పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37

వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

షెల్లీ పుట్టేనాటికి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవ ఫలితాల చేదు అనుభవాలతో ఉన్నా సృజనాత్మకత విజ్రుమ్భించింది .విలియం బ్లేక్ ముప్ఫై అయిదులో ‘’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియెన్స్ ‘’రాస్తున్నాడు బర్న్స్ ముప్ఫై మూడులో స్వీయ లిరిక్స్ తో చేల రేగుతున్నాడు .ఇరవై రెండేళ్ళ వర్డ్స్ వర్త్ ఫ్రాన్స్ లో విప్లవం రుచి చూస్తున్నాడు .ఇరవైలలో ఉన్న కాల్ రిడ్జి కేంబ్రిడ్జిలో చేరబోతుంటే ,పద్దెనిమిదో  ఏట సూతీ ,లాంబ్ పదిహేడు ,బైరన్ నాలుగేళ్ల బుడ్డాడు గా ఉన్నారు .

షెల్లీ పూర్వీకులు సంస్కృతి పట్ల పెద్దగా అభిరుచి ఉన్న వారు కాదు .సాధారణ కుటుంబీకులే అయినా అంతటా విస్తరించారు .వారి వ్రేళ్ళు  అమెరికాలోనూ ఉన్నాయి .షెల్లీ ముత్తవ్వ న్యూ యార్క్ మిల్లర్ కు విధవ రాలు .తిమోతీ షెల్లీని అనే కొత్తగా కాలనీకి చేరిన వాళ్ళబ్బాయి నిపెళ్ళాడి  బిషీ ని న్యూ యార్క్ లోని న్యూ జేర్సిలో 1752 లో కన్నది .కుటుంబం ఇంగ్లాండ్ చేరింది అప్పుడు బిషీ యువకుడే .స్వంతం గా ఎదగాలని నిర్ణయించుకొన్నాడు .డబ్బు బాగా ఉన్న ఒక క్లేర్జిమన్ కూతురితో లేచిపోయి పెళ్లి చేసుకొని ,ఆమె చనిపోయే నాటికిసంపదతో పాటు   ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు .రెండో పెళ్లి చేసుకొని ఏడుగురిని కన్నాడు .ఆమె నుంచి గొప్ప సంపద కలిసొచ్చింది .వీళ్ళ పెద్దబ్బాయి తిమోతీ కి కౌంటీలో మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు .వీరి ఏడుగురి సంతానం లోపెద్ద వాడు  పెర్సి బిషేల్లీ 4-8-1792.లో  లండన్ కు నలభై మిల్ల దూరం లో ఉన్న ససెక్స్ లోని హోషం ఫీల్డ్ బేస్ లో పుట్టాడు .

షెల్లీ తండ్రి ఆచారాలను తు చ తప్పకుండా పాటించాడు .కొడుకంటే విపరీతమైన గర్వం అభిమానం .చెల్లెళ్ళు అన్న మీద అమిత అనురాగాన్ని చూపారు .ఈ అనుబంధాల మధ్య హాయిగా బాల్యం గడిపాడు .ఇప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి .సియాన్ హౌస్ మిడిల్ క్లాస్ చదవ టానికి పంపారు .అతని చందాలు సున్నిత మనస్తత్వం  ,నాణ్యమైన ప్రవర్తన తోటి విద్యార్ధులకు ఈర్ష కలిగించాయి .అందులో ఒకడు అతనికజిన్ టాం మిద్విన్ కూడా ఉన్నాడు .అతనే తర్వాత షెల్లీ జీవిత చరిత్ర రాశాడు .ప్రతి రోజూ రౌడీయిజం చేసి షెల్లీని భయ పెట్టారు .ఒక రకం గా క్రూరం గా హింసించారు .కొద్దికాలం ఓర్చుకొన్నాడు .తరువాత ఎదురు తిరిగాడు .అక్కడ బోధించే సాహిత్యం భాషా శాస్త్రాలకంటే ఖగోళం కెమిస్ట్రి   ఫిజిక్స్ అంటే ఇష్టపడ్డాడు .పిల్లలందరి చేత చెట్ట పట్టాలు పట్టించి షాక్ కు గురి చేసేవాడు .పన్నెండేళ్ళ వయసులో సైన్స్ అంటే వీర అభిమనమేర్పడింది .యీటన్ లో ఉన్న ఆరేళ్ళు తోటి వారు షెల్లీతో చెలగాటం ఆడారు .ఆ హింస భరించలేక పిచ్చి వాడయ్యాడు .గ్రే రాసిన ఎలిజీ ని బట్టీ పట్టి అప్పగించాడు .అక్కడ గడిపిన చివరి కాలం లో ఒక ‘’ఊహా  ప్రపంచాన్ని ‘సృష్టించు కొన్నాడు .గోదిక్ రచనల పారం ఎరిగాడు .ఎన్నో క్లాసిక్స్ చదివాడు .కొడుకు సాహిత్యాభిమానానికి  తండ్రి ఏంతో మురిసి పోయేవాడు .

