33 కథల తర్వాత నచ్చిందిది.. ‘షమితాబ్‌’.

33 కథల తర్వాత నచ్చిందిది..
ఎనిమిదిన్నర నెలల గ్యాప్‌… 33 ిస్ర్కిప్టులు… ధను్‌షకు ఏవీ నచ్చలేదు. ఒకరోజు డైరెక్టర్‌ బాల్కీ నుంచి ఫోన్‌
వచ్చింది. స్టోరీ చెబితే వావ్‌ అన్నాడు. ఈ సినిమాలో ఇంకో పాత్ర చేసేది అమితాబచ్చన్‌ అని చెప్పేసరికి
మరుక్షణమే ఓకే చెప్పేశాడు. ఆ సినిమానే ‘షమితాబ్‌’. దాని ప్రమోషన్‌లో భాగంగా ధనుష్‌ హైదరాబాద్‌కు
వచ్చినపుడు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…
హైదరాబాద్‌కు మీరు తరచుగా వస్తుంటారా?
ఇక్కడ షూటింగ్‌ ఉన్నప్పుడు, స్నేహితులను కలవాలనుకున్నప్పుడు వస్తుంటాను. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. హైదరాబాదీలు చూపించే ఆప్యాయతను ఎప్పటికీ మరచిపోలేను. ఇక్కడి ఫుడ్‌ అన్నా కూడా నాకు చాలా ఇష్టం.
హిందీలో మీరు చేస్తున్న రెండో సినిమా ‘షమితాబ్‌’. ఆ సినిమా విశేషాలు ఏంటి? ఆ సినిమాను ఎంచుకోవడానికి కారణం ఏంటి? 
‘రాంజిహనా’ తరువాత సుమారు ఎనిమిదిన్నర నెలల పాటు 33 స్ర్కిప్టులు విన్నాను. కానీ ఏదీ నచ్చలేదు. ఫైనల్‌గా షమితాబ్‌ కథ బాగా నచ్చింది. ఎనిమిదిన్నర నెలల తరువాత ఒకరోజు బాల్కిగారు ఫోన్‌ చేసి ఒక సారి ఆఫీ్‌సకు రమ్మన్నారు. వెడితే కథ చెప్పారు. ఆయన స్టోరీ చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నాను. హిందీలో ఇదే నా రెండో సినిమా అని. పూర్తి ఫ్రెష్‌ కాన్సెప్ట్‌. ఈ సినిమాలో అమితాబ్‌ ఉన్నారని కూడా ఆయన చెప్పారు. వెంటనే ఓకె చెప్పాను.
‘షమితాబ్‌’ పేరు పెట్టడం వెనక ఏదైనా కారణం ఉందా? 
నా పేరు ధను్‌షలోని ‘ష్‌’, అమితాబ్‌ పేరు కలిపి టైటిల్‌ ఖరారు చేశారు. కానీ టైటిల్‌కు మరో ప్రాముఖ్యత కూడా ఉంది. బాల్కి తప్ప మరెవరూ ఇలాంటి టైటిల్‌ పెట్టలేరు. ఈ సినిమాలో నన్ను మాత్రం ధనుష్‌ అని పిలవరు. అది మాత్రం చెప్పగలను.
ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
నటుడు కావాలనే లక్ష్యంతో గ్రామం నుంచి పట్టణానికి వచ్చిన యువకుడి పాత్రను చేశాను. అతనికి మాటలు రావు. అమితాబ్‌ అతనికి వాయి్‌సను అందిస్తారు. వీళ్లద్దరి టాలెంట్స్‌ వృథా కానివ్వకూడదని కలిపే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్‌ అక్షర. అయితే వీళ్లిద్దరి ఇగోలు దెబ్బతిని క్లాషెస్‌ వస్తాయి. జీవితంలో సక్సెస్‌ కావాలంటే ఎందుకు కలిసి ఉండాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలియజేస్తుందీ చిత్రం.
మీ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు కదా! ఎలా ఫీలయ్యారు?
షమితాబ్‌ ఒక్కటే కాదు. నేను చేసిన ఏ సినిమా అయినా ఆయన సంగీతం నుంచి ఇనిస్పిరేషన్‌ పొందుతాను. ఆయన సంగీతం నుంచి సంతోషాన్ని, ప్రేమను పొందుతాను. ఇళయారాజా గారు తన సంగీతంతో షమితాబ్‌ను ఆశీర్వదించారు. తన పాటల ద్వారా స్టోరీ వెర్షన్‌ను చెబుతారు. షమితాబ్‌ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది.
తెలుగు బాగా మాట్లాడతారా?
