శ్రీ కొమరవోలు శివ ప్రసాద్
ప్రపంచ ప్రఖ్యాత ‘’గళ మురళీ విన్యాసకులు ‘’(ఈల పాట సంగీత విద్వాంసులు ),విజిల్ విజార్డ్ ,ఈలలీలాలోల గళమురళి,విజిల్ విజార్డ్ (ఈల మాంత్రికుడు ) శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు గుంటూరు జిల్లాలోబాపట్ల లో కే.ఎస్.వి .సుబ్బారావు రాజ్య లక్ష్మి దంపతులకు తొమ్మిదవ సంతానం సంగీత కుటుంబం లో గా1955ఏప్రిల్ 26న జన్మించారు ఏ గురువు వద్ద విద్య నభ్యసిమ్చాకుండా స్వతహాగానే వినికిదితో చిన్నప్పటి నుండి ఈల పాటపాడే వారు .ఈల పాట లో అద్వితీయ సాధన చేసి శాస్త్రీయత ను జోడించి సంగీత కచేరి లో ప్రపంచ ప్రసిద్ధులైనారు .ఈల పాటను ఆంద్ర దేశం లో మొదట ప్రారంభించింది స్వర్గీయ కే రఘురామయ్య గారు .ఆయననను ‘’ఈల పాట రఘుర్రామయ్య ‘’అని ఆప్యాయం గా పిలుచుకోనేవారు .ఆయన చూపుడు వేలును మడిచి నోటిలో ఉంచి గాలి పీల్చి వదులుతూ ఈల వేసి పాడేవారు .శివ ప్రసాద్ గారు ఏ సహాయం లేకుండా ‘’అసహాయ శూరులు’’లా ఈల పాట పాడుతారు .రఘురామయ్య గారికి ఈల పాట ఒక హాబీ .ఆయన ప్రఖ్యాత పౌరాణిక నాటక ,సినిమా నటులు .కాని శివ ప్రసాద్ గారికి ఈల పాట ‘’జీవన వేదం ‘’.ఉచ్చ్వాస నిశ్వాసాలు ,ఊపిరి .వీరికి పాట అలవోక గా గా పలుకుతుంది .అలుపూ సొలుపూ లేకుండా ఎన్ని గంటలైనా పాడుతారు .శివ ప్రసాద్ గారికి ఈల ఒక ‘’శ్వాశావధానం ‘’.రఘురామయ్య గారు ఈల కు’’ స్టేజి గౌరవం’’ కలిగిస్తే, శివ ప్రసాద్ గారు ఈలపాట కు ‘’అంతర్జాతీయ వేదికను నిర్మించి’’ ఒక కళ గా ‘’ఆర్ట్ ఫాం’’ గా మలిచారు .ఈలకూ తనకూ యెనలేని కీర్తిని ఆర్జించారు .

ఈల ఏమిటి ?దేనికి పనికొస్తుంది?వదిలెయ్యి అని శివప్రసాద్ గారిని ఎందరో మేటి సంగీత విద్వాంసులు నిరుత్సాహ పరిస్తే ,సంగీత కళానిధి శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారు మద్రాస్ లో తన ఇంట్లో ఉంచుకొని భోజన వసతి సౌకర్యాలు కల్పించి సంగీతం లోని మెలకువలన్నీ దగ్గరుండి నేర్పించారు . వారే తన మొదటి గురువు అని శివ ప్రసాద్ ఉప్పొంగి పోతారు . .బాల మురళి గారి భార్య శ్రీమతి అన్న పూర్ణ గారు నిజం గానే అన్న పూర్ణ లా కన్న కొడుకు లా ఆదరించారని కృతజ్ఞతలు చెప్పారు .తనను ప్రోత్సహించిన రెండవ వారు ప్రఖ్యాత సేహనాయ్ విద్వాంసులు భారత రత్న స్వర్గీయ బిస్మిల్లా ఖాన్ గారు .తాను కూడా ఇలానే అందరి నిరుత్సాహాన్ని పొందానని కాని షెహనాయ్ కి స్టేజి గౌరవాన్ని కల్గిన్చానని ,దానితో అందరూ గౌరవించారని ధైర్యాన్నిచ్చి ప్రోత్సహించారు .శ్రీనివాసన్ అనే వారు శాస్త్రీయ సంగీతాన్ని దగ్గర కూర్చో బెట్టుకొని నేర్పారు వీరందరి ఆడరమే తనను ఇంతటి వాడిని చేసిందని వినయం గా కృతజ్ఞతలు తెలియ జేస్తారు . లక్షలు ఖర్చు పెట్టి స్వంత కీ బోర్డు తయారు చేసుకొని కచేరీలు నిర్వహిస్తారు ..
శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,
ఆంద్ర ప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకరు ,మహా రాష్ట మాజీ గవర్నరు స్వర్గీయ కోన ప్రభాకర రావు గారు తన ‘’మెంటార్ ‘’అని కృతజ్ఞతలు తెలుపుతారు .అనేక స్టేజీ లపై తనను చిన్నప్పటి నుంచి ఈల పాట పాడించి ప్రోత్సహించారని, ప్రధాని ఇందిరా గాంధి వద్ద పాడే అవకాశం కలిపించింది వారేనని పది నిమిషాలు మాత్రమె వింటానని కూర్చున్న ఇందిర గంటకు పైగా వింటూ తన్మయురాలైనారని ,అది మరచి పోలేని అనుభవమని అన్నారు …బాల మురళి గారితో బిస్మిల్లా ఖాన్ గారితో కలిసి కచేరీలు చేశారు .ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీ హైదరాబాద్ రవీంద్ర భారతి లో ‘గల మురళీ విన్యాసం ‘’చేసి సాటి కళా కారులను ప్రోత్సహిస్తారు .
భగవాన్ సత్య బాబా గారి సమక్షం లో ఎన్నో కచేరీలు చేసి మెప్పు పొందారు .బాబా గారి ఆశీస్సులు పుష్కలం గా అందుకొన్నారు .బాబా గారి ఆదేశం ప్రకారం అమెరికా మొదలైన దేశాలలో పర్య టించి ఈల పాట సంగీతం ద్వారా ప్రేమ ,సేవ ఆనందాలను పంచుతున్నారు .
విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,- ఈల పాట కు శాస్త్రీయ స్థాయి కలిగించాలని ,యూని వర్సిటి స్థాయి లో ఈల పాటను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశ పెట్టించి నేర్పించాలని శివ ప్రసాద్ గారి ఆశయం .బాల మురళి గారు శివ ప్రసాద్ గారికి ‘’గళ మురళి ‘’అని బిరుదు నిచ్చారు ..అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరం లో2012 జూన్ లో ‘’తెలుగు సమాఖ్య’’ వీరికి జరిపిన సన్మాన సభలో ‘’’ఈల లీలా లోల ,‘’గళ వంశి’’బిరుదులనిచ్చి గౌరవించింది .ఒక మహర్షి ధ్యాన సమాధి లో ఉండి,,అనాయాసం గా అసంకల్పితం గా సంగీత శ్రోతస్విని ని జాలు వారుస్తున్నట్లు ఉంటుంది ఈ ‘’పరి పూర్ణ నాద యోగి’’ సంగీత స్రవంతి.సంప్రదాయ శాస్త్రీయ కర్నాటక సంగీతాం హిందూ స్తాని సంగీతం ,లలిత సంగీతం భక్తీ భావ సంగీతం సినీ సంగీతం ,ఫూజన్ సంగీతం అన్నీ వారి ఈల పాటల్లో ఒదిగి .వెలువడి మురిపించి మెరిపించి మై మర పిస్తాయి ..పరమేశ్వరుడు వారికి ఆయురారోగ్య భోగ భాగ్యాలనిచ్చి కాపాడాలని ,శివప్రసాద్ గారి సంగీత సరస్వతిని భారత ప్రభుత్వం గుర్తించి ‘’పద్మ పురస్కారం ‘’ అందజేసి అందరిని సంతృప్తి పరచాలని కోరుకొందాం .శ్రీ జయనామ ఉఆది వేడుకలలో సరసభారతి శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల యాభై వసంతాల వివాహ జీవిత ప్రత్యెక పురస్కారాన్ని అందుకోవలసినది గా శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారిని అభ్యర్ధిస్తున్నాం .