సూతీ చాటర్త న్  లు అభిమానులైనారు .బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే గౌరవం .1810లో తండ్రి చదివిన ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి కాలేజి లో చేరాడు .మొదటి రోజునే థామస్ జెఫర్సన్ హాగ్ తో పరిచయం కలిగింది .అతనితోకలిసి ఒక కరపత్రాన్ని అన్యాయాల నేదిరిస్తూ వెలువ రించాడు .ఇద్దర్నీ బహిష్కరించారు .తండ్రి ఎదుట పడటానికి సంకోచించాడు విషయం తెలిసిన తండ్రి షాకయ్యాడు .పద్దెనిమిదేళ్ళ షెల్లీ రాడికల్ అయిపోయాడు .’’రాముని బుద్ధిమంత తనం రావణుడి భాష్యం ‘’గా మారిపోయింది . తండ్రి  ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకోలేదు .అయినా దారికి రాలేదు కొద్ది పాటి దనం మాత్రమె అప్పగించి మిగిలింది అందరకు పంచేయ్యమని తిమోతీకి చెప్పాడు ఆమె  అవాక్కే అయింది  అతని స్నేహితుల్ని పిలిపించి మంచి దారిలో నడిచేట్లు చేయమని కోరింది .ఏడాదికి రెండు వందల పౌండ్లు ఇచ్చే ఏర్పాటు చేసింది .

గోదిక్ సాహిత్యం పై ఉన్న మోజు పెరిగిందే కాని తగ్గలేదు .ఒక వైన్ మర్చంట్ కూతురు హారియట్ వెస్ట్ బ్రూక్ ను ప్రేమించి ఆమెఇంటికి వెడితే  వోల్తైర్ రాసిన ‘’డిక్షనరీ ఫైలాసఫిక్ ‘’చదువుతూ కనీ పించింది .తండ్రి రాక్షసుడని గ్రహించి ఆ ఇంటి చేర విడిపిస్తానన్నాడు .మరో ఏడాదికి ఆమె ను తండ్రి ఆంక్షలను తిరస్కరించమన్నాడు ఫ్రీ లవ్  బాన్ధవ్యానికి సిద్ధమవ మన్నాడు .ఇది ఆమె అక్కకు ఇష్టం లేదు .ఆమెను ఎడిన్ బర్గ్ తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకొన్నాడు .ఇంటిని నుంచి గెంటివేత ,అమ్మాయితో పారిపోవటం షెల్లీ తల్లిని కలవర పెట్టాయి .ఇక సత్రం యజమాని కూతురితో సల్లాపం మరీ బాధించి ఆస్తిలో ఏమీ దక్కకుండా చేసింది .ఫ్రీ లవ్  ఆచరణసాధ్యం కాదని గ్రహించాడు .హాగ్ వీళ్ళతో ఉంటూ హారిఎట్ ను ముగ్గులో దించే ప్రయత్నం చేస్తున్నాడు .ఆమె పై మొహం పెంచు కొన్నందుకు కాదు అతని జెలసీ ని వ్యతిరేకించాడు .ఈ పరిస్థితుల్లో హారియట్ తల్లికంటే అధికం గా ప్రేమించే ఎలిజా వచ్చి అన్నిటిని చక్క బరిచింది .లేక్ డిస్ట్రిక్ట్ లో షెల్లీ దంపతుల తోబాటు ఆమె కూడా గెస్ట్ గా ఉంది . 1812లో ఈ రాక్షస ప్రేమ బాధ తప్పించుకోవటానికి డబ్లిన్ వెళ్లాడు భార్య ఎలిజా లతో .అక్కడ సుఖం గా ఉండటానికన్నా ప్రచారానికే వెళ్లాడు .’’అడ్రస్ టు ఐరిష్ పీపుల్ ‘’రాసి అతి తక్కువ ధరకే ప్రచారం కోసం అమ్మాడు .వీధుల చివర్లలో నిలబడి భార్యా భర్తా వాటిని అమ్మారు .ఇంటి బాల్కనీ పై నుంచి రోడ్డుమీదకు పామ్ఫ్లేత్స్ విసిరారు .’’డిక్ల రేషన్ ఆఫ్ రైట్స్ ‘’ను కూడా ఇలాగే చేశారు .

