పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38
శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న- పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )
మేరీ కి పిల్లలు పుడుతూనే ఉన్నారు .గాద్విన్ పారసైట్ అయ్యాడని షెల్లీ బాధ పడుతూనే ఉన్నాడు .బిషప్ గెట్ లో ఒక ఏడాదే ఉన్నారు .ప్రతిచోట తనకు శత్రువులేక్కువైనారని భావించాడు .జేనేవా దగ్గర సేఖేరాన్ లో కాపురమున్నారు .బైరన్ వచ్చి చేరాడు .షెల్లీ బైరన్ లు కలిసి ఫ్రీ లవ్ సొసైటీ పెట్టారని గుసగుసలు వచ్చాయి .అందరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు .కొద్దికాలానికి బైరన్ ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు .గాద్విన్ కూతురు తండ్రి నిజ స్వభావాన్ని తెలియ జేస్తూ ఉత్తరాలు రాస్తోంది .లండన్ చేరిన నెలకే ఆమె ఆత్మ హత్య చేసుకొన్నట్లు తెలిసింది ..షెల్లీ షాకయ్యాడు .హారియట్ అకస్మాత్తుగా అదృశ్యమైంది .ఇది మరో షాక్ .ఆమె శవమై సేర్పెంటిన్ రివర్ లో తేలింది .ఆమె వయసు ఇరవైఒక్కటి మాత్రమె .ఎలిజా రాసిన ఉత్తరానికి షెల్లీ చలించలేదు .హారియట్ మరణం తో మేరీ ని పెళ్లి చేసుకొనే లైసెన్స్ వచ్చింది షెల్లీ కి .తన పిల్లల్ని ఇవ్వమని షెల్లీ ఎలిజా ను కోరాడు .కోర్టును ఆశ్రయించాడు .తండ్రిగా అనర్హుడు అని అనేక డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు .కోర్టు నమ్మి అతని చేతుల్లో పిల్లలు పాడై పోతారుకనుక పిల్లల్ని తీసుకొనే అర్హత లేదని తీర్పు నిచ్చారు .కోర్టులో ఓడిపోవటం తో డిప్రేస్ అయ్యాడు .క్లారా కు పిల్లాడు పుట్టినందుకు సంతోష పడ్డాడు .లీ హంట్ సర్కిల్ లో చేరిపోయాడు .ఇరవై రెండేళ్ళ కీట్స్ కవి వీళ్ళతో కలుస్తున్నా షెల్లీకి దగ్గర కాలేక పోయాడు .
మార్లో లో కాపురమున్నాడు .మేరీ తో మెర్రీ గా ఉంటున్నాడు .కవితా ఝరి పారిస్తూనే ఉన్నాడు .ముప్ఫై చిన్న కవితలను రాశాడు నాలుగు వేల ఎనిమిది వందల పంక్తుల దీర్ఘ కవిత ‘’దీ రివోల్ట్ ఆఫ్ ఇస్లాం ‘’రాశాడు .గాద్విన్ బెదిరిమ్పులేమీ ఆగలేదు .బైరన్ క్లైర్ గురించి, పుట్టిన పిల్ల గురించి పట్టించుకోలేదు .షెల్లీ ఆరోగ్యమూ తగ్గిపోతోంది మొదటి సారి గుండెపోటు వచ్చింది .ఇంగ్లాండ్ వదిలి ఆరోగ్యం కోసం ఇటలీ వెళ్లాడు .మిలన్ కు క్లైర్ అల్లెగ్రా ,పిల్లలు చేరారు .తొమ్మిది వారాలు అక్కడే ప్రదేశాలు తిరుగుతూ ,ప్లేటో రాసిన ‘’సిమ్పోజియాంస్ ‘’ను అనువాదం చేశాడు .మనిషి యొక్క వ్యక్తిత్వం కోసం అన్వేషణ ,కలయిక యేప్రేమ అన్నాడు .బైరన్ షెల్లీ కుటుంబానికి తన సౌధం వాడుకొనేందుకు ఇచ్చాడు షెల్లీ ‘’జూలియన్ అండ్ మద్దాలో ‘’రాయటం మొదలు పెట్టాడు .’’దిసెన్సి ‘’అనే ట్రాజేడి లో మొదటి భాగం రాశాడు .క్లారా డిసేంటరి వ్యాధితో బాధ పడి చనిపోయింది .శోకం లో ఉన్నా జూలియన్ రాస్తూనే ఉన్నాడు .క్లైర్ తో లవ్ ఎఫైర్ సాగిస్తున్నాడు .వీళ్ళ పాపానికి పుట్టిన పిల్లలెవరో ఎవరికీ తెలీదు .
