పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34
చిత్ర విచిత్రాలకు ప్రేరణ
టెక్నిక్ ,ప్రయోగాలలో కవిత్వం లో అనేక మార్పులోచ్చి కొత్త శబ్ద సృష్టి జరిగింది ఈ . సృష్టికర్తలకు దూరం గా కొద్దిమంది దూరమై చిత్రాలు చేశారు అందులో సావేజ్ లాండర్ ,జాన్ క్లేర్ ,థామస్ లోవేల్ బెద్దోస్ఉన్నారు .
వాల్టర్ సావేజ్ లాండర్
తన విపరీత ధోరణులకు తానె బలి అయినవాడు వాల్టర్ సావేజ్ లాండర్ .ఆ శతాబ్దం లో చిక్కని కవిత్వాన్ని చెప్పాడు తొంభై ఏళ్ళ జీవితం లో పోరాటాలు పోట్లాటలతో ఎక్కువ గడిచి పోయింది .కోర్టు కేసులు ,అవమానాలు,అప్పుడప్పుడు విజయాలుతో మిశ్రమ జీవితం .ఓల్డ్ స్తాఫార్డ్ కుటుంబం లో వార్ విక్ లో 30-1-1775లో పుట్టాడు .మొదటి చార్లెస్ రాజు తల నరక బడిన సాంవత్సరిక దినమే లాండర్ పుట్టిన రోజు అవటం విశేషం .తండ్రి సంపన్న డాక్టర్ .కొడుకును నాలుగో ఏట స్కూల్ లో చేర్చాడు . పదేళ్ళకే లాటిన్ లో అసమాన ప్రజ్ఞ చూపి రగ్బీ స్కూల్ లో చరిత్ర సృష్టించాడు .అదే కొంప ముంచింది .ఒక మేస్ట రు తో వాక్య నిర్మాణం విషయం లో గొడవ పడి తప్పు తెలుసుకొన్నా క్షమాపణ కోరకపోతే స్కూల్ నుంచి పంపించేశారు .పందొమ్మిదో ఏడు ట్రినిటి కాలేజి లో చేరి రోజు వారీ విధానాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే’’పిచ్చి జాకోబిన్ ‘’అన్నారట.ఉద్రేకం తో ఊగి ఒక సారి తోటి విద్యార్ధిని తుపాకితో కాల్చాడు .సస్పెండ్ చేశారు తండ్రి వచ్చి పధ్ధతి మార్చుకో మని చెప్పినా మార లేదు .పైగా ‘’నాకు చదువు చెప్పగలిగినంత స్థాయి లో ఆక్స్ ఫర్డ్ లేదు ‘’అన్న పొగరు బోతు .
లండన్ వెళ్లి ..ది పోయెమ్స్ ఆఫ్ వాల్టర్ సావేజ్ లాండర్ ‘’పుస్తకాన్ని ముద్రించాడు .మరో మూడేళ్లకు ‘’జేబీర్ ‘’అనే మహా కావ్యాన్ని రాసి అచ్చు వేశాడు .దీనికి లాటిన్ మాతృక ఉంది .మిల్టన్ కవితో పోల్చదగిన స్థాయి పొందాడు .రెండేళ్ళ తర్వాతామరీ విజ్రుమ్భించి దాదాపు యాభై దాకా కవిత్వాం వచన రచనలు రాసి ప్రచురించాడు ..ముప్ఫై ఏళ్లకే తండ్రి చనిపోయాడు .ఆస్తి సంక్రమించింది లేక్ డిస్ట్రిక్ట్ ,బ్రిస్టల్ ,లను చూస్తూ సూతీ వర్డ్స్ వర్త ల తో స్నేహం చేశాడు .