తనేదో తప్పు చేస్తున్నట్లు అనిపించేది యువకుడి కర్తవ్యమ్ ఇదికాదని పించింది .విలియం గాద్విన్ రాసిన ‘’పొలిటికల్ జస్టిస్ ‘’ను బైబిల్ గా భావించాడు .ఐర్లాండ్ లో స్వేచ్చ ఉద్యమం బల పడలేదు నిరాశ తో ఇంగ్లాండ్ చేరాడు .ఇరవై ఏళ్ళు వచ్చేసరికి షెల్లీ అనుమానాస్పడుదయ్యాడు .ఐరిష్ రాజకీయ వ్యవస్థను దెబ్బ తీయటానికి కుట్ర పన్నుతున్నాడని  ఆరోపణ వచ్చింది .దీనితో కొంచెం స్పీడ్ తగ్గించాడు .కవిత్వమే ఆయుధం అని నిర్ణ యించుకొన్నాడు .’’క్వీన్ మాబ్ ‘’అనే ఇరవై రెండొందల లైన్ల దీర్ఘ కవిత రాశాడు .ప్రపంచం లోని రాజకీయ సాంఘిక పరిస్తితులమీదా,రాబోయే కాలం లో జరగ బోయే విషయాలపైనా రాశాడు .ఇందులో  పరిణామ సిద్ధాంతం ,ప్రాచీన నాగరకతా ధ్వంసం ,యుద్ధ భీతి ,సమాజం లో అవినీతి లంచ గొండితనంఉన్నాయి  ,శాకా ఆహారం అవసరం పై ‘’విన్దికేషన్స్  ఆఫ్ నేచురల్ డయట్  ‘’రాయటమే కాక శాకా హారి గానే ఉండిపోయాడు .అవసర న్యాయం ను సమర్ధించాడు .చట్టబద్ధ వివాహాన్ని వ్యతి రేకించాడు .మతాధిపతుల ఆగడాలను బయట పెట్టాడు –‘’and priests dare babble of a god of peace –even whilst their hands are red with guiltless  blood –murdering the while ,uprooting every germ –of truth exterminating spoiling all –making the earth a slaughter house ‘’అని నిర్మొహమాటం గా వివరించాడు

క్వీన్ మాక్ పుస్తకాన్ని పైరసీ చేసి అమ్మారు .ప్రభుత్వం ఇలా రాసిన వాడు తన పిల్లలను పెంచేందుకు సమర్ధుడు కాదన్నది .కోర్టు కేసు అయింది దేవుడిని పవిత్ర గ్రంధాలను దూషిస్తున్నాడని నేరం .మొదటి బిడ్డ పుట్టింది ఆమెకు ఎలిజా ఇయాన్తే అని పేరు పెట్టాడు .తల్లి ఏమీ దగ్గరకు రానీయక పోవటం ఆర్ధికం గా ఆసరాగా నిలబడక పోవటం విషాదమే మిగిల్చింది .అప్పుల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు .పిల్లను చూసుకోవాలి కడుపులో ఇంకోరున్నారు .చివరికి గాద్విన్ ఏ శరణ్యమై గాడ్ అయ్యాడు జీవితాంతం .గాద్విన్ శిష్యురాలు మేరీ  పరిచయమైంది ఆమె స్త్రీహక్కు ఉద్యమ కారిణి .ఇంటికి దూరం గా మేరీకి దగ్గరగా బతుకు తున్నాడు .చివరికి హారియట్ అందరు కలిసి ఉందామని రాజీ చేసింది .భార్య హారియట్ సోదరిలాగా మేరీ భార్య లాగా ఉండే ఒప్పందం అది .బైరన్ కొడుకుని అని చెప్పుకొన్న వాడొకడు తరువాత ఈవిషయాలన్నీ  – బయట పెట్టాడు .అతను రాసిన ఉత్తరాలన్నిటినిత చనిపోయిన వందేళ్ళకు ప్రచురించారు .