ముగ్గ్గురూ నేపుల్స్ చేరారు .రాయటం తగ్గించి బోట్ షికార్లు ,రైడింగ్ సైట్ సీయింగ్ లో గడిపాడు .ఆరోగ్యమూ శక్తి సమకూడాయి .కుర్రాడిగా కనిపిస్తున్నాడు .రొమ్ చేరారు .రెండున్నర ఏళ్ళ కొడుకు విలియం చనిపోయాడు .లెగ్ హారన్ కు మకాం మార్చారు .ఫ్లారెన్స్ చేరుకొన్నారు మేరీ నాలుగో సంతానం గా పెర్సి ఫ్లారెన్స్ ను కన్నది .సెన్సి రాయటం పూర్తీ చేశాడు .’’the best thing I ever wrote ‘అనుకొన్నాడు .కాని మంత్లీ క్వార్టర్లీ రివ్యూలు ‘’అసంబద్ధం ,అవివేక రచన ‘’అన్నాయి ఫ్లారెన్స్ లో గాలి తీవ్రత ఎక్కువ .ఎప్పుడూ వర్షమే .పీసా వెళ్లారు .అక్కడ ఉన్నరెండు ఏళ్లలో అతని లోని జీనియస్ విజ్రుమ్బించాడు .’’ది మాస్క్ ఆఫ్ అనార్కి ‘’అనే శిఖరాయమానమైన కవిత రాశాడు అందులో ‘’rise like lions after slumber –in unvanquishable number –shake your chins to earth like dew –which in sleep had fallen on you –ye are many –they are few ‘’ .గొప్ప లైన్లు .ఇక్కడే అతని ‘’స్కైలార్క్ ‘’,క్లౌడ్ ,లవ్స్ ఫిలాసఫీ ‘’సెన్సిటివ్ ప్లాంట్ ‘’అనే అపూర్వ కవితలు రాశాడు .’’ఇంగ్లాండ్ ఇన్ 1819 ‘’రాశాడు .ఇక్కడి వేడి భరించలేక సాన్ గులియానో కు వెళ్లారు .అక్కడ వర్షాలు విపరీతమై నదులు పొంగి ప్రవహిస్తున్నాయి .వరదలు ముంచెత్తుతున్నాయి .టాం మెడ్విన్ వచ్చి చేరి షెల్లీ తో రాజకీయ సాహిత్య ప్రసంగాలు చేస్తూ షెల్లీకి తిండి ధ్యాసే లేకుండా చేస్తోంది .
ఇరవై తొమ్మిదో ఏట మరో అమ్మాయితో శ్రుంగారం రంగరించాడు.ఆమె ఇరవై రెండేళ్ళ ఏమిలా వివియాని .ఆమెకు కాన్వెంట్ చేర విడిపించి పెళ్లి చేసుకొని చాంపియన్ అవ్వాలను కొన్నాడు . .ఏమిలా షెల్లీకి స్పిరిట్యువల్ సిస్టర్ అయింది ఆమె తండ్రి పీసా గవర్నర్ .కేసును షెల్లీ డ్యూక్ దాకా తీసుకెళ్ళాడు .గవర్నర్ మరోపార్శ్వం జనానికి తెలియాలనే వాడు .’’ఎపి సైకిడియాన్ ‘’అనే కవితను దీనిపై రాశాడు .ఇందులో ‘’ప్లాటోనిక్ లవ్ ‘’ఉంది .అదేకాక ఫ్రీ లవ్ సెక్స్ కోరికా ఉన్నాయి .ఆరు వందల లైన్ ల కవిత ఇది .సంఘం లోని ఇరుకు మనస్తత్వాన్ని చూపాడు ,’’ with one child friend ,perhaps a jealous foe –the dreariest and longest journey go ‘’ఉదాహరణకు చూపాను .ఇది పూర్తీ అయి ప్రింట్ అయ్యే లోపే ఎమిలీ జైలు నుంచి పారిపోయి వేరొకరిని పెళ్లి చేసుకొని షెల్లీ కి షాకిచ్చింది .వందకాపీలు మాతమే వేయించాడు .
