కస్టాలు -కన్నీళ్లు

కస్టాలు -కన్నీళ్లు

బాధలు -వ్యధలు 
ఆప్యాయతలు  -అనురాగాలు 
స్నేహాలు -చుట్టరికాలు 
జీతం- నాతం 
కధలు -కవిత్వాలు 
బాధ్యతలు -బరువులు 
ఆకలీ -దప్పులు 
గుండె చప్పుళ్ళు-గుండె కోతలు
గోదారీ జలాలు -మూసీ తీరాలు 
నచ్చటా లు -మెచ్చటాలు  
ఆత్మ గౌరవాలు  -అహంభావం కాని ఆత్మాభిమానాలు  
ఆపేక్షలు – ఆత్మీయతలు 
చిత్రాలు -జీవిత విచిత్రాలు 
ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు  
ప్రైజులు -పారితోషికాలు 
కుందుర్తి ,శ్రీవాత్సవలు -శివారెడ్డి  గోపాల చక్రవర్తులు    
మేనమామలు -పెద నాన్నలు 
ఊపిరి తిత్తులు తొలిచే పురుగులు -ఊరడించే సింగులు 
క్రిష్ణాపత్రికలు -సమాచార శాఖలూ 
అహంభావం తో కొట్టిన దెబ్బలు -మర్యాదగా తిరస్కరించిన తీరులూ 
ఉత్తరాలు -పరిచయాలు 
ఉత్తర పరిచయం తో -చేరువైన ఇల్లాలు 
ఇవన్నీ పడుగూ -పేకల్లా  
అల్లిన మీ జీవితం -ఒక చిక్కని గీతం 
వచన సంగీతం -కవిత్వ వచనం 
ప్రతి పదం లోపలి పొరలు చీల్చుకోచ్చినదే 
ప్రతిభావం నవ పరిమళ భరితమే 
చిత్రానికి సంగీతం అద్ది -కవిత్వానికి చిత్ర సొగసులు కూర్చి 
మీ జీవితాన్ని -జీవన గమనాన్ని 
ఆవిష్కరించిన తీరు -అమోఘం అత్యద్భుతం 
వీర్రాజు గారూ -అక్ష రాలను శోభావిలసిత శిల్పాలుగా 
చెక్కిన మీ ఓర్పూ -నేర్పూ నాన్యతో దర్శనం అనిపించింది 
అదొక ప్రవాహం -సుడిగుండం 
శక్తి జలపాతం -సంగమ క్షేత్రం 
భేషజం లేని -నిరాడంబర ఉత్కృష్ట  గమనం 
నిసర్గ రమణీ యానికి  నిలువెత్తు  దర్పణ మే  
శ్రీ వీర్రాజుదంపతులకు  నమస్కారాలు  మూడు నెలల క్రితం పరిచయమైనా మీరు ఆప్యాయం గా నాకు అందజేసిన ”పడుగు పెకల మధ్య జీవితం ” పుస్తకం నిన్నా ఇవాళ చదివే అవకాశం కలిగింది దాదాపుగా నాన్ స్టాప్ గా చదివా  ముగ్దుడిని  చేసింది . ఉండ బట్ట  లేక చేతకాని కవిత్వం షో కులకు  పోయి పైన ఏదో గిలికాను . నిజం చెప్పాలంటే మాటలు చాలవు చదివి అనుభవించాల్సిందే
ఇద్దరి ఆరోగ్యాలు బాగా ఉన్నాయని తలుస్తూ -దుర్గాప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.