొంటున్నారు .సరస భారతి నిర్వహిస్తున్న శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గార్ల స్మారక ఉగాది పురస్కారాన్నిశ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి గారిని అందుకోవలసినడిగా సగౌరవం గా ఆహ్వానిస్తున్నాము .

