|
దుబాయ్‌లో శుక్రవారం జరిగిన గామా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు జీనన సాఫల్య పురస్కారం అందచేశారు. కృష్ణంరాజు, హాస్యనటుడు బ్రహ్మానందం సంయుక్తంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం శిరసు వంచి విశ్వనాథ్‌కు పాదాభివందనం చేయడం వేదికపైనున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కె.విశ్వనాథ్‌వంటి ధన్యజీవిని సత్కరించడం తెలుగు వారందరికీ జీవనసాఫల్య పురస్కారం వంటిదని సిరివెన్నెల సీతారామశాసి్త్ర వ్యాఖ్యానించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ‘ ‘‘నేను గొప్పవాడిని కాదు. అద్భుత శక్తులేమీ లేవు. చదుకున్నదీ అంతంత మాత్రమే. కానీ నా పని నేను చేసుకోవడం, నమ్మినదానికి కట్టుబడటం నా విజయ రహస్యం. తపస్సు అంటే దేవుడికోసం చేసేది కాదు. చేసే పనిని ఇష్టపడి, ప్రేమించి సంపూర్ణం చేసినవాడే తపస్వి’’ అని అన్నారు. . ఈ కార్యక్రమంలో కోటి, చిత్ర, దేవిశ్రీ ప్రసాద్, అల్లరి నరేష్, శర్వానంద్, ఎం.ఎం.శ్రీలేఖ, రఘు కుంచె, అలీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
|