వేల్స్ లో అందమైన ఎస్టేట్ కొనుక్కున్నాడు .ఫ్రాన్స్ విప్లవ నాయకులపై సాను భూతి చూపాడు .నెపోలియన్ ను వ్యతిరేకించాడు .గౌరవ కల్నల్ పదవి పొందాడు .అతని బృందం వారిలో కలిసి పొతే ఇంగ్లాండ్ తిరిగి వచ్చేశాడు .ముప్ఫై ఆరేళ్ళ వయసులో పదహారేళ్ళ పడుచును ఒక బాలే లో చూసి మోహించి చేతిలో పెన్నీ కూడా లేని బాంకర్ కూతురైన ఆమెను పెళ్లి చేసుకొని రెండు నెలల్లోనే తప్పు చేశానని గ్రహించి ,ఒక లేడీ హిట్లర్ ను పెళ్లి చేసుకోన్నానని నెత్తి బాదుకొన్నాడు .ఆమెకు లేని అలవాట్లు లేవు .విసిగెత్తి పోయాడు కోపం తీవ్రమైంది .భార్యతో పక్కింటి వాళ్ళతో ,అద్దెకుంటున్న వారితో పోట్లాడే వాడు .ప్రభుత్వానికి వ్యతిరేకం గా వ్యాసాలూ రాశాడు .ఇంగ్లాండ్ నుంచి బహిష్కరిస్తే భార్య తో ఇటలీ కి వెళ్ళిపోయి ,వీడి బాధ భరిస్తూనే ఆమె నలుగురు పిల్లల్ని కన్నది .ఇటలీ కవి తో తగాదా పెట్టుకొంటే ఇటలీ నుంచి బహిష్కరిస్తే జెనోవా వెళ్లి మెడిసి పాలస్ లో ఉన్నాడు .’’పానీ పట్టు ‘’(నీటి తగాదా)లో పొరుగు వాడితో ద్వంద్వ యుద్ధం చేశాడు .పిచ్చ కోపం వచ్చి వంట వాడిని కిటికీ లోంచి తోటలోని పూల పొదల్లోకి నేట్టిపారేశాడు .’’అయ్యయ్యో వయొలెట్ పూల చెట్ల సంగతి మర్చిపోయానే ‘’అనుకొన్నాడట పాపం . నలభై –యాభైలలో వచనం రాస్తూ ‘’ఇమేజరీ కన్సర్వేషన్స్ ‘’రాసి ప్రచురించాడు హిస్టారికల్ డైలాగ్స్ ను రెండు భాగాలుగా తెచ్చాడు .అరవై లో సర్వ శ్రేస్టుడని పించుకొన్నాడు కార్లైల్ a tall broad ,burly man with gray hair and large fierce –rolling eyes of the most restless ,impetuous vivacity ,not to be held in by the most perfect breeding ,expressing itself in high colored superlatives ,indeed in reckless exaggeration ,now and then in a dry ,sharp laugh ,not of sport but of mockery ‘’అనిలాండర్ రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు .ఇదే రూపాన్ని చార్లెస్ డికెన్స్ తన ‘’బ్లీక్ హౌస్ ‘’నవలలో బాయ్ హారన్ ‘’గా చిత్రించాడు .