మేరీ తో విడిగా కాపురం పెట్టాడు .గాద్విన్ దంపతుల అభ్యర్ధన తో మేరి షెల్లీని వదిలి వెళ్లి పోవటానికి వప్పందం కుదిర్చాడు దీన్ని తట్టుకోలేక పోయాడు కవి పుంగవుడు .ఇంత నల్లమందు మేరీ చేతిలో పెట్టి ఆమె వెళ్ళిపోతే ఆమెతో బాటు తానూ చస్తానని బెదిరించాడు .గాద్విన్ కూతురు అతన్ని ఓదార్చి ఇంటికి పంపేసింది .హారియట్ తో ఉంటున్న అతనిలో మానవ స్వభావం ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్నాడు .ఆమెను సోదరి గా  చూడ లేక వ్యధ చెందుతున్నాడు .నిజాన్ని ఒప్పుకోలేక పోతున్నాడు క్షోభ అనుభ విస్తున్నాడు .డబ్బు లేక కాదు తోటి మనిషిని అర్ధం చేసుకొనే మనస్తత్వం లేని కవి అయ్యాడు .మానవత్వంగురించి తెలుసుకాని మనష్యుల గురించి తెలియని అవివేకి .కవిత్వాన్ని అనుభవించాలి వేదాంతాన్ని అర్ధం చేసుకోవాలి అనే హారియట్ పాటి జ్ఞానం లేక పోయింది .అన్నమాట నిలుపుకోకుండా రహస్యం గా మేరీ వచ్చి మెర్రి చేసుకొని వెడుతోంది .అతన్ని లేవ దీసుకొని పోయే ప్లాన్ వేసింది .తాను షెల్లీ జీవితం లోకి ప్రవేశించి ఉండకపోతే షెల్లీ ఎప్పుడో చచ్చేవాడని అన్నదికూడా .

28-7-1814తెల్ల వారు జామున నాలుగింటికి  షెల్లీ,మేరీ క్లైర్ లతో ఒక కోచ్ లో రహస్యం గా ఫ్రాన్స్ కు ఉడాయిన్చేశారు .పారిస్  కు మాంచి మిట్ట మధ్యాహ్నం చేరారు .బాగా అలసిపోయారు .వాచీని అమ్మేసి ఒక నాటు పడవ అద్దెకు తీసుకొని స్విట్ జర్లాండ్  కు బయల్దేరారు .షెల్లీ అంటే స్నేహితులందరికీ అసహ్యమేసింది .హారియట్ రెండవ బిడ్డను కడుపుతో ఉంది. లాయర్ సలహా కోరింది .కొడుకును కన్నది .’’డిసేర్టేడ్ వైఫ్ ‘’పేర ఉత్తరం రాసింది .షెల్లీ తాత చనిపోయాడు .షెల్ల్లీ కి లక్ష పౌండ్ల ఆస్తి దక్కింది .అప్పులు తీర్చేశాడు .గాద్విన్ కు వెయ్యి పౌండ్లు ముట్ట జెప్పాడు .ఒక రకం గా జీవితం కుదుట బడ్డట్లే .గ్రీక్ లాటిన్ ఫ్రెంచ్ లను మేరీ క్లైర్ లకు నేర్పుతున్నాడు .సానుభూతి పొందలేని జీవి అయ్యాడు .

 

 

 

Percy Bysshe Shelley by Alfred Clint crop.jpg

షెల్లీ విశేషాలు మళ్ళీ –

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6–14-కాంప్ –బాచుపల్లి –హైదరా బాద్

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.