తెలుగు నాకు బాగా అర్థమవుతుంది. మాట్లాడటం మాత్రమే రాదు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాటు లేదని గతంలా అన్నారు. ఎందుకు?
నిజంగా అది చాలా కష్టం. అందరూ ఎలా ఇస్తారో నాకు తెలియదు. ఒక్కో సినిమాకు మూడు నాలుగు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తోంది. అయితే ప్రతి సినిమాకు నాలుగైదు కామన్‌ క్వశ్చన్లు ఉంటున్నాయి.
ట్రేలర్‌లో అమితాబ్‌ కాలర్‌ పట్టుకుని లాగుతున్న సీన్‌ ఉంది. అలాంటి సీన్‌ చేయడం కష్టమనిపించిందా?
మీరు చెబుతున్న దాన్ని నేను కరెక్ట్‌ చేస్తాను. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్‌ మరో క్యారెక్టర్‌ కాలర్‌ పట్టుకుని లాగుతోంది. అంతే! ఒకవేళ నేను అమితాబ్‌గారి కాలర్‌ పట్టుకుని లాగుతున్నానని అనుకున్నట్లయితే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేను. కాబట్టి నేను ఎలాంటి సంకోచం లేకుండా చేశాను. ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ సినిమానే ముఖ్యం. అమితాబ్‌ సర్‌కి మేజర్‌ క్రెడిట్‌ దక్కుతుంది. ఎందుకంటే మేమందరం కంఫర్టబుల్‌గా నటించేలా చే శారు. ఈ సినిమాలో నాపాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను.
నార్త్‌ ఇండియాలోనూ, సౌత్‌ ఇండియాలోనూ హీరోలను ఫ్యాన్స్‌ ఆరాధించే విధానంలో తేడాను గమనించారా?
ఒకరోజు ఢిల్లీలో ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లాం. అమితాబ్‌ గారిని చూడటానికి చాలామంది ఎగబడ్డారు. అదే సీన్‌ దక్షిణాదిలోనూ కనిపిస్తుంది. ఒకవేళ రజనీ సర్‌ పబ్లిక్‌ ప్లేస్‌కి వెళితే సేమ్‌ సీన్‌ కనిపిస్తుంది. తేడా ఎక్కడ చూసానంటే మొదటి రోజు, మొదటి షో సెలబ్రేషన్‌లా ఉంటుంది. దాన్ని మీరు కూడా గమనించవచ్చు. కొందరి స్టార్స్‌ సినిమాలు రిలీజ్‌ అయిన రోజు పండగే. దీపావళి, దసరా ప్రతీ ఏడాది వస్తాయి. కానీ రజనీ సినిమా కోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు మనందరికీ పెద్ద పండగ.
మీ యంగర్‌ జనరేషన్‌లో హీరోలందరూ స్టార్స్‌గా ఫీలవుతున్నారా?
మేం కూడా స్టార్స్‌లా ఫీలయ్యేలా చేస్తుంటారు అభిమానులు. ఫ్యాన్స్‌ నుంచి లభించే ప్రేమ, మద్దతు మేం స్టార్స్‌ అనిపించేలా చేస్తాయి. దాన్ని మేం గౌరవంగా భావిస్తాం.
మీ డైరెక్టర్‌ బాల్కి గురించి చెప్పండి?
చాలా గొప్ప దర్శకుడు. ఆయనకు గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. దేశంలో ఉన్న గొప్ప దర్శకుల్లో అతనొకరు. షమితాబ్‌లో నాకు గొప్ప క్యారెక్టర్‌ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
అమితాబ్‌ గారే మీ పేరును బాల్కీకి సూచించారట. నిజమేనా?
నేననుకోవడం సౌత్‌లో ఈ సినిమా ఎవరు చేస్తే బాగుంటుందని బాల్కీగారు అమితాబ్‌ సర్‌ని అడిగి ఉంటారు. అప్పుడు అమితాబ్‌ గారు రజనీ సర్‌, ధనుష్‌ చేస్తే బాగుంటుందని చెప్పి ఉంటారు. ఆ తరువాత అమితాబ్‌గారే ధనుష్‌ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని ఉంటారు.
శృతిహాసన్‌, అక్షరహాసన్‌ ఇద్దరితో కలిసి పనిచేశారు కదా? ఇద్దరిలో తేడా ఏంటి?
ఇద్దరూ వేరీ టాలెంటెడ్‌. ఇద్దరూ ఇండివిడ్యువాలిటీ కోసం కష్టపడి పనిచేస్తారు.
 నేహారెడ్డి
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.