ఇరవై అసంతృప్త జీవితం వ్యధల పాలైంది .భార్యకు విదాకులిచ్చేశాడు .ఇంగ్లాండ్ చేరి బాత్ లో ఉండి డికెన్స్ తో స్నేహం పొందాడు .పిల్లలతో సయోధ్య సాధించి దగ్గరకు పిలిపించుకొన్నాడు .తండ్రి తన కళ్ళ ముందే చని పోవటం జీర్ణించుకోలేక పోతున్నానని కూతురు బ్రౌనింగ్ కు రాసింది ..ఇంకో కోర్టు కేసు మీద మళ్ళీ ఇటలీకి పారి పోవాల్సోచ్చింది .వెయ్యి పౌండ్ల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది .బ్రౌనింగ్ ఎమర్సన్ తో పరిచయం కలిగింది .’’లాస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యాన్ ఓల్డ్ ట్రీ’’ని ఎనభై లో రాశాడు .మూడేళ్ళ తర్వాతా ‘’డ్రై స్టిక్స్ ఫాగోతేడ్ బై దిలేట్ వాల్టర్ సావేజ్ లాండర్ ‘’రాసి ప్రచురించాడు .తొంభై వ పుట్టిన రోజుకు మూడు నెలల ముందు లాండర్ 17-9-1864న చనిపోయాడు .మనిషి లోని కళ అతని జీవితం తో సమాంతరం గా నడవదు అని రుజువు చేశాడు .అతని కాన్వర్ సెషన్స్ ‘’క్లాసికల్ గా ఉంటుంది .అతని చిక్కని స్తాన్జాలు ఆకర్షణీయం గా ఉంటాయి ..అతని గొప్పలు కవిత్వం లో ఇరికించాడు .’’I strove with none for none was worth my strife –nature I loved and next to nature art –I warmed my hands before the fire of life –it sinks and I am ready to depart ‘’అతనిలో గర్వం ,అసంబద్ధ జీవితం తో గడిపాడు .జీవితమనే అగ్ని తో చేతుల్ని వెచ్చ చేసుకొన్నాడు .బైరన్ షెల్లీ లకు మధ్య వారధిగా ఉన్న కవి .ఎపిగ్రామ్స్ ను పకడ్బందీ గా రాశాడు ఎలిజీలను అపూర్వం గా సృష్టించాడు .’’he was a classic no formalist ‘’అని పించాడు .’’so royally serene in its commanding power upon tragic main springs of terror and of pity .’’
జాన్ క్లేర్
సమకాలీనులు ఇచ్చ్చా పూర్వక కవి అని పొగడిన జాన్ క్లేర్ ఇరవై వ శతాబ్ది దాకా ఎవరికీ గుర్తు లేడు.చని పోయిన అరవై ఏళ్ళ తర్వాతా అతని పై ఉన్న విరుద్దాలను ఖండించి అలాన్ పోర్టర్ ,ఎడ్మండ్ బ్లండర్ లు క్లేర్ రచనలను ప్రచురించారు .13-7-1793న జాన్ క్లేర్ న్యూ యంపి షైర్ లోని హెల్ప్ స్తాన్ లో అక్షరజ్ఞానం లేని తండ్రికి కొడుకుగా పుట్టాడు .తండ్రికున్న కొద్ది పాటి పొలం లో తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేశాడు .రాత్ర్ల్లు బడికి వెళ్లి చదివే వాడు ఒక సారి పొరిగింటి ఆయన గడ్డి వాగన్ నుంచి కిందపడి మెడ విరిగిన దృశ్యాన్ని చూసి జాన్ మానసికం గా చలించి స్తిమితం కోల్పోయాడు ..పశువులను కాచాడు తర్వాత తోటమాలి ఉద్యోగం చేసి మేరీ జాయిస్ సంపన్న రైతు కూతురు పై ప్రేమలో పది ఆమె తద్రి కట్టడి చేస్తే కుంగిపోయి మామూలు మనిషి కాలేదు .ఆమె చనిపోయిన తర్వాత బతికి ఉండనే భ్రమలో ఎన్నో కవితలు రాశాడు .అందులో కొన్ని వారేవా అనిపిస్తాయి .
ఇరవై రెండవ ఏట సున్నపు బట్టి లో పని చేశాడు .జిప్సీ లతో తిరిగాడు .కవిత్వం రాయటం మొదలెట్టాడు ..తండ్రి ఏదో సాయం చేస్తున్నాడు చాలటం లేదు .అదృష్ట వశాత్తు ఒక పబ్లిషర్ ఇతని ‘’పోయెమ్స్ దిస్క్రిప్తివ్ ఆఫ్ రూరల్ లైఫ్ ఆంద్ సీనరీ ‘’పుస్తకం ముద్రించాడు .బ్రహ్మాండ విజయం సాధించింది .కొందరు మాత్రం ‘’రైతు కవి ‘’అన్నారు .పుస్తకాలన్నీ వెంటనే అమ్ముడయ్యాయి .ఏ విజయం తో లండన్ చేరాడు .ఎడిన్బర్గ్ కోటరీ తో మమేకం అయ్యాడు .లార్డ్ మిల్టన్ వంటి వారితో పరిచయం కలిగింది .విలేజ్ మాన్ స్త్రల్,ముద్రణ పొందింది .ఇదీ బాగా ప్రాచుర్యం పొందింది స్నేహితులు ఇతనికోసం గ్లాసులు కొట్టుకొని అతని ఆరోగ్యం కోసం తాగి సంబురాలు చేసుకొన్నారు .