పీకాక్ అనే వాడు ఆధునిక ప్రపంచం లో కవిత్వానికి స్థానం లేదని రాశాడు .తన శక్తి యుక్తులను కూడా దీసుకొని కవిత్వానికి ఉన్న శక్తి సామర్ధ్యాలను నిరూపిస్తూ ‘’డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ ‘’రాశాడు .సమాజం లో కవిపాత్ర గొప్పదని వాదించాడు .’’lift evil from the hidden beauty of the world and make familiar objects be as if they were not familiar . ‘’అని చెప్పి కవిత్వ సామర్ధ్యాన్ని ‘’ever strengthens and purifies the affections enlarges the imagination and adds spirit to sense .poets are the un acknowledged legislators of the world ‘’అని ధంకా బజాయించి చెప్పాడు .ఈ చివరి వాక్యాన్నే అందరూ ఉదాహరిస్తారు అంత ప్రాచుర్యం పొందిన వాక్యం అది .
‘’అడనోస్ ‘’అనే చివరి గొప్ప కవిత రాశాడు అది మహా గొప్ప ఏకైక కవిత అంటారు .ఫిబ్రవరిలో కీట్స్ కవి రొమ్ లో చనిపోయాడు .ఏప్రిల్ కు కాని ఈ విషాద వార్తా షెల్లీకి తెలియ లేదు .అడనోస్ కూడా కవిత్వాన్ని సమర్ధించే మరో కవితే.కీట్స్ ను అతని క్షయ వ్యాధి కంటే విమర్శకులే అతిగా రాసి దారుణం గా చంపేశారని షెల్లీ అభిప్రాయ పడ్డాడు .లిసిడియాస్ తర్వాత గొప్ప ఎలిజీ గా యాభై అయిదు స్పెంసేరియన్ స్టాం జాలు గా రాశాడు .ఎక్కడా జోరు ,కాని భావం భాష తగ్గకుండా పకడ్బందీ గా రాశాడు .దుఖానికి పరాకాష్టగా నిలిచి పోయి షెల్లీని చిరంజీవి ని చేసింది .
‘’the one remains ,the many change and past –heaven;s light for ever shines –earth;s shadow fly –that light whose smile kindles the universe –that beauty in which all things work and move –by man and beast and earth are mirrors of –the fire for which all thirst now beams on me –consuming the last clouds of cold mortality ‘’అని చలించి జ్వలించి చెప్పాడు .ఈ దుఖం తో ఆగిపోలేదు .ఇంకా తన సృజన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు .కీట్స్ మరణం తర్వాత షెల్లీ పీసన్ లిటరరీ సర్కిల్ సభ్యుడయ్యాడు .లేరిసి లో గల్ఫ్ ఆఫ్ స్పీజియా దగ్గర చిన్న ఇల్లుకోనుక్కున్నాడు .అయిదుగురూ అక్కడే ఉన్నారు .ఇల్లు ఇరుకు మురికి కొంప అందులోనే సర్డుకొంటున్నారు .షెల్లీకి ఈత రాకపోయినా బోట్ షికారంటే ఇష్టం
పన్నెండు అడుగుల బోట్ ‘’ఏరియల్ ‘’ను కొన్నాడు విలియం తో కలిసి మొదటిసారి గా హేగ్ హారన్ కు బో ట్ నడుపుకొంటూ వెళ్లారు .బైరన్ ఇంటికీ వెళ్లి వచ్చారు .జూలై ఎనిమిదిన విలియం తోకలిసి లేర్సికి బోట్లో తిరిగి వస్తున్నారు .కాని ఇంటికి చేర లేక పోయారు .విపరీతమైన గాలి ,వర్షం నడపటం అసాధ్యం అని పించింది .బోట్ నదిలో తిరగ బడిపోయింది .మళ్ళీ లేవలేక పోయారు .రెండు వారాల తర్వాత వారిద్దరి శవాలు ఒడ్డుకు కొట్టుకోచ్చాయి .కీట్స్ రాసిన కవిత షెల్లీ జేబులో ఉండి పోయింది .కుళ్ళిన శవాలను బీచ్ ఒడ్డున సున్నపు పొరల్లో సమాధి చేశారు .మళ్ళీ కొన్ని నెలల తర్వాత వీరి అభ్యర్ధన పై తవ్వి తీసి శవాలను అప్పగించారు .షెల్లీ గుండె దెబ్బ తిన లేదట .ట్రేలావని అనే వాడు దాన్ని లాగేశాడు రొమ్ లోని ప్రోటేస్తంట్ సేమేటరిలో చితా భస్మాన్ని జాగ్రత్త చేశారు .ఇక్కడే కీట్స్ నూ సమాధి చేశారు ఇద్దరు కవులు ప్రక్క ప్రక్కనే సమాధిలో ఉండిపోయారు .ఇంకో నెల లో షెల్లీకి ముప్ఫై ఏళ్ళువచ్చి ఉండేవి .18-7-1822న షెల్లీ మరణించాడు .
