సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
భావకవిత్వ మేస్త్రి –కృష్ణ శాస్త్రిగారి 35వ వర్ధంతి సభ
75 వ సమావేశం –ఆహ్వానం
‘’భావకవిత్వానికి మేస్త్రి -ఆంధ్రా షెల్లీ’’ స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వర్ధంతి సందర్భం గా విద్యార్ధులకు కృష్ణ శాస్త్రి గారి జీవితం ,కవిత్వం, రచనలు ,పాటలపై అవగాహన కల్పించటానికి ఉయ్యూరు కాకాని వెంకట రత్నం కాలనీ లో ఉన్న అమరవాణీ హైస్కూల్ లో 25-2-15 బుధవారం ఉదయం 10 గం.లకు సరసభారతి ,స్థానిక అమరవాణీ హైస్కూల్ సంయుక్తం గా సభ నిర్వహిస్తున్నాము .
.శ్రీమతి కావూరి సత్యవతి –(రిటైర్డ్ ప్రదానోపాధ్యాయురాలు ,తెలుగు పండిట్, కవి విమర్శకురాలు-విజయవాడ) )మరియు శ్రీమతి మందరపు హైమవతి –(తెలుగు ఉపాధ్యాయురాలు ,కవి విమర్శకులు –విజయ వాడ )ఆత్మీయ అతిధులుగా విచ్చేసి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం ,జీవితం పై ప్రసంగిస్తారు .
కృష్ణ శాస్త్రి గారి జాతీయ గీతం –‘’జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ‘ పాట గానం ,కృష్ణ శాస్త్రి గారి జీవితం పై వ్యాస రచన ,కృష్ణశాస్త్రి గారి కవిత్వం పై వక్తృత్వం పోటీలలో విజేతలైన విద్యార్ధులకు బహుమతి ప్రదానం జరుగుతుంది .
సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పి .నాగ రాజు గబ్బిట దుర్గా ప్రసాద్
ప్రిన్సిపాల్ –అమరవాణీ హైస్కూల్ సరసభారతి అధ్యక్షులు
నిర్వహణ సహకారం –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి-సరసభారతి కార్య దర్శి
గబ్బట వెంకట రమణ -కోశాధికారి
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