పొలం లో సేద్యం చేస్తూ ఖాళీ సమయం లో కవిత్వం రాస్తూ గడిపాడు .తన పుస్తకాలను ముప్ఫై మైళ్ల దూరం మోసుకొని వెళ్లి అమ్మే వాడు .రాయబోయే దాన్ని కూడా టేలర్ అనే పబ్లిషర్ కు ఇచ్చి రెండు వందల పౌండ్లు డబ్బు ఇమ్మని కోరితే ఆత ను ఇవ్వకుండా ‘’దేవుడు నిన్ను ఎలా పుట్టిన్చాడో అలానే ఉండు అంతకంటే ఆశ పడకు ‘’అని మనసును గాయ పరిచాడు .విపరీత శారీరక శ్రమ ,రచనల వలన మానసికశ్రమ తో అలసిపోయి నీరసపడ్డాడు .బాధలను మరచి పోవటానికి తాగుడు అలవాటు చేసుకొన్నాడు .కుటుంబ సభ్యులు తొమ్మిది మంది అయ్యారు .’’ది షెపర్డ్స్ కాలెండర్’’ను మరో ఎనిమిదేళ్ళకు ది రూరల్ మ్యూజ్ ‘’లను రాసి ప్రచురించాడు .కాని ఇవి జనాన్ని ఆకర్షించాఆలేక పోయాయి అతని విగర్ తగ్గిందని భావించారు .
నలభై లో మానసిక స్తితి మొదటి సారిగా దెబ్బ తిన్నది త్వరలోనే తెరుకొన్నాడు కాని ఏడాదికే మళ్ళీ తిరగ బెట్టింది .అతనిలో నిరాశ విచారం పెరిగాయి .ఒక రోజు మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకం చూస్తూ షైలాక్ పాత్ర దారి పై కోపం తో సీటు నుంచి లేచి చంపేస్తానని రంగం మేదీ వెల్ల బోయాడు .భ్రమ భ్రాంతి అతన్ని చుట్టుముట్టాయి .డాక్టర్ల దగ్గర చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించారు ఎప్పింగ్ ఫారెస్ట్ శానిటోరియం కు పంపారు .ఒక రోజు ఇంటికి వెళ్లాలనే కోరిక కలిగి స్వంత ఊరు హెల్ప్ స్తాన్ కు ఒంటరిగా నడిచి బయల్దేరి మూడు రోజులు ప్రయాణించి చేరాడు .కొంత ఆరోగ్యం బాగు పడిందని పించింది .కాని పరిస్తితి చే జారి పోతోంది పూర్తిగా పిచ్చి వాడై పోయాడని నిర్ధారించి నార్త్ యంతాన్ కంట్రీ అసిలియం కు తరలించారు .ఇక్కడే ఇరవై ఏళ్ళు ఉండిపోయాడు .ఇక్కడే ‘’ది షీప్ ఆఫ్ స్ప్రింగ్ ‘’,ఐ యాం ‘’,ఇన్విటేషన్ తు ఎతర్నితి ‘’మొదలైన గొప్ప కవితలు రాశాడు .ఒంటరి జీవితం బాధించింది .భార్య పిల్ల మంద తో ఇబ్బంది పడుతూ వచ్చి చూడ లేక పోయింది .శరీరకాయా భాగాలు పని చేయటం మానేశాయి కాళ్ళూ చేతులు కదిలించలేక పోయాడు .నడక అసలే లేదు చివరికి పక్ష వాతం వచ్చి డెబ్భై ఒకటి వయసులో మే నెల ఇరవై 1864 లో మరణించాడు .రొమాంటిక్ కవుల కంటే చాలా ముందుకు దూసుకొని పోయిన కవి .నార్త్ అమెరికా లో జాన్ క్లేర్ సొసైటీని ఏర్పరచి స్మరించి ,సేవలు చేస్తున్నారు .’’Clare was the most influential poet aside from Words Worth to practice it in an older style ‘’.