షెల్లీజీవితం .’’a paradox of reason and irresponsibility ‘’అన్నారు .’’where music and moon light and feeling are one ‘’అన్నాడు విలియమ్స్ .షెల్లీ ని మాధ్యూ ఆర్నోల్డ్ ‘’a beautiful and ineffectual angels beating in the void his luminous wings in vain ‘’అంటూ కీర్తించాడు .కాని షెల్లీ లో మానవ దానవ స్వభావాలు రెండూ జమిలిగా ఉన్నాయని మనం తెలుసుకొన్న చరిత్ర చెబుతోంది .’’drive my dead thoughts over the universe ‘’అన్నాడు షెల్లీ .సమాజం లో కవి పాత్రను విస్పష్టం గా విప్పి చెప్పిన వాడు షెల్లీయే .ప్రకృతిలోని అన్ని స్వభావాలకు రూప కల్పనకవి చేస్తాడని చెబుతూ ‘’from these create he can –forms more real than living man –nursing of immortality ‘’
షెల్లీ స్ప్లిట్ పెర్సానాలిటి .మనిషి గమ్యం తెలిసిన కవి .హింస ,స్వేచ్చ ల మధ్య యుద్ధం గురించి రాశాడు .నిరాశ అంటే చిరాకు పడ్డాడు .నిజానికి ‘’అసలైన కవి ‘’అని పించాడు షెల్లీ .కవితల్లో శిఖరాయమానవైనవీ పాతాళానికి చేరినవీ రాశాడు .సంపూర్ణ వికాసం లేని కవితలు రాశాడనీ అన్నారు .అతని లిరికల్ పవర్ ముందుగా మనల్ని కట్టి పడేస్తుంది తర్వాత తల ఊపుకొంటూ మనం వెంటబడి పోతాం .స్కైలార్క్ కవిత అతని గుండెల లోతుల్లోంచి జలపాతం గా ఉబికిన కవిత .అలాగే ఒజిమండియాస్ కవితలో గొప్ప తాత్విక దృక్పధాన్ని వెలువరించాడు .
‘’the world;s great age begins anew –the golden years return –the earth doth like a snake renew –her winter weeds outworn ‘’
‘’heaven smiles and faiths and empires gleam –like wrecks of dissolving dream ‘’
Oh!cease –must hate and death return ?-cease must men kill and die ?-cease drain not to its dregs the urn –of bitter prophecy –the world is weary of the past –oh!night it die or rest at least ‘’
వంటి అమ్రుతోపమానమైన కవితా పంక్తులు రాసి అమరకవి అయ్యాడు షెల్లీ .కవిత్వ సారాంశాన్ని వీటిలో తెలియ జేసిన మహా కవి .’’such poems convey the very essence of poetry .-an unbodied joy so keen that in spite of every prejudice the world must listen and respond to it ‘’
శోక లోకైక చక్ర వర్తి అని పించుకొన్న షెల్లీ తో మన దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారిని పోలుస్తారు .కృష్ణ శాస్త్రి మరణిస్తే శ్రీ శ్రీ ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అని అన్నమాట మనాకందరికి గుర్తుండే ఉంది .రొమాంటిక్ కవుల్లో అగ్రేసరుడు నాలుగైదు తరాలను ప్రభావితం చేసిన వాడు .విక్టోరియన్ పరి రాల్ఫిట్ కవుల పై విశేష ప్రాభావం చూపాడు .దంటే రోసేట్టి ఆస్కార్ వైల్డ్ వంటి హేమా హేమీలకు గురు తుల్యుడు .బెర్నార్డ్ షా కారల్ మార్క్స్ ,సిన్క్లైర్ దోరో ,లకు మార్గ దర్శి .అనేక ఉద్యమాలకు రాజకీయ ఆలోచనలకు షెల్లీ భావాలే తోడ్పాటైనాయి .అహింసా విధాన ఆందోళనకు తెర తీసిన వాడు షెల్లీ
షెల్లీ పూర్తీ
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-14-కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్
‘’