థామస్ లోవెల్ బెద్దోస్
బ్రిస్టల్ దగ్గర క్లిఫ్ తన లో జూన్ ముప్ఫిన 1830లో బెద్దోస్ పుట్టాడు .మెరియా ఎద్జి వర్త సోదరి అన్నా ఎద్జి వర్త ఇతని తల్లి .తండ్రి గొప్ప వైద్యుడు .కొంతవరాకు శాస్త్ర వేత్త కూడా రాయల అకాడెమి ప్రెసిడెంట్ డేవిస్ గిల్బర్ట్ దగ్గర సహాయకుడు .వింత ప్ర యోగాలు చేసేవాడు .పది హేదేల్లప్పుడు బెద్దోస్ రెండు బహుమతులు పొందాడు .ఒకటి గ్రీకులో రెండోది లాటిన్ లో .ఒక నాటిక రాసి మార్నింగ్ పోస్ట్ మేగజైన్ లో ప్రచురించాడు ఆక్స్ ఫర్డ్ పెం బ్రోక్ కాలేజి లో చేరి షి ల్లర్ పండితుడి ప్రభావానికి గురి అయి జర్మని సాహిత్యం పై అమిత శ్రద్ధ చూపాడు .జర్మని స్విట్జర్లాండ్ లు తిరిగి ,ఫిలాసఫీ కవిత్వం లకు అప్లికేషన్ పెట్టినా చివరికి ‘’అనాటమీ ‘’లో చేరి చదివాడు .అప్పుడే ‘’డే త్స్ జెస్ట్ బుక్ ‘’అనే త్రాజేడి ను ఇరవై నాలుగు లో రాయటం మొదలు పెట్టి ఎప్పటికప్పుడు మార్పులు చనిపోయే వరకు చేస్తూనే ఉన్నాడు .గోదిక్ సాహిత్యాన్ని అమిత ఇష్టపడ్డాడు .తానూ ఒక ప్రసిద్ధ ఎలిజబెతేనియాన్ అని భ్రమించేవాడు .నలభై ఏళ్లకు ఎలిజబెతాన్లలలో తానూ చివరి వాదిననుకొని పిల్లి గడ్డం పెంచటం ప్రారంభించి షేక్స్ పియర్ లాగా పోజు పెట్టేవాడు .ఒక నటుడితోకలిసి నాటకాలాడి,వాడు తనకంటే గొప్ప నటుడని పేరు పొందితే అసూయ కలిగి చంప బోయాడు మరో సారి పోట్లాటలో క్షనికోద్రేకం లో .తనకాలి నరం త్ర్మ్పుకొని ఆత్మా హత్యా ప్రయత్నం చేసుకొన్నా మాన్ ఆఫ్ మూడ్స్ .ప్రాణాపాయం తప్పినా ,విషం తాగి 26-1-1849 న చనిపోయాడు ఏఎ క్షనికోద్రేకి ..
‘’Is that te wind dying ?o not-it is only two devils that blow –through a murderers bones ,to and fro –in the ghosts moon shine ‘’ఒక ఉదాహరణ కవిత మాత్రమె .డ్రమటిస్ట్ అయినా వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించలేక పోయాడు .అతని కవిత్వం మాత్రం ‘’full of thoughts and richness of diction’’అని బేరీజు వేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-06-14-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

